Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇస్మార్ట్ శంకర్..! ష్… కిమ్ తల వెనుక బ్యాండేజీ, మచ్చ వెనుక ఇంట్రస్టింగ్ కథ…!!

August 4, 2021 by M S R

ట్రంప్‌ చాలా చిరాకుగా ఉన్నాడు… తనకున్న బోలెడు వ్యాపార సంస్థల్లో ఒక్కడ స్టాఫ్ తప్పు లేదా పొరపాటు తేలినా సహించడు తను… వెంటనే తల తీసేస్తాడు, అంటే కొలువు గోవిందా… ప్రత్యేకించి ఏ ఉద్యోగి ఏం చేస్తున్నాడో చూసే ఇంటర్నల్ విజిలెన్స్ వింగ్‌కు చాలా ప్రయారిటీ ఇస్తాడు… మస్తు జీతాలు, సౌకర్యాలు, వాళ్ల ఖర్చు మీద నో ఆడిటింగ్… అలాంటిది తన మీద సవాల్ చేసిన ఆ నార్త్ కొరియా కిమ్‌ను సహిస్తాడా..? చిన్న మిస్సయిల్‌తో కొడితే మూతి పళ్లు రాలుతాయిరా అని నన్నే తిట్టేస్తాడా..? ఖతం చేయాలని ఆదేశించినా సరే సీఐఏ వాళ్లు ఏమీ చేయలేక పోతున్నారు… అరె, అంతటి హార్డ్ కోర్ చైనాలో కూడా బోలెడు మంది ఏజెంట్లను పెట్టుకున్నాం… అప్పట్లో రష్యాలోనూ చాలా ఆపరేషన్లు చేశాం… మనం అడుగు పెట్టని, అరాచకం సృష్టించని దేశం ఏమైనా ఉందా అసలు..? అలాంటిది కిమ్ ఎంత..? సోదరుడికి డప్పు కొట్టే తప్పు చేస్తున్న కిమ్-యో-జాంగ్ ఎంత..? కానీ మన ఏజెంట్లు వీసమెత్తు రిజల్ట్ చూపించలేకపోతున్నారు… ఎలా..? అసలు అమెరికా పరువు, వ్యక్తిగతంగా నా పరువు, సీఐఏ పరువు ఏమైపోవాలి…? ఆ డెమక్రటిక్ లీడర్ బైడెన్‌తోపాటు ఆ చైనా జిన్‌పింగ్ కూడా నన్ను చూసి నవ్వుతున్నట్టుగా అనిపిస్తోంది… ఏం చేయాలి..? ఇదీ ట్రంపు కోపానికి కారణం…

సీఐఏ చీఫ్ గినా హాస్పెల్‌ను పిలిచాడు… రక్షణ శాఖ, ప్రెసిడెంట్స్ ఆఫీస్ ముఖ్యులు ఎవరూ లేరు…

  • చూడు గినా, నీవల్ల అవుతుందా లేదా..? ఆ కిమ్ ఎంత..? వాడి దేశమెంత..?
  • సార్, అన్ని ప్రయత్నాలూ చేస్తూనే ఉన్నాం, ఆ దేశంలో చీమ చిటుక్కుమన్నా బయటికి లీక్ అయిపోతోంది… మనవాళ్లు దక్షిణ కొరియా సియోల్‌లో అడ్డా వేసి బోలెడు ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు… 
  • నీకు నెల రోజులు టైమ్, అసలే ఎన్నికలు వచ్చేస్తున్నయ్, నేను బిజీ అయిపోతాను
  • సరే సర్, ఓ ప్లాన్ వేసి పెట్టాం, సక్సెస్ కావచ్చు… తరువాత మీకు రిపోర్ట్ చేస్తాను

