Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సంపూర్ణంగా ఈ కామాఖ్య ఆదిశక్తిపీఠం తరహాయే వేరు… Part-2 …

June 30, 2025 by M S R

.

కామాఖ్య బలిపూజ, జీవహింస, జంతుబలి నిషేధం గట్రా చెప్పుకుంటున్నాం కదా… రెండోరోజు ఓ ప్రయత్నం మీద ఓ పూజారి దొరికాడు… పాంచ్ బలి… అక్కడ పూజార్లు కావాలనే తమను ఆశ్రయించే భక్తులను గందరగోళానికి గురిచేస్తారేమో అనిపించింది… ఓ బలమైన నెట్‌వర్క్…

పాంచ్ బలి అంటే… అయిదు బలులు… 1)మేక 2) పావురం 3) పిట్ట 4) గుమ్మడికాయ 5) చెరకుగడ… భారీ పూజ అంటే దున్నపోతు బలి… లక్ష దాకా తీసుకుంటారు… మూడున్నర గంటల పూజ అది… బయట ఎక్కడో ఏ స్మశానంలోనో కాదు బలి ఇచ్చేది… అచ్చంగా గుడి ఉన్న గుట్టపైనే… గుడి ప్రాంగణంలోనే… నిజం… ఆ స్థానం పేరు బలి ఘర్…

Ads

బలి ఇచ్చిన తలలను తీసుకొచ్చి గర్భాలయ ద్వారం పక్కనే పూజలు నిర్వహిస్తారు… ఇప్పుడు గిరాకీ ఎక్కువై శ్రీకాకుళం సర్పదోష నివారణ పూజల్లాగా… పలుచోట్ల నిర్వహిస్తున్నారు… కామాఖ్య గుడి చుట్టూ ఉండే దశమహా విద్యల చిన్న గుళ్లల్లో కూడా బలిపూజలు చేస్తున్నారు…

ఒకటి నిజం… బలమైన భక్తి భావనలతో కామాఖ్యకు వెళ్లేవాళ్లు గుళ్లోకి వెళ్లగానే అనిర్వచనీయమైన ఏవో పాజిటివ్ వెబ్స్ ఫీల్ అవుతారు… ఏమో, కామాఖ్య మహత్తు మీద బలమైన నమ్మకాన్ని పెంచుకున్నందువల్ల ప్రభావం కావచ్చు…

అక్షరాలా గుళ్లోనే బలి… జంతు నిషేధ చట్టాలు గిట్టాలూ జాన్తానై… సీఎం వచ్చివెళ్లాడు, ఆ పక్కన బలులు యథాప్రకారం కొనసాగాయి… ఓసారి మేడారంలో బలి కుదరదు అని అప్పటి కలెక్టర్ ఎవరో ఏదో ఆదేశించాడు… సమ్మక్కకు స్వాగతం చెప్పడానికి అడవి దాకా వచ్చిన కలెక్టర్ ముందే కసకసా కోళ్లు, మేకల్ని బలి ఇచ్చారు… ఆరోజు మేం పెట్టిన హెడింగ్… కలెక్టర్ ఎదుటే కసకసా… అది గుర్తొచ్చింది…

ఏదో చిన్న గుడి అనుకున్నాం గానీ… పెద్ద వ్యవస్థే… అంబుబాచీ మేళా సందర్భంగా లక్షల మంది పోటెత్తుతారు.., తాంత్రిక పూజలు చేసేవాళ్లు కూడా చాలామంది కనిపిస్తున్నారు… కామాఖ్య అంటేనే తాంత్రిక పూజల్ని స్వీకరించే శక్తిస్వరూపం కదా… గుట్టపై, గుట్ట చుట్టూ కొన్ని వందల దుకాణాలు…

కొబ్బరికాయకు పెద్ద ప్రాధాన్యం లేదు గానీ… మందారమాలలు, తామరపూలు తప్పనిసరి… జిల్లేడు పూలతోపాటు ఆ స్థానిక పూలరకాలు చాలా కనిపించాయి… పూజాసామగ్రిలో కొన్ని ఫలాలు, కొన్నిరకాల పత్రి… భక్తిని బట్టి చీరలు ప్లస్ మాతాకీ చున్రీ… గర్భగుడిలోకి ఈరోజుకూ ఏ ఆధునికతను రానివ్వలేదు… లైట్ కూడా లేదు… చీకటి… ఒకరు మాత్రమే వెళ్లేలా ఇరుకైన దారి… ఎగుడుదిగుడు రాతి మెట్లు…

శివుడి సతీదేవి శరీర ముక్కల్లో యోని కదా ఇక్కడ పడింది… ఆ స్వరూపం కనిపించకుండా దానిపై పూలు, బట్టలు, పళ్లు… అటూఇటూ నీళ్లు… ఆ నీటిని తలపై జల్లుకోవడం, పూజారి ఆశీర్వచనం ప్రతి ఒక్కరికీ… క్యూ కంట్రోల్ వెరీ పూర్…

బయటికి వచ్చాక బలి చూద్దామని వెళ్లాం… ఓ పక్కన చిన్న బలులు… దున్నపోతును బలి ఇచ్చే ఏర్పాట్లు కాస్త డిఫరెంట్, కట్టుదిట్టంగా… ప్రధానంగా చెప్పాల్సింది తలారి గురించి… నాలుగు అడుగుల పొడవైన గండ్రగొడ్డలి తరహా కత్తి… గుండు, మీసం, భారీకాయం, చేతిలో ఆ కత్తి…

బలిని ఇంకా వర్ణించలేను గానీ, చిన్నప్పుడు పూజారులు మేకలను ‘గావుపట్టడం’ చూశాం కదా… (పళ్లతో గొంతును కసుక్కుమనిపించడం)… ఇక్కడేమో ఒకటే వేటులో దున్నపోతు తల వేరు కావడం… మరుక్షణంలో దాన్ని నేరుగా తాంత్రిక బలి పూజ స్థలిలోకి తీసుకుపోయారు…

అల్ కబీర్ వీడియోలు చూసిన ఇమ్యూనిటీ కావచ్చు… అందుకేనేమో ఈ తల కత్తిరింపు భయానకం అనిపించలేదు… మా టీమ్‌లోని మిత్రుడు ఉద్వేగానికి గురై ఆహారం కోసం వధ వోకే గానీ ఈ వధ బాగోలేదు అన్నాడు… మరో మిత్రుడి వ్యాఖ్య ‘ఏదైనా వధే… రోజు కోట్ల జీవాలు మన కడుపు ఆకలి మాతకు ‘బలి’ కావడం లేదా, అన్నీ ప్రాణాలే… ’ ఎవరి దృక్పథం వాళ్లదే…

తెలుగువాళ్లు చాలామంది… అవును, కొన్నాళ్లుగా సెలబ్రిటీలు, నాయకులు, వ్యాపారులు అధికంగా వస్తున్నారు… దున్నపోతుల బలి గిరాకీ వీళ్లదే… అడ్డంకులు తొలగిపోయి, విజయాల్ని, శక్తిని పొందడమే ఈ శక్తి ఆరాధన అంతరార్థం, సంకల్పం…

గుండం పరిస్థితి చూశాక ఆ నీళ్లు కూడా టచ్ చేయాలనిపించలేదు… గుట్టపైనున్న దశమహావిద్యల గుళ్లలోకీ వెళ్లలేదు… అయితే కామాఖ్య మీద యూట్యూబ్ వీడియోలు, ఫోటోలు చూసి కామాఖ్య మీద ఓ అంచనాకు రావద్దు… వాటిని మదిలో డిలిట్ కొట్టేసుకుని ఖాళీ మైండ్‌తో వెళ్లాలి… ఇంకా తెలుగు భక్తులు పెరుగుతారు… వెళ్లాలని అనుకునేవాళ్లు గుర్తుంచుకోవాల్సింది ఒకటే… కామాఖ్య శక్తిపీఠం సంపూర్ణంగా వేరు… ఏ శక్తిపీఠంతోనూ పోలికే లేదు…

గౌహతి సిటీ పక్కనే నిండుగా… 2, 3 కిలోమీటర్ల వెడల్పుతో బ్రహ్మపుత్ర ప్రవాహం… చిన్న సిటీ… పాత ఇళ్లు… ఇప్పుడిప్పుడే న్యూ డెవలప్‌మెంట్ స్టార్టయినట్టు కొన్ని ఛాయలు… పచ్చదనం, గుబురు చెట్ల నడుమ గుట్టలపై దాకా ఇళ్లు… కామాఖ్యనే కాదు… గౌహతి దర్శనమూ ఆసక్తికరమే..! వీగన్లకు, సౌత్ ఇండియన్లకు తిండి కాస్త కష్టమే… నాన్ వెజ్ ప్రియులకు ఫిష్, డక్ రెసిపీలు బోలెడు…

హిందీ చల్తా… గౌహతి చుట్టుపక్కల కూడా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి… భక్తి టూరిజమే కాదు, భక్తేతర టూరిజాన్ని కూడా ఇప్పుడు బాగా ప్రమోట్ చేస్తున్నారు… సో, ఈశాన్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రతీక కామాఖ్యతోపాటు గౌహతి కూడా సందర్శనీయమే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాధన్ పండిట్… అబ్బో, కేఏ పాల్ గారికే పెద్దన్నలా ఉన్నాడు…
  • కేటీయార్ హేపీ… 2034 తరువాతనైనా సీఎం చాన్స్ దొరకొచ్చు…
  • మస్క్ పక్కన సమస్థాయిలో ఆమె… ఓ నమ్మశక్యం కాని గ్రాండ్ సక్సెస్ స్టోరీ…
  • శతృ సంతానం..! పాత జన్మ పగవాళ్లే ఈ జన్మలో పిల్లలుగా పుట్టి…!!
  • స్మి’తత్త్వమసి’… పాప్, ర్యాప్ అయిపోయాయి… ఇక తత్వ యాత్ర…
  • సరిహద్దుల్లో ఓ సైలెంట్ ఛేంజ్… India also Ready for AI War…
  • ‘మై జల్‌మురి ఖా రహాథా…’ బెంగాల్ గెలుపుపై అమెరికాలో సంబురాలు
  • ‘కాల్పనిక అమ్మతనం’… ఊహల ఉయ్యాలవే మనసా… మాయల దెయ్యానివే…
  • కేడీ, ది డెవిల్… ప్చ్, కంట్రవర్సీ ఎక్కువ- కంటెంటు తక్కువ…
  • అమెరికాలో ఆదానీ కేసు సెటిల్‌మెంట్..! ఆరోపణలన్నీ ఉఫ్…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions