మొత్తానికి బాలయ్య ప్రకంపనలు సృష్టిస్తున్నాడు… ఇప్పట్లో ఈ రణగొణ ధ్వని ఆగదు… నేను చెప్పేది కలెక్షన్ల గురించి కాదు, ఈ సినిమా చుట్టూ అల్లుకున్న, అల్లబడుతున్న వివాదాల గురించి… బాలయ్య బ్రీడ్, బ్లడ్ కమ్మ, టీడీపీ కాబట్టి కొందరికి నచ్చదు, సినిమా చూడకుండానే తిట్టేస్తుంటారు, ఇంకా ఈ ముసలోళ్ల పైత్యం ఎన్నాళ్లు అని వేరే సాకుతో ట్రోల్ చేస్తుంటారు… సినిమాలో హిందుత్వను ప్రమోట్ చేసినట్టుగా కథ సాగుతుంది కాబట్టి ఇక నాస్తికవాదులందరూ పెద్దపెట్టున శాపనార్థాలకు దిగారు… అయ్యో, అయ్యో, ఇక దేశంలో లౌకికవాదాన్ని బొందపెట్టినట్టేనా అని శోకాలు అందుకున్నారు… ఇలా బాలయ్యను, సినిమాను తిట్టడానికి బోలెడు కారణాలు… నో, సినిమాకు చప్పట్లు కొట్టడానికీ అలాంటి కారణాలే… ‘అవసరమైతే హిందూ హింస తప్పదు’ అనే అఖండ సినిమా అంతస్సూత్రం మీద కమ్యూనిస్టు పత్రికల్లో విమర్శనావ్యాసాలు కూడా కనిపిస్తున్నయ్…
ఆ సినిమా కథ, కంటెంటు, నటన, పాటలు, థియేటర్లలో పగిలిపోతున్న సౌండ్ బాక్సులు, విపరీతమైన హింస, బీభత్సం, నెత్తురు, కొడుకు ముందే తల్లిపై అత్యాచారము, వెగటు ఆవకాయ-నాకుడు డైలాగ్స్ వంటి అంశాలన్నీ ఓసారి వదిలేద్దాం… ఓ మిత్రుడు ఏమంటాడంటే..? ‘‘సినిమాలు హోటల్‌లో దొరికే డిషెస్… ఎవరి అభిరుచి వాళ్లది… ఐనా మనమే ఓరోజు ఇడ్లీ తింటాం, ఓరోజు దధ్యోధనం బాగుంటుంది, ఓరోజు ఉప్మా కూడా భేషుగ్గా ఉంటుంది… వండే తీరును బట్టి… అలాగని రోజూ పులిహోరతో కడుపు నింపేయం కదా, కొన్నిసార్లు మసాలా ఘాటు నషాళానికి ఎక్కి, ఉక్కిరిబిక్కిరి చేసే దమ్ బిర్యానీ తినాలని అనిపిస్తుంది… మరి ఆత్మారాముడు, జిహ్య సంతృప్తి ఎలా..? అదుగో అఖండ సినిమా కూడా అలాంటిదే… ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ వదులుకోలేం… ఇన్నాళ్లూ సినిమాల్లో హిందూ దేవుళ్ల పాత్రల్ని వెకిలి చేసి, వెక్కిరించిన వేషాలే చూశాం… ఏం..? ఈ శివతాండవం జీర్ఖం కావడం లేదా..?’’… ఈ కోణం ఏదో డిఫరెంటుగా ఉంది కదా…
Ads
ఫేస్‌బుక్‌లోనే మరో ఇంట్రస్టింగ్ పోస్ట్ ఇదే కోణంలో కనిపించింది… మిత్రుడు Suresh Jai…. వాల్ అది… అందులోని కొన్ని అంశాలు…
” భీమవరం బుల్లోడా పాలు కావాలా… మురిపాలు కావాలా…”
నీకు సినిమా అనేది Education తొక్కా, తోటకూర అయి ఉండచ్చు.. కానీ అఖండ లాంటి మాస్ సినిమా B, C సెంటర్లలో Entertainment.. Relief.. ఒక అటవిడుపు.. ఒక సరదా… నువ్వెవడ్రా నాయనా అలాంటి సినిమాలు Waste అనడానికి.. నీకు కావాలంటే హాయిగా BBC Documentairies చూస్కో ఎవడొద్దన్నాడు… 75 నుండి 80 శాతం మంది ఆడియన్స్ సినిమాని Entertainment కోసమే చూస్తారు తప్ప అవి చదువుకుని డాక్టరేట్ సంపాదించాలనో, Abroad లో జాబ్ తెచ్చుకోవాలనో చూడరు…’’
Share this Article