వైకుంఠపాళి… అనగా పరమపదసోపానపటం… ఎన్నడో మరిచిపోయాం… మొన్నామధ్య కరోనా లాక్ డౌన్‌లో టీవీలు పనిచేయక, ఫోన్ల చార్జింగు లేక, బ్రాడ్ బ్యాండ్ పత్తాలేక చాలామంది మళ్లీ వైకుంఠపాళిని బయటికి తీశారు… నయం, అది దొరకడమే అబ్బురం… గవ్వలు కూడా ఏనాడు వదిలేశాం కదా… ఒకసారి ఆటలో మునిగిపోతే ఇక బయటికి రాలేం… పాములు, నిచ్చెనలు, నిట్టూర్పులు, చప్పట్లు… నడుస్తూనే ఉంటుంది…
అసలు ఈ వైకుంఠపాళిని ఎవరు మొదట కనిపెట్టారు… ఈ సందేహం ఎప్పుడైనా వచ్చిందా..? చిన్నప్పుడు ఆడీ ఆడీ చినిగిపోతే ఏ కిరాణం కొట్టులోనో, బుక్ షాపులోనో కొత్తగా కొనుక్కోవడమే… ఇండోర్ గేమ్స్‌కు సంబంధించి దేశమంతటా పాపులరైన ఈ పాములు, నిచ్చెనల పట్టాన్ని ఫస్ట్ రూపొందించింది 13 వ శతాబ్దంలో… సంత్ జ్ఞానేశ్వర్ దీన్ని పిల్లల కోసం రూపొందించి, దానికి మోక్షపటం అని పేరు పెట్టాడు…
బ్రిటిషర్లు ఏదీ అలాగే ఉంచేయరుగా… మోక్షపటం అనే పేరు తీసిపారేసి స్నేక్స అండ్ ల్యాడర్స్ అని పేరు పెట్టారు… ఒరిజినల్ పటంలో వంద వరకూ గళ్లు ఉంటే… అందులో 12వ గడి పేరు నమ్మకం… 51వ గడి పేరు విశ్వసనీయత, 57 వ గడి పేరు దాతృత్వం, 76వ గడి పేరు జ్ఞానం, 78 వ గడి పేరు సన్యాసం…
Ads
ఈ గడుల దగ్గరకు వచ్చినప్పుడే పెద్ద పెద్ద నిచ్చెనలు తగులుతాయి… చకచకా మన పావులు కదులుతాయి… అంతెందుకు ఓసారి చూడండి…
100 వ గడి నిర్వణం, అంటే మోక్షాన్ని సూచిస్తుంది… ప్రతి నిచ్చెన పైభాగంలో ఒక దేవుడిని లేదా వివిధ స్వర్గాలలో ఒక దానిని (కైలాసం, వైకుంఠం, సత్యలోకం) సూచిస్తుంది… మన గుణాలే మనల్ని జీవితంలో ఎలా పైకీ కిందకూ తీసుకెళ్తాయని బోధించడమే అంతిమంగా ఆ మోక్షపటం ఉద్దేశం… ఐనా ఇప్పుడు ఆడేవారెవ్వరు..? ఆ స్పూర్తిని పట్టేవారెవ్వరు..? ఏమో చెప్పలేం, మనం వదిలేసిన బోలెడు అసాధారణ పాత్రలు ఇప్పుడు ఇంగ్లిషులో కోట్లు కురిపిస్తున్నాయి… ఈ ఆటలకు కూడా ఆ వైభవం వస్తుందేమో…!!
Share this Article