.
It is the time for KCPD అంటూ ఒక సాంగ్… కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ చేసిన దిల్ రూబా అనే సినిమాలో… అసలు హీరోకు గానీ, దర్శకుడికి గానీ, సంగీతం స్వరపరిచిన మేధావికి గానీ… కేసీపీడీ అంటే సోషల్ మీడియాలో ఏం అర్థం ఉందో తెలుసా.?
పరమ బూతు… నికృష్టమైన బూతు అది… కుర్చీ మడతబెట్టి అనే హుక్ లైన్‌కన్నా దారుణమైన బూతు… మరి ఏకంగా దాన్నే లీడ్ వాక్యంగా ఓ పాటే చేశారు ఎలా..? తెలుగు ప్రేక్షకుల టేస్ట్ మరీ అంత నీచమైన స్థాయిలో ఉందని ఈ సినిమా టీం విశ్వాసమా..? ఫాఫం టాలీవుడ్…
ఆ ట్యూన్ గందరగోళం… ఒక్క పదమూ అర్థం కాదు… అవేవే నాలుగు ఇంగ్లిషు పదాలను కూర్చి, జనం మీదకు ఓ న్యూట్రెండ్ సాంగ్ తరహాలో వదిలారు… ఇంతకీ కేసీపీడీ అంటే ఏమిటో కావాలా..? ఓ వెబ్‌సైటులో వివరించారు ఇలా…
Ads
ఈ నిర్మాత మొన్న ఎక్కడో మాట్లాడుతూ… ‘ఈ సినిమాలో యాక్షన్ సీన్లు చూసి జనం తెరలు చింపేస్తారు… లేకపోతే నన్ను రాబోయే ప్రెస్‌మీట్‌లో కొట్టండి’ అని సవాల్ విసిరాడు… ఇప్పుడు ఇదో ట్రెండ్… నాని కూడా అంతే కదా… కోర్ట్ అనే సినిమా నచ్చకపోతే, రాబోయే నా సినిమా హిట్3 చూడకండి అని సవాల్…
అసలు దిల్ రూబా పేరెందుకు పెట్టారనేది వదిలేస్తే… అసలు యాక్షన్ సీన్లు కావాలని జొప్పించారు గానీ వాటికి ఏ ప్రాధాన్యం లేదు, అంత సీనూ లేదు… నిర్మాత బహుశా ఇప్పట్లో ప్రెస్‌మీట్ కూడా పెట్టకపోవచ్చు… సినిమాలో చూపించారు కదా, కేసీపీడీ థీమ్ ఫైట్లు…
హీరోకు ఓ అలవాటు అట… సారీ చెప్పడట, థాంక్స్ చెప్పడటం… దానికి ఓ రీజనింగ్ ఉందట… నప్పలేదు… ఓ లవ్ స్టోరీ, బ్రేకప్… ఎటో వెళ్లిపోతుంది ఆమె… మళ్లీ మరో లవ్ ట్రాక్… మళ్లీ విభేదాలు… తీరా మొదటి బ్రేకప్పు అమ్మాయి వచ్చి ఈ రెండో లవ్ సెట్ చేయడానికి ట్రై చేస్తుంది… ఏమిటీ గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తోందా..?
అవును, సినిమా కథ, ప్రజెంటేషన్ అంతా అలాగే… ఓ సాదాసీదా ప్రేమకథను ఏదేదో చేయబోయి ఇంకేదో చేశారు… ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేసిన వాళ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… పాటల గురించి మొదట్లోనే చెప్పుకున్నాం కదా, బ్రహ్మాండమైన టేస్ట్ గురించి…
ఆమధ్య ‘క’ అనే సినిమా చేశాడు కిరణ్… కాస్త ఈజ్ ఉంది, పర్లేదు, చిన్న సినిమాలకు భలే పనికొస్తాడు అనుకున్నారందరూ… ఆ సినిమాకు థియేటర్ల కేటాయింపుపైనా బోలెడు విమర్శలొచ్చాయి సినిమా పెద్ద తలకాయల మీద… కిరణ్‌కు అన్యాయం చేశారనే అనిపించింది అందరికీ…
తీరా ఈ సినిమా చూస్తే ఉసూరుమనిపించాడు కిరణ్… తన గొంతుకూ బలమైన పంచ్ డైలాగులకూ పొంతన కుదరడం లేదు, ఏదో తేడా కొడుతోంది… తన డైలాగ్ డిక్షన్ మార్చుకోకపోతే మాత్రం కెరీర్ ముందుకుసాగడం కష్టం… చాలు, ఇప్పటికే ఎక్కువ చెప్పుకున్నాం… సో, సారీ కిరణ్, నో థాంక్స్, థియేటర్ దాకా రాలేం..!!
Share this Article