Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేవంత్‌రెడ్డి సర్కారు నిజంగానే గద్దర్‌ను అవమానించిందా..?!

June 14, 2025 by M S R

.

ఎహె, అవార్డులకు ఎంపికైనవాళ్లంతా ఆంధ్రులే… ఇక తెలంగాణ అవార్డులు అన్నమాటకు అర్థమేముంది..? ఇది ఒక విమర్శ… అసలు సినిమా ఫీల్డ్‌తో సంబంధమే లేని గద్దర్ పేరు పెట్టడం ఏమిటి… ఇది మరో విమర్శ…

టేస్టున్న చిత్రాలను వదిలేసి పక్కా కమర్షియల్ చిత్రాలను అవార్డులకు ఎంపిక చేశారు, ఇది ఇంకో విమర్శ… ఈరోజు గద్దర్ అవార్డుల ప్రదానం చేస్తున్నారు…

Ads

కానీ బర్త్ డే గంజాయ్ పార్టీలో దొరికి కేసులో ఇరికిన ఒక మంగ్లీ గానం, తెలంగాణ జాతిగీతాన్ని నాసిరకం స్వరకల్పన చేసిన ఆంధ్రా కీరవాణి కచేరీ, సింగర్ ప్రవస్తి వివాదం ఉన్న ఆంధ్రా జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ , అలాగే ఆంధ్రా రామ్ మిరియాల గానం… తెలంగాణ ఆర్టిస్టులు పనికిరారా..? లేరా..? ఇదేం వివక్ష..? ఏమిటీ ధోరణి..? ఇది మరో విమర్శ… 

సరే, ప్రతి విమర్శకూ ఓ సమర్థన ఉంటుంది… కౌంటర్ కూడా ఉంటుంది… కొన్ని వదిలేస్తే… నిన్న సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి సర్కారు గద్దర్ అవమానించింది అనే ప్రచారం జోరుగా సాగింది… అఫ్‌కోర్స్, నమస్తే తెలంగాణ ఇంకొన్ని అడుగులు అదనంగా వేసింది ఆ దిశలో…

మైసూరు బోండాలో మైసూరు లేదు, నేతి బీరలో నేతి లేదు, గద్దర్ అవార్డుల్లో గద్దర్ లేడు అనే పోస్టులు బాగా వైరల్ అయ్యాయి… సరే,…

అవమానం ఎందుకయ్యా అంటే..? జ్ఞాపికల్లో గద్దర్ ఫోటో లేదు… ఆహ్వాన పత్రికల్లో లేదు… పేరుకే గద్దర్ అవార్డులు, కానీ తన ఆనవాళ్లే లేవు… ఆ అవార్డు క్రియేషన్ కూడా సరిగ్గా లేదు, ఒక చేయి చుట్టూ రీళ్లు, పైన తెలంగాణ ప్రభుత్వ కార్పొరేషన్ చిహ్నం ఉంది, అసలు గద్దర్ అంటేనే గొంగడి, డప్పు, చేతికర్ర కదా, అవేవి..? ఇదుగో ఈ విమర్శలే కాదు… 

గద్దర్ ఆనవాళ్లు లేకుండా చేయడంలో ఆంధ్రా సినిమా పెద్దల అభ్యంతరాలు, ఒత్తిళ్లు ఉన్నాయి, రేవంత్ రెడ్డి సర్కారు తలొగ్గింది అనే విమర్శల దాకా…. ఇందులో చంద్రబాబు మంత్రాంగం కూడా ఉందనే దాకా వెళ్లిపోయాయి విమర్శలు… చంద్రబాబు ఆంధ్రా బాబే కావచ్చుగాక, కానీ సినిమా అవార్డుల జ్ఞాపికలను కూడా ప్రభావితం చేస్తాడా..? హేమిటో ఇదంతా..?

