Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యండమూరి గ్రేట్… దిల్ రాజు బేకార్… కాస్త తడి ఉండాలోయ్ తెల్ల కల్లూ…

June 18, 2025 by M S R

.

ఒక ఫోటో… మనసును కదిలించింది… అదేమిటంటే..? అలనాటి తెలంగాణ జానపద హీరో కాంతారావు కొడుకు రాజకు ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ లక్ష రూపాయల చెక్కు ఇచ్చాడు… ఎందుకు..?

ఓసారి ముందుగా మిత్రుడు Mohammed Rafee పోస్టు ఓసారి చదవండి….

Ads



కాంతారావు కుమారుడు రాజాకు లక్ష రూపాయలు… తెలంగాణ హీరో కాంతారావు కుమారుడు రాజాకు
రచయిత దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ లక్ష రూపాయలు అందించారు… యండమూరి గారికి ధన్యవాదాలు… టివి నటి సుమిత్ర గారు సమన్వయం చేశారు… రాజా కూడా సుడిగుండాలు సినిమాలో బాల నటుడుగా నటించి నంది బహుమతి గెలుచుకున్నారు అప్పట్లోనే!

.
‘‘ఇంటి అద్దె కూడా కట్టలేకున్నారని తెలిసి రఘుపతి వెంకయ్య అవార్డు తీసుకుంటున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారికి “మీ బహుమతి మొత్తంలో చాలా భాగం వివిధ సేవా కార్యక్రమాలకి అందచేస్తాను” అని వేదిక మీదే చెప్పాను…

అందులో భాగంగా కడప “ఆర్తి ఫౌండేషన్” కి 3,00 000, శ్రీకాకుళం పక్కన చిన్న పల్లెటూర్లో పది లక్షల ఖర్చుతో పేద అనాథ విద్యార్థులకు సహాయం చేసే నిమిత్తమై ‘అభయం ఫౌండేషన్’ కి నా వంతు గా 1,00 000 ఇవ్వటం జరిగింది…

ముఖ్యంగా నటుడు కాంతారావు గారి పేరు మీద పది లక్షల రూపాయలు ఉత్తమ నటుడికి ఇస్తున్న సందర్భంలో, ఫంక్షన్ చూడటానికి రమ్మని వారి కుటుంబానికి వెయ్యి రూపాయలు పంపించారట.
కాంతారావు గారి కొడుకు రాజా, అద్దె కట్టడానికి కూడా వెతుక్కునే స్థితిలో ఉన్నాడని తెలిసి, వెంటనే మా ఇంటికి పిలిపించి ఆ బహుమతి మొత్తంలో అతడికి ఒక లక్ష రూపాయలు ఇవ్వటం జరిగింది…. – యండమూరి వీరేంద్రనాథ్’’

నిజానికి కాంతారావు అవార్డు అందుకున్న హీరో విజయ్ దేవరకొండ స్పందించాలని నేను రాశాను! అనూహ్యంగా మీ నుంచి స్పందన రావడం చాలా సంతోషం. రాజాకు లక్ష రూపాయలు ఇవ్వడం చాలా ఆనందంగా వుంది. సమన్వయం చేసిన సుమిత్ర పంపన గారికి కృతజ్ఞతలు… – డా. మహ్మద్ రఫీ



ఎస్, ఇక్కడ ఎన్ని ద్రోహాలు..? విజయ్ దేవరకొండకు ఏమైంది..? ఏం తక్కువ..? ఆయన సహచరి కూడా 3 వేల కోట్ల హీరోయిన్ కదా… తన అవార్డు మొత్తాన్ని ఇస్తే ఏం పోయింది..?

దిల్ రాజుకు దిల్ లేదు, దిమాక్ లేదు సరే… కనీసం కాంతారావు పేరిట అవార్డులు పొందినవాళ్లయినా స్పందించాలి కదా… ఎవరో యండమూరి స్పందించి ఓ లక్ష పారేస్తే అభినందనలు చెబుదామా..? తను సరే, అభినందనీయుడే, కానీ బాధ్యులకు ఏమైంది..?

ఆ పేరు వాడుకుంటారు, ఆ వారసులను పట్టించుకోరు, ఏమీ సాయం చేయరు, కనీసం పాసులు కూడా ఇవ్వరు… ఇంకెందుకు ఆ అవార్డులు, సహృదయతలు, మన్నూమశానం… ఫాఫం రేవంత్… దిల్ రాజు రెడ్డిని నమ్మితే ఇంకా ఇంకా బదనాం కాబోతున్నాడు… చూస్తూ ఉండండి…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యండమూరి గ్రేట్… దిల్ రాజు బేకార్… కాస్త తడి ఉండాలోయ్ తెల్ల కల్లూ…
  • ఓహ్… అప్పుడు శివుడు… కొన్నాళ్లకు మహాకాళి… సీన్ ఛేంజ్…
  • పోలవరం- బనకచర్ల వివాదంలో కార్నర్ అవుతున్నది కేసీయారే..!
  • సర్దార్… ఆ పేరుంటే చాలు సర్దార్ పాపారాయుడు కాలేడు కదా…
  • ‘‘ఆ జర్నీలో అనుకోని పరిచయం… ఒకరు సీఎం, మరొకరు పీఎం అయ్యారు…’’
  • ‘‘అంతటి లత బాగా పాడలేదనీ, మళ్లీ పాడమని అడగాలా, నెవ్వర్, నావల్లకాదు…’’
  • చేతగాకకాదు.., బప్పీ మార్క్ మెలొడీయే వేరు… పోనీ, ఈ పాటనేమందాం..?!
  • జాతిని… ఆ వెగటు కూతల నిర్మాత పిచ్చి కూతలు మళ్లీ… కవరింగు…!
  • అరాచకం..! షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్న ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు..!!
  • వావ్… వాట్ ఏ క్రికెట్ మ్యాచ్… మూడు సూపర్ ఓవర్లతో ఫలితం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions