.
పవన్ కల్యాణ్‌ను ధిక్కరించే అల్లు అర్జున్… మొన్న సమస్య వస్తే ఎంత ప్రయత్నించినా సరే కనీసం కలవడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వని పవన్ కల్యాణ్… ఈ విభేదాలు, వైరాల జోలికి, అల్లు అర్జున్ టెంపర్ తత్వం జోలికి ఇక్కడ వెళ్లడం లేదు…
పవన్ కల్యాణ్ అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు అనే బన్నీ వ్యతిరేకుల ట్రోలింగ్ జోలికి కూడా వెళ్లడం లేదు… ఒక బేకార్ యూట్యూబ్ చానెల్ వాడు పెట్టిన ఓ థంబ్ నెయిల్… ‘‘నా సొంత మేనల్లుడు అయ్యా వాడు, పుష్ప సినిమా బాగా ఆడింది, సంతోషం… అని పవన్ కల్యాణ్ అన్నట్టుగా ఆ థంబ్ నెయిల్…
Ads
యూట్యూబర్ల థంబ్ నెయిళ్ల డ్రామాలు, కథలు, వేషాల సంగతి తెలిసిందే కదా, ఆ స్టోరీ లోపలకు వెళ్లలేదు, అందులో ఏముందో కూడా అక్కర్లేదు కానీ…
ఒరేయ్, మీకు మేనల్లుడు, మేనత్త, అల్లుడు, అత్త, అత్తయ్య, అత్తమ్మ తేడాలు కూడా తెలియవురా కదరా… నోటికి ఏదొస్తే అది రాసేసి వ్యూస్ సంపాదించేయడమేనా టార్గెట్… భ్రష్టుపట్టించకండిరా తెలుగు బాంధవ్యాల పేర్లను… కనీసం ఇదైనా కాస్త బుర్ర ఉపయోగించి రాయండర్రా…
మొన్న గరికపాటి రీల్ ఏదో చూశాను… అత్త అంటే పిల్లనిచ్చిన మహిళ అట… మేనత్త అంటే తండ్రి సోదరి అక్క లేదా చెల్లెలు అట… అత్తమ్మ అంటే మేనమామ భార్య అట… బాగా చెప్పాడు వివరంగా…
ఆ దిక్కుమాలిన ఇంగ్లిషులో బాబాయ్, పెదనాన్న, మామ, మేనమామ అందరూ అంకుల్సే… బామ్మ, మామ్మ అంటే గ్రాండ్‌మా… అత్తయ్య, అత్తమ్మ, అత్త, మేనత్త అందరూ ఆంటీలే… చివరకు పక్కింటామె కూడా ఆంటీయే… కాస్త ఏజ్ బారయిన ప్రతివాడూ అంకులే…
షడ్డకులు, వియ్యంకుడు, సహవియ్యంకుడు… ఈ తెలుగు పదాలకే అసలు ఇంగ్లిషులో పదాల్లేవు… ఏదో కోబ్రదర్ అనేస్తుంటాం… మరి వియ్యంకుడు, సహవియ్యకుండు మాటేమిటి..? ఎవడో, ఏ ఈనాడువాడో వాటికీ ఇంగ్లిష్ పదాలు క్రియేట్ చేయాలిక… చాలా బంధుత్వాలకు తెలుగులో దేనికదే సపరేటు పేర్లున్నాయి… ఇంగ్లిషులో ఉండవు… జస్ట్, కజిన్స్, అంకుల్స్, ఆంటీస్, గ్రాండ్‌మాస్, గ్రాండ్‌పాస్… అంతే…
పైన థంబ్ నెయిల్ చూద్దాం… అల్లు అర్జున్ పవన్ కల్యాణ్‌కు సొంత మేనల్లుడు ఎలా అవుతాడు..? పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్, అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్… అంటే పవన్ కల్యాణ్ సోదరి కొడుకు కాదు… వరుసకు మాత్రమే అల్లుడు, కానీ మేన సంబంధం ఏమీ లేదు వాళ్ల నడుమ…
మరి మేనల్లుడు ఎలా అయ్యాడురా..? రాంచరణ్ సొంత అన్న కొడుకు, తమ కుటుంబ సభ్యుడు అవుతాడు… అంతేతప్ప అల్లు అర్జున్ సొంత కుటుంబ సభ్యుడు కాడు పవన్ కల్యాణ్‌కు… బంధువులే కానీ సేమ్ ఫ్యామిలీ కాదు… పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్ కేవలం సొంత వదిన అన్న కొడుకు… అంతే..!!
అవునూ… ఎక్స్ అనే ఓ అబ్బాయి… తనకు వై అనే సోదరి… జెడ్ అనే మేనమామకు ఇచ్చి చేశారామెను..? ఇప్పుడు వై, జెడ్ సంతానాన్ని ఎక్స్ ఏమని పిలవాలి..? ఆ బంధుత్వానికి పేరు ఉందా…? జస్ట్, ఆసక్తి కోసం..!!
Share this Article