Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కమెడియన్ సద్దాం నిజంగా ఘంటసాలను అవమానించాడా..?!

November 16, 2026 by M S R

.

ఐనదానికీ, కానిదానికీ విమర్శ చేస్తే… చివరకు బలమైన విమర్శ చేయాల్సిన సమయంలోనూ విమర్శకు అసలు విలువ లేకుండా పోతుందని ఎవరో చెప్పారు… కొన్ని పోస్టులు, వీడియోలు కనిపించాయి… తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్లు..? ఏమనీ..?

‘ఒరేయ్ ఈటీవీ జబర్దస్తోడా, సిగ్గూశరం లేవారా..? మన హెరిటేజ్ ఘంటసాల మీద వెకిలి జోకులు వేస్తావా..? అవమానిస్తావా..? పోతావురరేయ్, నిన్ను జాతి, చరిత్ర క్షమించవు’… స్థూలంగా వాటి సారాంశం ఇదే… నో డౌట్… జబర్దస్త్ షో అంటేనే అది ఓ నీచమైన, దరిద్రగొట్టు, తలకుమాసిన, రోత, వెగటు షో…

Ads

ఈటీవీ, మల్లెమాల (ప్రస్తుతం నాగబాబు) టేస్ట్ అది… చాలా నోళ్లు తిట్టీ తిట్టీ అలిసిపోయి, ఇక తిట్టడమే మానేశాయి… అవి దళసరి చర్మాలని తేలిపోవడంతో… కానీ ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా ఈ విమర్శలు ఏమిటీ అంటారా..? ఒక స్కిట్…

అందులో సద్దాం, తన స్నేహితులతో కలిసి ఘంటసాల దగ్గరకు వెళ్తారు… మేమ్మీకు పెద్ద ఫ్యాన్లం సర్, మీ అపాయింట్‌మెంట్ కావాలి సర్ అనడుగుతారు… ఘంటసాలా? అని అడుగుతాడు సదరు ఘంటసాల కేరక్టర్ వేసే ఆర్టిస్టు… అవును సర్, ఘంటసాల అని సద్దాం బదులిస్తాడు… నాలుగైదుసార్లు అలా అయ్యాక ‘గంట చాలా’ అనడుగుతున్నాను అంటాడు ఆ కేరక్టర్…

తరువాత సద్దాం ‘పొట్టు పొట్టు ఆకలి ఉంది ఆయా షేర్, మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్’ అని రీసెంటుగా నాని సినిమాలోని ఏదో ఓ పాట చెప్పి, మీ స్టయిల్‌లో పాడండి అని కోరతాడు… సరేనని ఆ కేరక్టర్, పాత ఘంటసాల పాటల బాణీలో దాన్ని పాడతాడు… అందులో ఫన్ జనరేట్ చేయాలనేది సద్దాం తాపత్రయం…

సద్దాం

అదుగో ఆ స్కిట్ ఘంటసాలను అవమానించడమే అని రీసెంట్ పోస్టుల విమర్శ… నిజానికి అది మరీ అంతగా ఘంటసాలను అవమానించినట్టు ఏమీ లేదు… పాత సినిమా పాటల బాణీల్లో కొత్త పాటలు పాడితే ఎలా ఉంటుందనే ఓ క్రియేటివ్ ఐడియా… మరి ఫన్ జనరేట్ అయ్యేది ఇలాగే కదా…

సేమ్, ఇదే కాన్సెప్టును ఇదే సద్దాం వేరే టీవీ షోలో కూడా చేసినట్టు గుర్తుంది… నిజానికి సద్దాం మంచి టైమింగ్ ఉన్న కమెడియన్, కానీ ఎక్కడా నాలుగు రోజులు స్టడీగా ఉండలేకపోతున్నాడు ఎందుకో మరి… నాగబాబు జబర్దస్త్ బాధ్యతల్లో వేలు పెట్టాక ఈ సద్దాంను కూడా తిరిగి ఈటీవీ జబర్దస్త్‌ షోకు రప్పించాడు… ఈ స్కిట్‌లో సద్దాం స్నేహగణంలో పటాస్ ప్రవీణ్ కనిపించాడు…

అదేనండీ, ఫైమాతో లవ్వు, బ్రేకప్పు… ఆ ప్రవీణే, నిజానికి తను ఓ టీమ్ లీడ్ చేయాల్సినవాడు, గ్యాంగు మెంబర్ అయిపోయాడు పాపం…!! ఆమె ఇతన్ని కాదని పెళ్లి చేసుకున్న మరొకతని పేరు కూడా ప్రవీణే… ప్రవీణ్ నాయక్… అది వేరే కథ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కమెడియన్ సద్దాం నిజంగా ఘంటసాలను అవమానించాడా..?!
  • మీడియా ఏమైనా రాసుకోనీ… ప్రేక్షకుడి అసలు తీర్పు వేరు- వసూళ్లు వేరు..!!
  • ఎన్టీఆర్ ఓడి- కృష్ణ గెలిచి… రెండు సింహాల నడుమ నలిగిన గిరిబాబు..!!
  • ఓ మర్డర్ కేసును మలుపు తిప్పిన ఆ ఉత్కంఠభరిత మ్యాచ్!
  • MUSK – THE FANTASY BUILDER … కలల్ని కళ్ల ముందుంచుతాడు !!
  • చంద్రబాబు చెబితే నవ్వారు- కానీ భావి ప్రయోగాలు- ఆశలు మాత్రం అవే !!
  • అమెరికాపై అదృశ్య దాడి…? కుప్పకూలుతున్న వ్యవస్థలు… లాక్‌డౌన్ 2.0 కుట్రనా..?
  • రాజరికపు వైభవాన్ని వదిలేసిన తొలి జమిందారు! చదవాల్సిన చరిత్ర!!
  • నాటి యండమూరి నవల – రికార్డుల ‘వాయేజర్‌’పై నా గాఢాసక్తికి కారణం…
  • ఈతరం పిల్లలకు మైసూరు ‘కాస్మోస్’ ఎందుకు చూపించాలి..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions