రోజుకు వంద కోట్లు… పఠాన్ సినిమాపై వార్తలు జోరుగా సాగుతున్నయ్… కొందరి ఊపు చూడబోతే అవతార్-2 వసూళ్లను కొట్టేయబోతోంది అన్నట్టుగా రాసిపడేస్తున్నారు… నిజంగా అంత గొప్ప సినిమా..? నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టరా..? నిజంగా షారూక్ మెస్మరైజ్ చేశాడా..? ఆ వెగటు దుస్తుల, వెకిలి ఊపుల ఆ దీపికను ఇండియన్ ప్రేక్షకులు అంత ప్రేమిస్తున్నారా..? కొందరు మిత్రులు అబ్బే, అంత సీనేమీ లేదు సినిమాలో అని కుండబద్ధలు కొడుతున్నారు…
ఫేస్‌బుక్‌లో మిత్రుడు, సీనియర్ జర్నలిస్ట్ Srini Journalist షేర్ చేసుకున్న సంక్షిప్త రివ్యూ ఇంట్రస్టింగుగా ఉంది… అదేమిటో యథాతథంగా ఇలా…
‘‘నిన్న పఠాన్ సినిమా చూశాను. PVR, పంజాగుట్ట… మొత్తం 11 మంది ప్రేక్షకులు ఉన్నారు. అందులో నేను ఒకరిని. సరే… కథ దగ్గరికి వస్తే… మన దేశం కోసం పోరాడే RAW అధికారిని (john abraham) ఏమాత్రం పట్టించుకోకుండా దేశం వదిలి వేస్తుంది. దీంతో అతను తన మన అనే భేదం లేకుండా, ప్రతి దేశంపై దాడి అనే ప్లాట్ తో నిర్మించిన వింత చిత్రం ఇది. చిత్రంగా పాకిస్తాన్ ISI ఆఫీసర్, దీపికా పడుకోన్ , మాత్రం చాలా ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నట్లు సినిమా ఆద్యంతం చూపారు.
Ads
సినిమాలో గ్రాఫిక్స్ మరీ పేలవం. దక్షిణాది సినిమా గ్రాఫిక్స్ చూసి అయినా నేర్చు ‘కొన’వచ్చు. బాహుబలి రేంజ్ అందుకోవటం ఎలాగూ సాధ్యం కాదు, కనీసం KGF అయినా చూసి నేర్చుకోవచ్చు . సల్మాన్, షారూఖ్ రైలు సీన్ లో అయితే గ్రీన్ మ్యాట్ లో తీసినట్టు పక్కాగా కనిపించింది. ఆ రైలు అయితే ఎంత బలంగా ఉంది అంటే సల్మాన్ ఖాన్ కాలి దెబ్బకు దాని టాప్ పగిలిపోతుంది…
గ్రాఫిక్స్ కామిడీ చూడాలి అంటే షారూఖ్ బాడీ ప్యాక్ వైపు లుక్ వేస్తే సరి. ఎలాగూ గ్రాఫిక్స్ కదా అని 6 ప్యాక్ కి బదులు 8 ప్యాక్ బాడీని చూపించారు షారూఖ్ కి. Wing suit సీన్ వచ్చినప్పుడు పాపం షారూఖ్ కి ఆ suit ఎలా ఉపయోగించాలో తెలియదు. కానీ ఒక నిమిషంలో కొండలు గుహలలో కట్ కొట్టుకుంటూ వెళ్లే shots చూస్తే మనం మరీ వెర్రిపప్పలు ఆనుకొని సినిమా తీశాడేమో డైరెక్టర్ సారు….
సల్మాన్ ఖాన్ ఎందుకు సినిమాలోకి ఎందుకు ఎంటర్ అయ్యాడో ఎవరికి అర్థం కాదు. ఏదో కాస్త ఫాస్ట్ గా వెళ్తున్న స్క్రీన్ ప్లే, సల్మాన్ రాకతో మరీ స్లో అయ్యింది. ఇద్దరు ఖాన్ ల హంగామా ఎంతలా ఉంది అంటే, 30 ఏళ్లు గా ఏలుతున్న ( సినిమా ఇండస్ట్రీ అనుకోవచ్చు, లేకుంటే RAW ఏజెన్సీని ఉద్దేశించి అనుకోవచ్చు…) సామ్రాజ్యాన్ని, అంది పుచ్చుకొనే వారే లేనట్టు, వాళ్ళు ఇద్దరే ఏదో ఊడబొడిచే వాళ్లలాగా తామే దిక్కు అంటూ విపరీతమైన గర్వంతో ఉన్న డైలాగ్ చూస్తే కంపరం రాక మానదు…
ఆఫ్ఘన్ లో మన దేశం అమెరికాతో నిర్వహిస్తున్న ఆపరేషన్ లో అమాయక ముస్లిం పిల్లలను పొరపాటున చంపే ఒక scene కూడా పెట్టారు. సినిమా అంతా ఒకే వైపు వెళుతుంది అనుకున్నారు ఏమో, Dimpul kapadia ప్రాణ త్యాగం చేస్తూ, బ్యాక్ గ్రౌండ్ లో ఓమ్ నమ శివాయ అంటూ డైలాగ్ పెట్టారు. మొత్తం సినిమాలో అత్యధిక భాగం మన దేశ ఏజెన్సీ, RAW, ఏదో తప్పు చేస్తోంది అంటూ విషపు బీజాలు నాటే ప్రయాస వాంటెడ్ గా చేశారా అన్నది ఆ దర్శకుడికే ఎరుక.
సినిమా మొత్తంలో ఏదైనా పాజిటివ్ అంశం ఉంది అంటే, విశాల్ – శేఖర్ సంగీతం, దీపికా నటన. దీపిక డ్రస్సింగ్ సాకు చూపి boycott అన్న గ్యాంగ్ కి అసలు సినిమాలో ఏముంది అర్థం అయితే కదా. ఈ సినిమా కంటే CSI లాంటి TV series చాలా రెట్లు better. రెండు పాటలు enjoy చేయడం కోసం ticket పైసలు ఖర్చు అయ్యాయి ఆనుకొని రావటం better…
Share this Article