సరిగ్గా ఏడాది క్రితం ‘ముచ్చట’ పబ్లిష్ చేసిన ఓ స్టోరీ… మరోసారి అదే ధోరణిలో చెప్పుకోవాలనిపించింది… పోనీ, అది గుర్తుచేయాలని అనిపించింది… సరే, ఒక్కసారి ఆ పాత కథనం యథాతథంగా మళ్లీ చదివేయండి… ఇదుగో…
ఇద్దరూ బూతు షో జబర్దస్త్ యాంకర్లే మొన్నటివరకూ… అవకాశాల్ని బట్టి సినిమాల్లో బోల్డ్ కేరక్టర్లలో నటించినవాళ్లే… కానీ ఎంత తేడా..? అనసూయ అనసూయే… రష్మి రష్మియే… కొన్ని వేల మంది అనసూయ మీద డిజిటల్ దాడికి దిగితే ఒక్కరంటే ఒక్కరూ టీవీ ఇండస్ట్రీ నుంచి గానీ, సినిమా ఇండస్ట్రీ నుంచి గానీ తన సపోర్టుకు రాలేదు… అదీ తను సంపాదించుకున్న క్రెడిబులిటీ… పైగా ఎవరి జోలికీ వెళ్లని బ్రహ్మాజీ కూడా ఓ సూపర్ సెటైర్ వేసి పరువు తీశాడు…
మళ్లీ అనసూయ కిక్కుమనలేదు ఇప్పటికి… ఏంటో ఏజ్ షేమింగ్ అట, కేసులట, ఆంటీ అన్నా సరే తప్పులట… తను ఎలాంటి బట్టలేసుకుని, ఎలా వ్యవహరించినా తప్పులేదట… రష్మి సోషల్ మీడియాలో పెద్దగా ఎవరితోనూ గొడవ పడదు… తన ధోరణే వేరు… కరోనా కాలంలో రిస్క్ తీసుకుని మరీ జంతువులకు తిండి పెడుతూ తిరిగింది ఆమె… జంతుకారుణ్యం తనకు ఇష్టమైన సబ్జెక్టు…
Ads
జంతువులపై హింసను ఖండిస్తూ, జంతువుల పట్ల కరుణను కనబరుస్తూ సోషల్ మీడియా పోస్టులు పెడుతూ ఉంటుంది… కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు… అది ఆమె ఇష్టం… వినాయకచవితి సందర్భంగా ఓ భారీ వినాయకుడి విగ్రహానికి కొందరు భక్తులు బుధవారం ఏనుగుతో పూలమాల వేయించారు… ఈ వీడియోను పోస్ట్ చేసింది ఆమె… దయచేసి ప్రజావినోదం కోసం ఇలాంటివి చేయవద్దని వేడుకుంది…
The pain and frustration of the elephant is clearly visible towards the end of the video
Requesting @PMOIndia @Manekagandhibjp @PetaIndia @pfaindia and many other animal organization to ban use of animals for public entertainment https://t.co/b0pUHONQyR— rashmi gautam (@rashmigautam27) August 31, 2022
దీనిపై పలువురు నెగెటివ్‌గా స్పందించి ట్రోల్ స్టార్ట్ చేశారు… కానీ ఆమె హంబుల్‌గా సమాధానాలు ఇచ్చింది… కేసులు పెడతా, తాట తీస్తా అని అపరిపక్వత చూపించలేదు… ఒకతను ఏదో కూస్తే ‘నీ పట్ల రెండు నిమిషాల మౌనం అని జవాబు చెప్పింది… ఆ దెబ్బకు సదరు ట్రోలర్ ఆ ట్వీట్ డిలిట్ చేసుకుని, పత్తా లేకుండా పోయాడు… ఇంకెవరో ఏదో కూస్తే ‘నా వాల్ మీదకు వచ్చేటప్పుడు నేను లేవనెత్తే అంశాలకు ఎలా స్పందించాలో కాస్త హోం వర్క్ చేసుకురావోయ్’ అని బదులిచ్చింది… ఇంకెవరో నువ్వు జంతు ప్రేమికురాలివేమీ కాదు, కానీ నువ్వు హిందూ వ్యతిరేకివి అని వ్యాఖ్యానించాడు…
దానికి రష్మి ఇచ్చిన జవాబు తనేమిటో స్పష్టంగా చెప్పింది… సవాల్ లేదు… రష్మి రష్మే…
I respect nandi and gau maat so much that i don't wear or use leather products
I don't eat milk products cause i can't bare the fact that my gau maat is repeatedly made pregnant for my milk consumption
As a women facing three day period pain itself is hell for me https://t.co/4hOtzYRyLB— rashmi gautam (@rashmigautam27) September 1, 2022
‘‘నేను నంది మాతను, గోమాతను ప్రేమిస్తాను కాబట్టే లెదర్ ప్రొడక్ట్స్ ఏవీ వాడను… కనీసం పాలకు సంబంధించిన పదార్థాల్ని కూడా తీసుకోను… నాకు అవసరమైన పాల కోసం గోమాత పదే పదే గర్భం ధరించాల్సిన అవసరాన్ని నేను ఇష్టపడను… ఓ మహిళగా రుతుస్రావ నరకం ఏమిటో కూడా నాకు తెలుసు…’’ అని కాస్త పొడవైన వివరణను ఇచ్చింది… అందులోనే తనేమిటో చెప్పింది… ఐనా ప్రతి అంశంలోనూ ఎవరు దొరికితే వాళ్ల మీద హిందూ వ్యతిరేక ముద్రలు వేయడం అవసరమా..?! ఏదో ఒక ట్వీట్‌ను బట్టి వాళ్లను అంచనా వేసేయడమేనా..?!
కానీ ఈసారి దీనికి పూర్తి భిన్నమైన సీన్… ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మ నిర్మూలన అవసరమని భీకర ప్రకటనలు చేశాడు కదా… హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి దానికి కట్టుబడి ఉన్నట్టు కూడా చెప్పాడు కదా… అసలే ముఖ్యమంత్రి కొడుకు, తనతో ఎందుకు గోక్కోవడం అనుకుని ఇండస్ట్రీలో ఎవరూ ఉదయనిధిని కౌంటర్ చేయడానికి సాహసించలేదు…
పైగా చాలామంది హిందుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, హిందూ దేవుళ్లను కించపరిచే పోస్టులకు దిగారు సోషల్ మీడియాలో… దాన్ని ఆమె వ్యతిరేకించింది… దాంతో ఇక ఆమె సంఘి అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు… చాలామంది నెటిజన్లకు తాపీగా సమాధానాలు ఇస్తోంది ఆమె… మీమీద కేసులు పెడతా, జైలులో పారేయిస్తా వంటి ఆంటీ వ్యాఖ్యలకు దిగలేదు… ‘మీకు బీజేపీతో సమస్య ఉంటే నాతో వాగ్వాదాలు దేనికి’ అనీ మొహం మీద జవాబులు ఇచ్చి పారేస్తోంది…
‘నా మతం నా విశ్వాసం… ఎందుకు తిడుతున్నారు… ఏ మతం పర్‌ఫెక్ట్‌గా ఉందో చెప్పండి’ అనే ఆమె ప్రశ్న చాలామందికి ఆమె మీద కోపాన్ని తెప్పించింది… అదీ ఈ వివాదం… రష్మి మాటల మీద విశ్లేషణ కాదు ఇది… జస్ట్, ఆ ఇద్దరు సమకాలీన యాంకర్ల నడుమ ఎంత తేడాయో చెప్పే ప్రయత్నం ఇది… వాళ్ల మాటల్లోని, నడతల్లోని తేడాల్ని తూచే ప్రయత్నం… అంతే…
Share this Article