.
ప్రపంచం వేగంగా డిజిటల్ మీడియా వైపు పరుగులు తీస్తోంది… పలుసార్లు నేను ఇదే చెబితే చాలామంది వ్యతిరేకించారు… కరోనా కాలం తర్వాత ప్రింట్, టీవీ మీడియా మళ్లీ పుంజుకున్నాయని, యాడ్ రెవిన్యూ మస్తు పెరిగిందని చెప్పుకొచ్చారు… కానీ అది అబద్ధం… అంకెలే అన్నీ చెబుతుంటాయి కదా…
ప్రింట్ పరిస్థితి ఈరోజుకూ బాగాలేదు, ఇక ఉండబోవడం లేదు, అది ఫిక్స్… కాకపోతే పొలిటికల్ అవసరాలున్న పత్రికలు, అంటే బాకాలు మాత్రం కొన్నాళ్లు ఆ పార్టీల ఫైనాన్షియల్ సపోర్టుతో నడుస్తాయి… సొంతంగా బ్రేక్ ఈవెన్ అయ్యే సీన్ లేదు… ఇక ఉండదు కూడా…
Ads
ఇప్పుడు విశేషం ఏమిటంటే..? డిజిటల్ మీడియా టీవీలను కూడా కబళిస్తోంది… నిజం… డిజిటల్ మీడియా అంటే అదొక అనకొండ… ఆల్రెడీ యాడ్ రెవిన్యూలో టీవీలను అది దాటేసింది… ఫిక్కీ, ఈవై కలిసి క్రోడీకరించిన, భావి అవకాశాలపై ప్రొజెక్ట్ చేసిన వివరాలు ఇవిగో… జాగ్రత్తగా చూడండి…
(అంకెలు బిలియన్లలో…) కరోనా కాలం నుంచి గమనిస్తే డిజిటల్ మీడియా ఆధిపత్యం బాగా పెరిగింది… ఐతే ఇంత వేగంగా టీవీల ఆదాయాన్ని కూడా కబళిస్తుందని అనుకోలేదు… ఓటీటీల వాడకం పెరిగింది… టీవీలను చూడటం మానేస్తున్నారు జనం…
టీఆర్పీల సరళి అదే చెబుతోంది… స్టార్లు నటించిన సినిమాల ప్రీమియర్ ప్రసారాలను సైతం జనం పట్టించుకోవడం లేదు… ఏదో ఏజ్ బార్ ప్రేక్షకులు ఇంకా సీరియళ్లను చూస్తున్నారు కాబట్టి ఈమాత్రం యాడ్ రెవిన్యూ, ఈమాత్రం రేటింగ్స్ వస్తున్నాయి… అవీ ఇప్పుడు ఓటీటీల్లో పెట్టేస్తున్నారు కదా, వేగంగా వాటి వీక్షణం, రేటింగ్స్ కూడా దెబ్బతినబోతున్నాయి…
ఈటీవీ విన్ అయితే టీవీల్లోకన్నా మా యాప్‌లోనే ముందుగా ఆ కంటెంటు చూడంటి అంటోంది ఈమధ్య… దానికి తెలుసు ఇక టీవీల పని అయిపోయిందని… అందుకని యూట్యూబ్, తన ఓటీటీ మీదే రెవిన్యూ కోసం ఆధారపడుతోంది… ఇక న్యూస్ చానెళ్ల పరిస్థితి మరీ దరిద్రం…
డిజిటల్ మీడియా అంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు, యూట్యూబ్, ఓటీటీలు ఎట్సెట్రా అన్నీ… పైగా రోజుకు అయిదారు గంటలపాటు ఇండియన్లు స్మార్ట్ ఫోన్లు చూస్తూ కాలం గడుపుతున్నారని ఓ సర్వే నివేదిక… ప్రపంచంలోనే మనం థర్డ్ ప్లేసు అట…
సో, ప్రచార కర్తల కన్ను ఈ ప్రేక్షకులపైనే ఉంటుంది కదా… సో, గుండె దిటవు చేసుకొండి, మనం మరికొన్ని వేల యూట్యూబ్ చానెళ్లను చూడబోతున్నాం… ఇప్పటికే మన తెలుగు యూట్యూబర్ల కంటెంట్ విషాన్ని రుచిచూస్తూనే ఉన్నాం కదా… సొసైటీకి పెద్ద జాఢ్యం అవి… ఐనా ఆగబోవడం లేదు…
పైన టేబుల్ గమనిస్తే వేగంగా డెవలప్ అవుతున్నది లైవ్ ఈవెంట్స్… సంగీత కచేరీలు కావచ్చు, సినిమా ఫంక్షన్లు కావచ్చు, ఏదైనా సరే… వాటి యాడ్ రెవిన్యూ కూడా పెరుగుతోంది ఘనంగా… ఇంకా పెరుగుతుంది… మ్యూజిక్, రేడియో, ఓఓహెచ్ యాడ్స్ పెరగడం లేదు, తరగడం లేదు…
ఓఓహెచ్ అంటే హోర్డింగ్స్, బిల్ బోర్డ్స్, ఫ్లెక్సీలు ఎట్సెట్రా… ఔట్ డోర్ యాడ్స్… ఓ ట్రాజెడీ ఏమిటంటే..? ఆన్‌లైన్ గేమింగ్ యాడ్ రెవిన్యూ ఇంకా పెరగబోతోంది… ఇప్పటికే అది డామినేట్ చేస్తోంది… ఇదీ సంగతి…!! చివరగా… 2027 నాటికి మన మీడియా, వినోద రంగ ఆదాయం మూడు లక్షల కోట్లకు చేరబోతోంది…!!
Share this Article