.
శ్రీముఖికీ నీకూ ఇక తేడా ఏముంది దిల్ రాజూ… ఆమె నీ ప్రాపకం కోసం, నీ మెప్పు కోసం నిన్నూ, శిరీష్‌నూ కలిపి రామలక్ష్మణులు అని ప్రస్తావించింది.., వోకే, ఆమె అవకాశాల కోసం ఏదో తిప్పలుపడింది…
కానీ ఒరిజినల్ రామలక్ష్మణులు ఫిక్షనల్ కేరక్టర్స్ అని కూసి, ఆనక సోషల్ మీడియా బూతులు తిట్టేసరికి, దిగివచ్చింది… లెంపలేసుకుంది… క్షమాపణలు చెప్పింది జనానికి… తత్వం బోధపడింది… ఇకపై హోస్టింగ్ చేస్తుంటే పిచ్చి కూతలు కూయకుండా జాగ్రత్తపడాలనే పాఠం నేర్చుకుంది ఇన్నేళ్లకు…
Ads
నువ్వు కూడా అంతే కదా… అదే నిజామాబాద్ సభ… నీ సొంత జిల్లా… అక్కడ వెంకీ సినిమా సంక్రాంతికి వస్తున్నాం ప్రిరిలీజ్ ఫంక్షన్ అది… నీ సొంత ప్రజల ఎదుట ఎంత హుందాగా, ఎంత జాగ్రత్తగా ఉండాలి మరి…
తెల్ల కల్లు, మటన్ ముక్కకే మావాళ్లు వైబ్ ఇస్తారు అన్నావు… ఖచ్చితంగా తెలంగాణ జనాన్ని కించపరచడమే… అదీ ఎవరితో అన్నావు..? ఓ ఆంధ్రా డైరెక్టర్ దగ్గర అన్నావు… ఎస్, పిచ్చి, ఎడ్డి, దరిద్రపు సినిమాలకు తెలంగాణ ప్రజలు ఎందుకు వైబ్ ఇవ్వాలి..?
ఉన్మాదంతో ఊగిపోవాలా..? నువ్వు ఏదో సినిమా తీస్తే నీరాజనాలు పట్టాలా..? ఇష్టముంటే చూస్తారు, నచ్చితే చూస్తారు, లేదంటే ఎహె పోవోయ్ అంటారు… తమ పర్సుల దోపిడీకి ఒప్పుకోరు… తెలంగాణ జనం అంతే… ఇక కక్క ముక్క అంటావా..?
మీ సినిమావాళ్లు ఏమీ డబ్బులు ఇవ్వడం లేదు కదా… రేవంత్ రెడ్డిని లొంగదీసుకుని, మాట తప్పించి, తన ఇజ్జత్ తీస్తూ మరీ టికెట్ రేట్లు పెంచుకున్నావు, అదనపు షోలు పెంచావు… చివరకు హైకోర్టు కూడా ఈ ధోరణిని తప్పుపడుతోంది…
ఎస్, నీ వ్యాపారం కోసం నువ్వు ఎంతసేపూ ఆంధ్రా పెద్దరికాల్లో నలిగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెదిలీ మెదిలీ, నలిగీ నలిగీ తెలంగాణతనాన్ని కోల్పోయావు… అదీ అసలు సమస్య… అలా మారిపోయిన ఆంధ్రా దిల్ రాజు పలికించిన మాటలవి…
వోకే, మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అంటున్నావు… రాజకీయాల్లోకి లాగొద్దు అంటున్నావు… రాజకీయ నిర్ణయం లేకుండా నీకు ఎఫ్‌డీసీ అధ్యక్ష పదవి ఎలా వచ్చింది..? రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తావనే వార్తలు కూడా చదివినట్టు గుర్తు…
ఎఫ్‌డీసీ చైర్మన్ పదవి ఖచ్చితంగా రాజకీయ నియామకమే… ఎస్, ఇతర పార్టీలు ఖచ్చితంగా నీ వ్యాఖ్యలను, నీ అడుగుల్ని స్కాన్ చేస్తూ ఉంటాయి… తప్పు దొర్లితే కౌంటర్ చేస్తాయి కూడా… ఫిదా, బలగం సినిమాల గురించి, నీ ప్రాంతీయత గురించి నువ్వు ఏం చెప్పినా సరే… ఇప్పుడు వర్తమానంలో నువ్వు ఏం వ్యాఖ్యలు చేస్తున్నావనేదే ప్రధానం… కాస్త తెలంగాణతనాన్ని అలవరుచుకుంటే బెటర్… ఒక సూచన…!!
Share this Article