Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజమేనా..? వైఎస్ భారతీరెడ్డి హిందూ పద్ధతులు, దేవతలను అవమానపర్చిందా..?

January 19, 2024 by M S R

అయ్యో, అయ్యో, ఎంత ఘోరం… సాక్షాత్తూ తన సొంత చెల్లె కొడుకు నిశ్చితార్థం జరిగితే, ఏదో మొక్కుబడిగా వెళ్లి, ఒక నిమిషం అక్కడ ఉండి, ఓ బొకే ఇచ్చేసి అలా వెళ్లిపోయాడు జగన్… ఫోటో దిగుదాం రమ్మని చెల్లెల్ని పిలిచినా ఆమె పట్టించుకోలేదు, అసలే కోపంగా ఉంది కదా, లైట్ తీసుకుంది… ఇక ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ అయితే అస్సలు జగన్ రాకనే ఖాతరు చేయలేదు….. అన్నట్టుగా ఆంధ్రజ్యోతి బాగా బాధపడిపోయింది ఫాఫం…

ఆ వీడియోలు, ఫోటోలు చూస్తుంటే జగన్ తన చెల్లెల్ని దగ్గరకు తీసుకుని, ఆప్యాయంగా హత్తుకున్నట్టు, అమ్మను కౌగిలించుకుని పలకరించినట్టుగా కనిపిస్తోంది… బొకే ఇచ్చి, కాబోయే కొత్త దంపతులను ఆశీర్వదిస్తున్న ఫోటోల్లో భారతి, జగన్, విజయ, షర్మిల, అనిల్‌తోపాటు కాబోయే వధువు పేరెంట్స్ కూడా కనిపిస్తున్నారు… కాకపోతే జగన్ ఇన్వాల్వ్‌మెంట్ లేదు ఆ ఫంక్షన్‌లో, ఆర్టిఫిషియాలిటీ ఉంది తప్ప ఆ కలయికలో ఒరిజినాలిటీ లేదు… ఏదో ఓ అఫిషియల్ ఫంక్షన్‌కు కాజువల్‌గా వెళ్లినట్టు వెళ్లాడు, వెళ్లిపోయాడు… తన కుటుంబ ఫంక్షన్ అన్నట్టుగా మాత్రం లేడు… ఎస్, అన్నా చెల్లెళ్ల నడుమ పొసగడం లేదా..? పొసగనట్టుగా బయటికి కనిపిస్తున్నారా అనేది ప్రస్తుతానికి ఎవరూ తేల్చలేరు… ఆంధ్రజ్యోతి ఈ వార్త రాయకుండా ఉండాల్సింది… చీప్ టేస్ట్…

సరే, అది ఎలా ఉన్నా… ఈమధ్య తిరుమల, ఇతర దేవుళ్ల సెట్టింగులు వేశారు కదా తాముండే చోట… సంక్రాంతి సంబరాలు అత్యంత భారీ ఖర్చుతో నిర్వహించారు కదా… అక్కడ సంప్రదాయ దుస్తుల్లో భారతి, జగన్ పూజలు చేశారు… అక్కడ పూజారులు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు… ఇంకేముంది..? కొన్ని వీడియోల్ని వైరల్ చేస్తున్నారు…

Ads

ఏమిటంటే..? ఈ లింక్ చూడండి… https://www.facebook.com/reel/1430388357912150

ఆమె తీర్థాన్ని తెలివిగా ఒంపేసుకుందట, ప్రసాదాన్ని పొట్లం గట్టేసి వదిలించుకుందట… ఇదీ హిందూ దేవుళ్ల పట్ల ఈ సైకో దంపతుల భక్తి, శ్రద్ధ, గౌరవం అని విమర్శ… నిజానికి తీర్థం తీసుకునేటప్పుడు చేతిని ఎలా చాపాలో కూడా ఓ పద్ధతి ఉంటుంది… సరే, వోకే, ఆమె తీర్థం తీసుకుంది, మిగిలిన తీర్థాన్ని తలపై రాసుకుంది… అందరమూ సహజంగా చేసేదే… కిందకు ఒంపేయకుండా తలకు రాసుకోవడం దాని పట్ల చూపే గౌరవం… మరి ఆమె చేసిందీ అదే కదా…

తరువాత ఎవరో పేపర్ నాప్‌కిన్ అందిస్తే చేతిని తుడుచుకుంది, అంతే తప్ప ప్రసాదాన్ని పొట్లం చేయలేదు, పడేయలేదు… అన్నింటికీ మించిన కామన్ సెన్స్ అబ్జర్వేషన్, ఇది ఫేక్ ప్రచారమని తేల్చేది ఏమిటంటే… అక్కడే నెగెటివిటీ ఉంటే సాక్షి టీవీ ఎందుకు ప్రసారం చేస్తుంది..? ఒకవైపు పుష్కరస్నానాలు, పంచాంగశ్రవణాలు, రుషికేష్ హోమాలు చేసే జగన్, సంక్రాంతి సంబరాల్ని అట్టహాసంగా చేయించే జగన్ తనకు తాను హిందూ వ్యతిరేకిగా ఎందుకు కనిపించడానికి ప్రయత్నిస్తాడు..? ఈ కువిమర్శ తెలుగుదేశం సోషల్ గ్రూపుల క్యాంపెయిన్ అని ఆ రీల్‌లో కనిపిస్తూనే ఉంది… ఈ సోషల్ పోకడలు కొత్తగా సలహాలిస్తున్న వ్యూహకర్త పీకే పుణ్యమా..? ఆ పాత రాబిన్ శర్మ పైత్యమా..?

కాకపోతే నవ్వొచ్చేది ఏమిటంటే..? అది తిరుమల సెట్టింగ్, అక్కడ నిజంగానే పూజారులు ప్రత్యక్షమై జగన్ దంపతులకు తీర్థప్రసాదాలు ఇవ్వడం… సెట్టింగుల దగ్గర అర్చనల సెట్టింగు కూడా అన్నమాట… నిజానికి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ జరగని విగ్రహాలకు పూజలు కరెక్టు కాదు… అంతా ఓ మాయ… అంతా ఆ జగన్మోహనుల వారి లీల… అదే ఏపీ ప్రజలకు ప్రస్తుతం మహాప్రసాదం… అక్కడ మంత్రాలు చదువుతూ, అత్యంత భక్తిగా జగన్ దంపతులకు తీర్థం ఇస్తున్న పూజారులను చూస్తుంటేనే జాలేసింది… ఏం చేస్తారు ఫాఫం… పాలకుడు ఆదేశిస్తాడు, కాదంటే కడుపు నిండదు మరి..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions