నమస్తే తెలంగాణ దినపత్రికను దిశ అనే డిజిటల్ పేపర్ కొట్టేసింది… ఇక తరువాత టార్గెట్ ఆంధ్రజ్యోతే… ఆ తరువాతే సాక్షి, ఈనాడు…… ఆశ్చర్యపోకండి… దిశ డెయిలీ అలెక్సా ర్యాంకు స్టేటస్ ఇదీ అంటూ, ఇతర పత్రికల ర్యాంకులతో పోలిస్తూ ఓ చిన్న చార్ట్ వాట్సప్‌లో కనిపించింది… దాన్ని చూస్తే అలాగే అనిపించింది… కాస్త చిత్రంగా కూడా తోచింది… అంటే అది అబద్ధమని కాదు… ఆ ప్రచారమూ తప్పు అని కాదు… అవి నిజమైన ర్యాంకులే… కానీ దిశ తను పోల్చుకున్న పత్రికల జానర్ వేరు… దిశ జానర్ వేరు… దిశ కేవలం డిజిటల్ ఫార్మాట్… వెబ్సైట్ ప్లస్ ఈ-పేపర్… కానీ మిగతావి అలాకాదు, అవి ఫిజికల్ పేపర్స్… ప్రింట్ ఎడిషన్లున్నయ్… అందుకని వాటి వెబ్సైట్ల ర్యాంకులతో పోల్చుకోవచ్చా అనేది ఓ ప్రశ్న… ముందుగా ఆ చార్ట్ చూడండి…
ఇందులో ఏడు పేర్లుంటే దిశ తప్ప మిగతావన్నీ ప్రింట్ ఎడిషన్లున్నవే… వెలుగు, మనతెలంగాణ, నమస్తే తెలంగాణ కేవలం తెలంగాణకే పరిమితమైనవి కాగా సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడుల పరిధి వేరు… అవి రెండు రాష్ట్రాల్లోనూ విస్తరించిన రాజ్యాలు… వాటి రేంజ్ వేరు… ఈ మూడు పత్రికలకూ సొంత చానెళ్లున్నయ్, ఏబీఎన్, సాక్షి, ఈటీవీ… వాటి వీడియోలు కూడా వాటి వెబ్సైట్లలో కనిపిస్తుంటయ్… అఫ్ కోర్స్, వెలుగుకు వీ6, నమస్తే తెలంగాణకు టీన్యూస్ కూడా ఉన్నా ఆ వెబ్సైట్ల రీచ్ మిగతా మూడు ప్రధాన పత్రికలతో పోలిస్తే తక్కువే… మనతెలంగాణను పెద్దగా దేనితోనూ పోల్చాల్సిన పనిలేదు… ఆంధ్రప్రభ, నవతెలంగాణ కూడా చాలా దిగువన ఉంటయ్… శ్రీనివాసరెడ్డి నడిపే ప్రజాపక్షం కనుచూపు మేరలో కనిపించదు… మరి దిశ..?
Ads
ఇది కేవలం డిజిటల్… పత్రిక పయనిస్తున్న పంథా సరైనదే… ఎవరికీ డప్పు కొట్టకుండా సాగుతోంది ఇప్పటికైతే… కథనాల్లో నవ్యత, నాణ్యత, ప్రజెంటేషన్ గురించి వదిలేస్తే… (మొన్నొకరోజు ఫస్ట్ లీడ్ స్టోరీలో క్షీరద సంతతికి చెందిన పక్షి జాతి అంటూ గబ్బిలాల గురించి రాసిన తీరు నవ్వు పుట్టించింది… సో, ప్రొఫెషనల్ ఎఫిషియెన్సీ దిశలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది…) అలెక్సా ర్యాంకును ప్రామాణికంగా తీసుకోవచ్చా..? ఇదీ పెద్ద ప్రశ్న… ఆ ర్యాంకుల్ని ప్రభావితం చేసే టెక్నిక్స్ చాలామంది సోషల్ మీడియా ప్రమోటర్లకు, ఈ ఫీల్డులో ఉన్నవాళ్లకు తెలుసు… అంటే దిశ ర్యాంకు ట్యాంపర్డ్ అని కాదు, నిజంగానే మంచి ర్యాంకే వచ్చి ఉండవచ్చుగాక… కానీ టీవీ బార్క్ రేటింగుల్లాగే అలెక్సా కూడా..! గ్రేటాంధ్ర వన్ సైడ్ డప్పు అయినా సరే అలెక్సా ర్యాంకుల్లో ఏనాటినుంచో ప్రధానపత్రికల సైట్లకు దీటుగా ఉంటుంది… దానికి ఉండే ప్లస్ పాయింట్స్ దానికుంటయ్… ఈ-పేపర్లు లేని తెలుగు వెబ్సైట్లు కూడా మంచి మంచి ర్యాంకుల్ని మెయింటెయిన్ చేస్తున్నయ్… ఉదాహరణకు తుపాకీ, తెలుగుఅడ్డా ఎట్సెట్రా… సమయం, న్యూస్18, అసియానెట్, వన్ ఇండియా ఇంకో టైప్… అందాల పొందు, పరువాల విందు, తడిసిన సొగసులు… ఈ టైప్ వార్తలు, ఫోటోలతో వెర్రి కిక్కు అమ్ముకునే కక్కుర్తి ఎక్కువ… సో, దేని జానర్ దానిదే… ఏమో, ఈ టెంపో ఇలాగే మెయింటెయిన్ చేసి, త్వరలో ఆంధ్రజ్యోతిని కొట్టేస్తే మంచిదేగా అంటారా..? కానివ్వండి… పోటీ ఎప్పుడూ మంచిదేగా…!!
Share this Article