Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దర్శకుడు విశ్వనాథుడు శంకరాభరణంకన్నా ముందు డిఫరెంటే సుమీ..!!

June 17, 2025 by M S R

.

Bharadwaja Rangavajhala……………..  కె.విశ్వనాథ్ గారు శంకరాభరణం కన్నా ముందు చాలా సినిమాలు తీశారనే విషయం చాలా మంది మర్చిపోతున్నారనే నా అవేదన. ఆయన తొలి సిన్మా హీరో అక్కినేని అయినప్పటికీ NTR తో నాలుగు సిన్మాలు చేశారు అని ఎవరికైనా తెలుసా?

NTR డేట్స్ దొరక్కే.. జీవన జ్యోతి శోభన్ బాబుతో తీశారు.. NTR తో విశ్వనాథ్ అంఖుల్ కి సినిమాల్లోకి రావడానికన్నా ముందే పరిచయం ఉందని తెల్సా? వాళ్లిద్దరూ… బెజవాడ నుంచి గుంటూరు వరకూ రోజు వొకే ట్రైన్లో ట్రావెల్ చేస్తూ బోల్డు విషయాలు మాట్లాడుకునేవారు పాపం…

Ads

విశ్వనాథ్ కన్నా NTR పెద్ద… విశ్వనాథ్ ఇంకా కాలేజ్ లో ఉండగానే అన్నగారు సబ్ రిజిష్టార్ అయిపోయారు… విచిత్రంగా ఇద్దరూ వాహిని కాంపౌండ్ లో తిరిగి కలిశారు. శంకరాభరణం సిన్మా ఆయన తొలి చిత్రం అనుకునేవారు… ఆయన కేవలం సంగీతం సిన్మాలు తీశారు అనుకునేవారు కూడా ఉన్నారు పాపం.

శంకరాభరణం ఆడుతున్న రోజుల్లోనే, ఆయనే దర్శకత్వం వహించిన అల్లుడు పట్టిన భరతం సినిమా విడుదలైన విషయం ఎందరికి గుర్తుంది? అలాగే ప్రెసిడెంట్ పేరమ్మ అనే టైటిల్ తో ఆయన నూతన్ ప్రసాద్ , కవితలతో ఓ సోషల్ డ్రామా తీశారని ఎంత మందికి గుర్తుంది.

వీటన్నిటికన్నా ముందు… ఆయన కాలాంతకులు అనే ఓ క్రైమ్ ఓరియంటెడ్ మూవీ తీశారు.. అందులో గుర్రాలు ఫైట్లూ ఉండడంతో … కెఎస్ఆర్ దాస్ గారిని తీసుకొచ్చి అవి తీయించుకుని దర్శకులలో తనతో సమానమైన స్తానాన్నిస్తూ ఆయన పేరూ వేయడం విశ్వనాథ్ సంస్కారానికి నిదర్శనం.

మరి మా జర్నలిస్ట్… ప్రస్తుతం మా ఆఫీస్ ఉన్న ఇంటి ఓనరు అయిన వాసిరాజు ప్రకాశం గారికి కాలం మారింది అనే సినిమా తీసిపెట్టారాయన. శంకరాభరణం కన్నా ముందు కూడా విశ్వనాథ్ సినిమాల్లో సంగీతం కాస్త ప్రత్యేకంగా ఉండేది.

శంకరాభరణం తర్వాత ఆయన సినిమాలు సంగీత ప్రధానమై పోయాయి. ఇదీ తేడా .. తప్ప మిగిలినదంతా సేమ్ టూ సేమ్ … విశ్వనాథ్ ఎప్పుడూ సెన్సుబుల్ మూవీసే చేశారు పాపం . తన సినిమాల గురించి ఆయనే ఓ సందర్భంలో ఓ మాట చెప్పారు. నా సినిమాలు పది మందిలో ముగ్గురు గ్యారంటీగా చూస్తారయ్యా … ఆ సంఖ్య ఒక్కోసారి ఆరు దాకా వెళ్తుంది.. అలా వెళ్లిన సినిమాలను మీ భాషలో హిట్టు సినిమాలంటారు అన్నారాయన.
నేను జర్నలిస్టునని తెల్సి వెటకారంలో ….!

ఆ ముగ్గురూ ఇప్పుడు విశ్వనాథ్ సినిమా థియేటర్లలో వేసినా వెళ్లి కూర్చుంటారంతే .. విత్ ఫామ్లీస్ మళ్లీ … అదీ ఆయన ముద్ర .. కాకపోతే చిన్నప్పుడు కాలేజీ రోజుల్లో ఎన్ కౌంటర్ పింగళి దశరథ రామ్… అన్న మాట నాకు చాలా ఇష్టం…

’’శివాలయంలో పూజారిగా ఉండాల్సిన విశ్వనాథ్ నీ, రామాలయంలో పూజారిగా ఉండాల్సిన బాపూనీ దర్శకుల్ని చేశారేమిట్రా బాబో’’ అని ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions