.
నిజమే. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష అధికారిక హోదా ఉన్నా…సొంత సినిమాకు తెలంగాణాలో మాత్రమే సంక్రాంతి బెనిఫిట్ షో, టికెట్ల రేట్ల పెంపు లేనప్పుడు… అంతటి దిల్ రాజుకు తెలంగాణ జనాన్ని తిట్టాలనిపించదా!
ఉతికి ఆరేయాలనిపించి ఉంటుంది. ఆ బాధను మనసులో దాచుకోలేక కన్న ఊరు నిజామాబాద్ లో సొంత తెలంగాణ ప్రజలను దిల్ రాజు దారుణంగా అవమానించాడు. ఆంధ్రాలో అయితే సినిమా అనగానే జనంలో వైబ్ ఉంటుందట.
Ads
తెలంగాణాలో తెల్ల కల్లు, మటన్ ముక్కలంటేనే వైబ్ ఉంటుందట. బహిరంగ వేదికమీద ప్రత్యక్షప్రసారంలో వెకిలినవ్వుల సాక్షిగా దిల్ రాజు తెలంగాణా ప్రజలకు ఇచ్చిన గుర్తింపు, గౌరవం, మర్యాద ఇది.
https://www.facebook.com/reel/2294679370919129
మొన్ననే ఏపి జనసేనాని ఉపముఖ్యమంత్రి ఇచ్చిన బెనిఫిట్, రేట్ల పెంపు ఊపుమీద ఉన్న దిల్ రాజుకు సొంత ఊరివారు, సొంత రాష్ట్రంవారు సభ్యతలేని మనుషులుగా… మటన్, చికెన్ ముక్కలు, మందు చుక్కల కోసం ఎగబడే వెర్రిజనంగా కనిపించడంలో ఆశ్చర్యమేముంది?
జననీ జన్మ భూమిశ్చ… కన్న తల్లి, కన్న ఊరు స్వర్గం కంటే గొప్పవన్నాడు రాముడు. ఆంధ్రా జనం, వారి సినిమా అభిమానం స్వర్గంకంటే గొప్పవంటున్నాడు ఈ దిల్ రాజుడు. ఆంధ్రాభజన కోసమే దిల్ రాజుకు రేవంత్ పదవి ఇచ్చాడో! ఏమో!
హైదరాబాద్ సంధ్యలో రేవతి ఊపిరి ఆగింది. గేమ్ ఛేంజర్ రాజమండ్రితో రెండు ప్రాణాలు పోయాయి. సినిమా ఈవెంట్లు ఏమన్నా ఆగాయా? ఆగవు కాక ఆగవు. సినిమా టికెట్ పెంచే రేట్లతో ప్రభుత్వాలకు వచ్చే జిఎస్టీలతో ప్రజలకు జరిగే అభివృద్ధి ముందు చచ్చే ఈ మూడు ప్రాణాలు సముద్రంలో ఆవగింజంత కూడా కాదేమో పవన్ గారూ!
ఎంత చీప్ అయిపోయారు తెలంగాణ జనం ఫాఫం… ఈ దిల్ రాజును ఎంకరేజ్ చేసే పాపం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిదే… బన్నీ కేసులో మధ్యవర్తిత్వం వహించి ఏమైనా ఫాయిదా చేయించాడో కానీ … తను ఇంకెందుకూ అక్కరకు రాడు…
పైగా పదే పదే తన సినిమా బాపతు దిక్కుమాలిన మెంటాలిటీతో ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని భ్రష్టుబాట పట్టిస్తాడనేది తెలంగాణ జనం భయం… టీవీ భాషలో చెప్పాలంటే… రేయ్ ఎవర్రా మీరు… యాణ్నుంచి వచ్చార్రా మీరంతా..!! ఇకపై బీఆర్ఎస్ నేతలు ఎవరూ రేవంత్‌ను పట్టించుకోవల్సిన పనిలేదు… తన పతనం తనే సాధిస్తాడు..!!
Share this Article