ఆమె వెళ్లిపోయింది… కీలక ఏజెంట్లతో కంటాక్టులోకి వెళ్లింది… ఏం చేయాలో ఆర్డర్ వేసింది… ఏదో దౌత్య సంబంధాల కోసం జిన్‌పింగ్ పిలవగానే ప్రత్యేక రైలులో చైనాకు వెళ్లి, తిరిగి ఉత్తర కొరియా రాజధాని పాంగ్‌యాంగ్ వాపస్ వెళ్తున్న కిమ్ రైలులోకి ఓ కొరియన్ ఏజెంట్‌ను ఎక్కించారు… కిమ్‌లాగే ఉండే ముగ్గురు నలుగురు డమ్మీలు ఎప్పుడూ కిమ్ వెంట తిరుగుతుంటారు… భద్రత చర్యలు, ప్రత్యర్థుల కళ్లుగప్పటానికి..! సీఐఏ ఏజెంట్ కూడా ఆ వేషంలోనే రైలులో జొరబడ్డాడు… కిమ్ సీక్రెట్ రాయల్ బోగీ దాకా వెళ్లాడు… లోపలకు ఎంటరై కిమ్‌కు మత్తు ఇచ్చాడు… జాగ్రత్తగా బయటికి వచ్చి, కిమ్‌తోసహా బయటికి దూకేశాడు… కొరియా సరిహద్దులు చేరేసరికి సీఐఏ ఛాపర్లు రెడీ ఉన్నయ్… కిమ్‌ను సియోల్ చేర్చారు…

Ads

mark on head

ట్రంపుకి కాల్ వెళ్లింది…

  • సర్, మత్తు నుంచి తేరుకుంటున్నాడు, సైనైడ్ ఎక్కించమంటారా..? 
  • వద్దు, ప్రపంచ రాజకీయాలు కాస్త చికాగ్గా ఉన్నయ్, మనం చెప్పినట్టు వినేలా ఏదో ఒకటి చేయండి
  • వోకే సర్…

అదేదో సినిమాలో చేసినట్టు… కిమ్ స్కల్ ఓపెన్ చేశారు, ఓ చిప్ బిగించారు, అది ప్రిప్రోగ్రామ్డ్ డివైజ్… తిరిగి కుట్లేసి, బాండేజీ అతికించారు… ఈలోపు కిమ్ సోదరి ఆందోళన పడిపోయింది… కిమ్ డమ్మీలను దేశంలో అక్కడక్కడా తిప్పుతూ, కిమ్‌కు ఏమీ కాలేదు అనే కలరింగ్ ఇస్తోంది… ఇక సీఐఏ ఏజెంట్ ‘ఇంజనీర్డ్ బుర్ర’తో ఉన్న కిమ్‌ను తీసుకుపోయి పాంగ్‌యాంగ్ దగ్గర వదిలేశాడు… నార్త్ కొరియా అధికారులు అతన్ని రాజప్రాసాదంలో చేర్చారు… ఒక్క ముక్క కూడా బయటి ప్రపంచానికి లీక్ కాలేదు… బరువు పెరిగిన కిమ్‌కు మెడ నరాల దగ్గర సర్జరీ చేయించినట్టు కిమ్ సోదరి ఏదో కవర్ చేసింది… ఆరోజు నుంచి కిమ్ నుంచి ఒక్కటంటేఒక్క అమెరికా వ్యతిరేక కూత లేదు… మిస్సయిళ్లు గట్రా ఆపరేషన్లు లేవు… ఈలోపు అమెరికాలో ట్రంపు దిగిపోయి, బైడెన్ కుర్చీ ఎక్కాడు… ఈమధ్య ఎక్కడో ఈ అసలు కిమ్ ఓ ఆర్మీ ఫేర్‌లో కనిపించాడు… బ్యాండేజీతో పాటు… తరువాత రెండుమూడు రోజులకే బ్యాండేజీ తీసేశారు, మచ్చ కనిపిస్తోంది… ఈ రెండు ఫోటోలూ బయటికి లీకయ్యాయి… పైన మీరు చూస్తున్న ఫోటోలు అవే… కిమ్ ఒకనాటి కిమ్ కాదు… జస్ట్, ఓ కిమన్నాస్తి కిమ్…!! (ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాండేజీ, మచ్చ మీద మీడియా బోలెడు కథనాలు రాస్తోంది… ఇంకా మన తెలుగు మీడియా స్టార్ట్ చేయలేదు, కథలు రాయడం మొదలుపెట్టాలే గానీ మన తెలుగు మీడియాను మించింది ప్రపంచంలోనే లేదు… మచ్చుకు ఓ కథ… ఎన్‌న్‌న్‌న్‌న్‌జాయ్…. ))

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions