.
సమాజం ఒక వ్యభిచారి అంటాడు ఒక రోమన్ తత్వవేత్త ఇందుకే…!
చాలా మంది కోడై కూశారు “అదానీపై, పర్టిక్యులర్ గా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మీద అమెరికాలో లంచం, అవినీతి అభియోగాలు నమోదు అయ్యాయి” అని.
Ads
నిజానికి అదానీ మీద కానీ, అదానీ బంధువు సాగర్ మీద కానీ ఎటువంటి లంచం, అవినీతి ఆరోపణలు నమోదు కాలేదు అని సాక్షాత్తూ ఆ కంపనీ యాజమాన్యం మన దేశ స్టాక్ ఎక్సేంజ్ కి లిఖితపూర్వకంగా తెలిపారు.
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపనీ స్టాక్ ఎక్సేంజ్ కి తెలిపిన వివరాలు వారి మాటల్లో…. “FPCA, అమెరికా ఫారిన్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద గౌతం అదానీ, అతని బంధువు సాగర్, కంపనీ సీనియర్ డైరక్టర్ వినీత్ జైన్ పై లంచం, అవినీతి అభియోగాలు నమోదైనట్లు వచ్చిన కథనాలని మేం తిరస్కరిస్తున్నాం. అవి అన్నీ అవాస్తవాలు. వీరంతా సెక్యూరిటీస్ కి సంబంధించిన మోసం ఆరోపణలు ఎదుర్కుంటున్నారు తప్ప వారిపై లంచం, అవినీతి అభియోగాలు ఏవీ నమోదు కాలేదు. నిబంధనలు ఉల్లంఘించారు అని అమెరికా న్యాయ శాఖ నమోదు చేసిన కేసులో అసలు ఈ ముగ్గురు పేర్ల ప్రస్తావనే లేదు”
అమెరికా మీడియాలో ఎక్కువ భాగం వ్యభిచార మీడియా అని అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది అమెరికా మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలని బట్టి అదానీపై మన దేశంలో ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసం …?
గమనిక: అమెరికాలో సెక్యూరిటీ బాండ్స్ కి సంబంధించి ఈ ముగ్గురిపై ఆరోపణలు వచ్చాయి మరియూ మీడియాలో వచ్చినట్లు ఈ ముగ్గురిపై లేదా కంపనీపై ఎటువంటి ఫైన్ విధించలేదు అని క్రిస్టల్ క్లియర్ గా సాక్షాత్తూ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ యాజమాన్యం తెలిపింది.
సెక్యూరిటీస్ ఆరోపణల్లో కూడా మేం తప్పు చేయలేదు, ఆ ఆరోపణలకి సంబంధించి వాళ్ళ లాయర్స్ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు అని వివరించింది…
ధనవంతుల మీద ఏడ్వటం, దేశ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ నిర్మించే వారిపై ఏడ్వటం కొత్త ఫ్యాషన్ అయ్యింది..! లంచం, అవినీతి చేశారు అని వాళ్ళకి నోటీసులు రాలేదు కానీ మీడియాలో, సోషల్ మీడియాలో వాళ్ళు లంచం ఇచ్చారు, అవినీతి చేశారు అని కోర్ట్ లో ఫైల్ అయ్యింది, నోటీసులు ఇచ్చారు అని ఫేక్ ప్రచారం చేయటం ఎంత వరకు కరక్ట్ అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి.
భవిష్యత్ లో ఇంకో వ్యాపారవేత్త ఎదగకుండా చేసి పాశ్చాత్య వ్యాపారుల కింద బానిసలుగా బదుకుదామా అందరం..? ఇది జగన్నాథ్ గౌడ్ పూర్తి వ్యక్తిగత అభిప్రాయం
Share this Article