.
పొద్దున్నుంచీ తెలుగు మీడియాలో ఒకటే రొద… అనేకానేక అక్రమాల, పాపాల భైరవుడు, కాళేశ్వరం కూలేశ్వరంగా మారడానికి ప్రధాన బాధ్యుల్లో ఒకడిగా చెప్పబడుతున్న మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు ఏసీబీ అదుపులోకి తీసుకుందట… పలు ప్రాంతాల్లో ఇంకా దాడులు కొనసాగుతున్నాయట… కొండను తవ్వుతున్నారట… (అర్థమైంది కదా…)
నిజంగా నక్సలైట్లు గనుక యాక్టివ్‌గా ఉండి ఉంటే… ఫస్ట్ టార్గెట్ ఇతనే అయి ఉంటే… తెలంగాణ సమాజం వాళ్లను పదే పదే మొక్కేదేమో… అంత ద్రోహి తను…! కేసీయార్, హరీష్ వంటి పేర్లను పక్కన పెట్టండి, ఇదుగో ఈ మురళీధర్ రావు వాళ్ల చేతుల్లో పనిముట్టు… పనిలోపనిగా దంచుకున్నాడు తన వాటా అక్రమ సొమ్మును…
Ads
ఒకటే చిన్న ఉదాహరణ… రిటైరయినా సరే, తనను కేసీయార్ ప్రభుత్వం 13 ఏళ్లపాటు పొడిగించింది తన సర్వీసును..? ఎందుకు..? చెప్పినట్టు వింటాడు… ఆ ఏటీఎం ప్రాజెక్టు నుంచి ఎప్పుడు ఎంత అడిగితే అంత వసూలు చేసి ఇస్తున్నాడు కాబట్టి….
- ఇంకా ఇంకా సోకాల్డ్ బీఆర్ఎస్ మేధావులు తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి అని కీర్తనలు, స్తుతిగానాలు.., ఫాఫం, ఇదీ తెలంగాణ ధిక్కార, పోరాట, చైతన్య స్థాయి..? ఓ దొర పాదాల దగ్గర మోకరిల్లి బతికిన ఓ విషాదం…
కాళేశ్వరం అక్రమాల్లో, పాపాల్లో ఈ ఇంజినీర్‌దే ప్రధాన పాత్ర… 13 ఏళ్ల సర్వీస్ పొడిగింపు అంటేనే అర్థం కావడం లేదా… ప్రభుత్వ ముఖ్యులకు ఎంత సంపాదించి పెట్టాడో, తను ఎంత సంపాదించుకున్నాడో.., ఫేక్, తెలంగాణ సమాజం చైతన్యవంతం అనే మాటకే ఇదంతా పెద్ద అవమానం…
ఏళ్ల తరబడీ తననే కాళేశ్వరం పెబ్బగా ట్రీట్ చేశారంటే… ప్రతి చెక్కు తను సంతకం చేస్తేనే చెల్లుబాటయ్యే అపరిమిత, అనైతిక అధికారాలు ఇచ్చారంటేనే అర్థమవుతోంది కదా… కేసీయార్ తనను ఎలా వాడుకున్నాడో…
తన సామాజికవర్గం ఏమిటో తెలియదు గానీ… కేసీయార్ పాపాల్లో ప్రధాన భాగస్వామి తనే… కాకపోతే మోడీకి, బీజేపీకి పెద్దగా శరం లేదు కాబట్టి.,.. పదే పదే బజారుకు ఈడ్చడానికి ప్రయత్నించినా కేసీయార్‌ను గానీ, ఇదుగో ఈ భేతాళులను గానీ ఏమీ చేయడం బీజేపీ పెద్ద తలలకు చేతకాలేదు… కాదు కూడా…
బిల్లులు ఆపే అధికారం తనదే… పాస్ చేసే అధికారం తనదే… అటు హరీశ్ రావు, ఇటు కేసీయార్… మధ్యలో తన స్వార్థం తనది… ఎలా..? ఓ వాట్సప్ గ్రూపు వార్త ఏమంటున్నదీ అంటే..?
క్వాలిటీ పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక ఏటీఎంలా వాడుకుంది ఈయన, ఇతని కొడుకు సాయి అభిషేక్ రావు… పాత కంపెనీలో కొత్తగా హర్షవర్ధన్ రెడ్డిని బినామీగా చేర్పించి కొడుకుకి పాత్ర కల్పించాడట… ఆహా, నాడు వైఎస్ హయాంలో కేవీపీ గ్యాంగ్ ఆ అక్రమార్జన బాగోతాల్లో చేరినట్టు…
పాలమూరుతో పాటు , కాళేశ్వరంలో భారీగా సబ్ కాంట్రాక్టులు ఇప్పించాడుట… అనుభవం లేకుండానే అంతా ఆ హర్ష కన్సస్ట్రక్షన్ కి దోచిపెట్టాడుట… గడిచిన బీఆర్ఎస్ హయాంలో ఈ ఇంజినీర్ చేసిన పాపాలు, అక్రమాలకు అంతులేదుట… సరే, ఈ వ్యవస్థలో ఇలాంటోళ్లను ఎలాగూ శిక్షించగలమనే నమ్మకం లేదు… అంతటి ఫోన్ ట్యాపింగ్ ధూర్తుడినే మన వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయి కదా…
అసలు ఇది కాదు… మన ఏసీబీతో పనికాదు… దాని స్థాయి సరిపోదు… ఫార్ములా రేసింగునే ఓ కొలిక్కి తీసుకురాలేని ఘోర వైఫల్యం… పోనీ, సీబీఐకి ఇస్తారంటే… అసలే బీజేపీ, కేసీయార్ రహస్య స్నేహితులు… అదేమీ ఫలించదు… ఈ విషయంలో మోడీని అస్సలు నమ్మలేదు తెలంగాణ సొసైటీ… మరెలా..? ఈ ఇంజినీర్ దోచిపెట్టిన సంపద ఎటు పోయిందో తేలేది ఎలా..?
ఎంత డొల్లతనం మన సొసైటీలో… వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో ఇంకా ఏవేవో వివరాలు కనిపిస్తున్నాయి… కేసీయార్ అక్రమార్జన విశ్వరూపం హాశ్చర్యానికి గురిచేస్తోంది… ఎహె, ఇవన్నీ ఆరోపణలు అంటుంది తన క్యాంపు… అంతేకదా… ఇండియాలో, ఇప్పుడున్న మన సిస్టంలో రాజకీయ నాయకుల అక్రమార్జనను తవ్వి తీసి, శిక్షించేందుకు చాన్స్ ఉందా..?
Share this Article