కానీ ఒక తప్పు మాత్రం కరెక్టు కాదు… ఆహ్వానపత్రికల్లో గద్దర్ ఫోటో ఉండి ఉండాల్సిందే… తన ఫోటో లేకుండా తన పేరుతో అవార్డుల ప్రదానం బాపతు ఆహ్వానాలు ఏమిటి..? రేవంత్ రెడ్డి సర్కారు ముఖ్యులు, ప్రధానంగా సినిమాటోగ్రఫీ చూసే మంత్రి, అధికారులు ఇవన్నీ చూసుకోవాలి, దిల్ రాజు వంటి వాళ్ల మీద ఆధారపడితే అంతిమంగా బదనాం అయ్యేది రేవంత్ రెడ్డే…

సోషల్ మీడియాలో విమర్శల తరువాత దిద్దుబాటుగా ప్రచార ప్రకటనల్లో మాత్రం గద్దర్ బొమ్మ పెట్టారు అర్జెంటుగా… అసలు ముందే చూసుకోవాలి కదా…

gaddar

నిజానికి గద్దర్ పేరు పెట్టడం అంటేనే గద్దర్‌ను గౌరవించడం, స్మరించడం… పైగా ఆ జ్ఞాపిక కూడా ఓ క్రియేటివ్ రూపకల్పన… గద్దర్ అంటే డప్పు, గద్దర్ అంటే జానపదం… డప్పు పట్టుకున్న ఆ చేయి చుట్టూ సినిమాను ప్రతిబింబించేలా రీల్… పర్లేదు… మరీ తీసిపారేసినట్టుగా ఏమీ లేదు… పైగా ఆ అవార్డుల పేర్లే తెలంగాణ గద్దర్ సినిమా అవార్డులు కాబట్టి అందులో ఇక అవమానించడం ఏముంది..?

అవార్డులు ఇస్తున్నది తెలుగు సినిమాలకు… అవి ఆంధ్రా వాళ్లు తీశారా..? నార్త్ ఇండియన్స్ తీశారా..? అరవం క్రియేషన్సా కాదు… హైదరాబాదు కేంద్రంగా తెలుగులో తీయబడిన చిత్రాలు, అందులో నటీనటులు, ఇతర వృత్తి కళాకారులు, అంతే… అంతేతప్ప మరీ చంద్రబాబును కూడా ఈ విమర్శల్లోకి లాగేంత సీన్ లేదు..!!

ఏం చేసినా విమర్శేనా..? లోగో మారిస్తే చార్మినార్ బొమ్మ ఏది..? మత సామరస్యానికి భంగం అంటారు… చార్మినార్ ఒక మతచిహ్నమా..? కాకతీయ కళాతోరణం ఓ రాచరిక చిహ్నమే తప్ప అది హిందూ సింబల్ ఎందుకవుతుంది..?

తెలంగాణ తల్లి విగ్రహాన్ని సగటు తెలంగాణ గ్రామీణ మహిళగా రూపుదిద్దితే, పాత దేవత బొమ్మేదీ, ఇందులో దైవత్వం ఏదీ అంటారు..? తెలంగాణ తల్లి అంటే నగలు, కిరీటాలు గట్రా రాచరిక, దైవ సంబంధ రూపురేఖలు ఉండాలా..?

చివరగా…. ఈ గద్దర్ పేరును ప్రజాయుద్దనౌకగా పేరొందిన గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు స్మరణగా పెట్టారు, అసలు గద్దర్ అంటే పంజాబీ భాషలో విప్లవం అని…

అప్పట్లో బ్రిటిష్ పాలనను వ్యతిరేకించిన గద్దర్ పార్టీ నుంచి ఆ పేరును విఠల్ రావు స్వీకరించి, ఆ గద్దర్ పేరుతోనే ప్రఖ్యాతిని సంపాదించాడు… పోరాటగీతాలే ప్రాణంగా, బతికాడు… సో, గద్దర్ అనే పేరును ఎందుకు వ్యతిరేకించాలి ఎవరైనా..?! తెలంగాణ అంటేనే ధిక్కారం, తెలంగాణ అంటేనే పోరాటం, తెలంగాణ అంటేనే విప్లవం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జీమూత భల్లుడు… తెలుగు సినీ మహానగరంలో ఓ మాయగాడు…
  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions