.
ఇండియా టాప్ మోస్ట్ బ్రాండ్ వాల్యూ ఉన్న లెజెండ్… స్టార్ క్రికెటర్… ఈ దేశంలోనే కాదు, విదేశాల్లోనూ క్రికెట్ ప్రేమికులకు దేవుడు… కింగ్ కోహ్లీ..! కానీ దేవుడు గాడి తప్పాడు… ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ…
ప్రత్యేకించి గత రెండు వన్డే మ్యాచుల్లోనూ పట్టుమని పది బంతుల్ని ఎదుర్కోలేక, వికెట్లు పారేసుకుని పెవిలియన్ దారిపట్టిన కోహ్లీని చూసి తన అభిమానులే జాలిపడుతున్నారు… ఫామ్ లేకపోవడం వరకూ వోకే, కానీ ఆట పట్ల సిన్సియారిటీ కోల్పోవడం దీనికి కారణం…
Ads
ఆల్రెడీ టెస్టులు, టీ20ల నుంచి రిటైరయ్యాడు… ఇక వన్డేల నుంచి కూడా రిటైర్ కావడం తప్పదేమో..! తనూ రెడీ అవుతున్నట్టుంది… తాజా మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్‌గా విఫలమైన తరువాత పెవిలియన్‌కు వెళ్తూ, తల వంచి, రెండు చేతుల్లో గ్లౌజులు పట్టుకుని ప్రేక్షకుల వైపు అభివాదం చేస్తూ కనిపించారు… ఈ హావభావం… ఇక సెలవు అన్నట్టుగా కనిపించింది చాలామందికి… “ఇదే చివరి వన్డేనా?” అనే చర్చకు దారితీసింది…
అంతేకాదు, తను ఇక్కడ ఉండటం లేదు… నివాసాన్ని లండన్‌కు మార్చాడు… అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నాడు… చాన్నాళ్ల నుంచి వన్డేలు ఆడటం లేదు కదా, దేశీయ క్రికెట్ ఆడితే ఫిట్‌నెస్, ఫామ్ వస్తాయని మాజీ క్రికెటర్లు కూడా చెబుతున్నా సరే తను ఖాతరు చేయలేదు…
ఆటగాళ్లంతా భారత్‌లో ఫిట్‌నెస్ పరీక్షలకు సిద్ధమవుతుంటే, కోహ్లి మాత్రం లండన్ నుంచే పరీక్షలకు డేటా పంపాడనే వార్తలు తనపై వ్యతిరేకత పెంచింది… లండడన్‌లో ఏదో ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో రెండు, మూడు ఫోటోలు వదిలినా, అవీ నెగెటివిటీనే పెంచాయి…
ఇదంతా ఒకవైపు… వ్యక్తిత్వ కోణం మరోవైపు… ఐపీఎల్ కప్పు గెలిచాక బెంగుళూరులో అట్టహాసపు హంగామా ప్రదర్శన చేయబోతే, జనం తొక్కిసలాట జరిగి పలువురు మరణించారు… ఇటు తొక్కిసలాట జరుగుతూ ఉంటే తమ విజయోత్సవాలు కంటిన్యూ చేశారు…
తరువాతనైనా కనీసం కోహ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తే బాగుండునని కన్నడ మీడియా కోరుకుంది… అసలు ఆ సంఘటన మీద కోహ్లి స్పందనే లేదు… ఒకసారి రోహిత్ శర్మతో పోలుద్దాం…
రోహిత్ 2 నెలల క్రితమే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు… మధ్యలో 2, 3 డొమెస్టిక్ మ్యాచులు కూడా ఆడాడు… ఫలితం నిన్నటిరోజు కనిపించింది… పాత రోహిత్ కనిపించాడు… ఎటొచ్చీ కోహ్లియే ఎటూ గాకుండా పోతున్నాడు…
ఎప్పుడైనా ఎవరైనా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే రిటైర్ కావడం మంచిది… సినిమాలైనా, క్రికెటైనా, ఏదైనా… వరుస వైఫల్యాలతో గెంటించబడితే చరిత్ర వాళ్లను ఇక పట్టించుకోదు… కోహ్లికి ఇది తెలుస్తున్నట్టు లేదు… ఎందరో యువ ఆటగాళ్లు ఈమధ్య మెరుస్తున్నారు… కొత్త రక్తం…
చివరగా… ఎవరూ ‘కింగు’లు కాదు… ఆటకన్నా, జట్టుకన్నా పెద్దవాళ్లు కారు… కోహ్లికి ఈ విషయాన్ని చెప్పేవాళ్లు లేరు పాపం..!!
Share this Article