ఎంతోమంది ఎన్నిరకాలుగా ట్రై చేసినా మోడీ అపాయింట్‌మెంట్ దొరకదు… అంతెందుకు, ఆయన పెద్ద పెద్ద జర్నలిస్టులకు, కీలక రాజకీయవేత్తలకే దొరకడు… అలాంటిది మోడీతో చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ ఉపాసనకు అంత టైం ఎలా ఇచ్చాడని చాలామందిలో ఆశ్చర్యం… ఆ ఫోటో చూస్తుంటేనే అబ్బురం… ఆమె స్వతహాగా వైద్య వ్యాపారి, అదేసమయంలో కాస్త డిఫరెంటుగా ఆలోచించే కేరక్టర్… పలుసార్లు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకునే పోస్టులు ఆలోచనాత్మకంగా ఉంటయ్… ఇంతకీ మోడీ ఆమెకు ఏ విషయంలో మాట్లాడటానికి అపాయింట్‌మెంట్ ఇచ్చి ఉంటాడు..? ఆమె ఏం మాట్లాడి ఉంటుంది..?
ఆమె ఏం షేర్ చేసుకున్నదంటే..? ‘‘‘భారత ప్రధానమంత్రి మోడీతో దుబాయ్-2020 ఎక్స్‌పో వద్ద భేటీ చాలా గౌరవప్రదం… పలురకాల కొత్త ఆవిష్కరణలు, ఆరోగ్య పరిరక్షణ, మహిళా సాధికారత, సంస్కృతీ పరిరక్షణల మీద ప్రధానంగా దృష్టి అద్భుతమైన అంశాలు… అలాగే సాంకేతిక శక్తి మనకు గొప్ప అవకాశం… దాన్ని తెలివిగా వాడుకోవాలి… చంద్రుని దక్షిణ ధృవంపై నీటి ఉనికి కోసం మనమే మొదటిసారి చంద్రయాన్ ప్రయోగం చేసింది, తెలుసా? ఇలాంటివి ఈ ఎక్స్‌పోలో చాలా అంశాలు ఉన్నయ్… మీ పిల్లలను అక్కడికి తీసుకెళ్లండి…’’ అని ఇన్‌స్టాలోని తన పోస్ట్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోయింది… హేమిటమ్మా… మోడీతో భేటీ ఏమిటి..? ఈ క్లాస్ ఏమిటి అని మనం ఆశ్చర్యపడేలోపు అసలు ఈ భేటీ ఫోటో అసలు నిజాన్ని చెప్పేసింది తనే…
Ads
అసలు ఆ ఫోటో నిజం కాదు… జస్ట్, ఒక ఏఆర్ క్రియేషన్… అనగా అగుమెంటెడ్ రియాలిటీ… అంటే టెక్నికల్‌గా మనకు ఓ కల్పనను నిజంగా భ్రమింపజేసేది… అలా ఈ ఫోటో కూడా ఓ క్రియేషన్… అదే ఇన్‌స్ట్రాగ్రాంలో పోస్ట్ చేసుకుంది… సో, మీ ఇష్టం… మీరు హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ వెళ్లారా..? జస్ట్, అక్కడే ఏదో బుక్ స్టాల్ వద్ద మోడీని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు, మీ పుస్తకాభిలాషను ప్రశంసిస్తున్నట్టు మీరు కూడా చేతనైతే ఓ ఏఆర్ ఫోటో క్రియేట్ చేసుకుని, ఫేస్‌బుక్‌లో లేదా ట్విట్టర్‌లో పెట్టేసుకొండి… మీరు ఏదైనా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతానికి వెళ్లారా..? అక్కడే మోడీతో కలిసి ఫోటోలు దిగినట్టు పెట్టేసుకొండి… తప్పేమీ లేదండీ… కొణిదెల కామినేని ఉపాసన చేస్తే తప్పులేదు గానీ మీరు చేస్తే తప్పా..? పైగా మనందరి ప్రధాని..!! నో, నో, ప్రధాని ఫోటోను ఇలా వాడేసుకోవడం కరెక్టు కాదు అంటారా..? ఏమోలెండి… నో కామెంట్…!!!
Share this Article