అన్సవ్వ… తెలంగాణ భాషలో అలాగే అంటారులే… చనువు ఉన్నవాళ్లయితే అన్సీ అని కూడా ప్రేమగా పిలుస్తారు… సూపర్ తెలుగు టీవీ యాంకర్ అనసూయ ఇంటర్వ్యూ ఒకటి కనిపించింది ఏదో పత్రికలో పొద్దున్నే… దిక్కుమాలిన ‘కవరేజీ’… సందర్భం ఏముంది అని కూడా ఆలోచించకుండా గీకడమే సినిమా వార్తల కవరేజీ కదా అని నిందించవద్దు… మస్తు రాసేశాడు ఎవరో… ఫాఫం, పొట్టతిప్పలు తప్పవు కదా… కానీ… చదువుతుంటే భలే నవ్వొచ్చింది…
ఈమె సంగతి తెలుసు కదా… ఏదేదో చెబుతూ పోయింది… ఈ లోకమంతా ఎడ్డిది, నేను మాత్రం సొక్కం అనే రకం ఈమె… (తప్పుగా భావించకు తల్లీ, అసలే తిక్కమేళం, ఇక్కడ ఏమీ తిట్టలేదు నిన్ను… సొక్కం అంటే ప్యూర్ అని అర్థం… అసలే నీ నోరు పెద్దది… నువ్వేం చెబుతావో నీకే తెలియదు… చాగంటి అనసూయవు… ఎక్కువశాతం అంతే…)
Ads
ఈమె మస్తు యాక్టరట, బాగా పర్ఫామ్ చేయగలదట, కానీ కేవలం పాటలకే పరిమితం చేసే ఆఫర్లు వస్తున్నాయట, అదీ రంగమ్మత్త టైపేనట… దాంతో బోలెడు, బొచ్చడు ఆఫర్లను ఫోఫోరా అని తన్ని తరిమేసిందట… ఈ తలకుమాసిన డైరెక్టర్లకు తన ప్రతిభ ఏమిటో అర్థం కావడం లేదు అన్నంత బిల్డప్ ఇచ్చింది ఇంటర్వ్యూలో… గుడ్, అంత ఆత్మవిశ్వాసం ఉండటం మంచిదే… కానీ అది మరీ అతి గాకుండా చూసుకోవాలి కదా…
ఏదమ్మా, ఒక్కటి చెప్పు… నువ్వు ఇరగదీసిన పాత్ర ఏమిటో… ఆ బూతు పాట రంగమ్మత్త మినహా… ! ఆ బూతు స్కిట్ల జబర్దస్త్ రేంజ్ కదా… సరేసరి… ఇంకేముంది తల్లీ, ఇది నేను అని చెప్పడానికి…!
పాపం, ఎవరో దర్శకుడట, ఆడిషన్లో ఈమె నటన చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడట… కానీ ఆఫర్ మాత్రం ఇవ్వలేదట… హహహ… కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నాడో, తను లోలోపల ఎంత కుమిలిపోతే కన్నీళ్లు వస్తాయో ఈమెకు అర్థం కాలేదు… కొన్ని పాత్రలు తనను కాదని ఇంకెవరికో ఇచ్చారట, ఆఫ్టరాల్, వాళ్లెవరికీ నాకున్నంత టాలెంట్ ఎక్కడుంది అని బోలెడంత బాధపడిపోయింది… ప్చ్, లోకం అంతే అన్సవ్వా… సరిగ్గా గుర్తించి చావదు… ఊకో, ఊకో… బాధపడితే ఏమొస్తుంది చెప్పు..?
అవునూ.., పేకప్ చెప్పిన తరువాత నెట్వర్క్ బాగా ప్రభావం చూపిస్తుందా..? అంటే ఏమిటి..? మిటూ టైపా..? కమిట్మెంట్లా..? ఏదో ఒకటి సరిగ్గా చెప్పాలి కదా… నాలుగు పెద్ద సినిమాలు అంటే మాటలా..? నీకు జరిగింది అన్యాయమే… కాదు, యావత్తు తెలుగు చిత్రసీమకే జరిగిన అన్యాయం…
అది సరే గానీ అన్సవ్వా… అసలు ఒక దర్శకుడు ఆడిషన్ కోరాడు అంటేనే, తనకు నీ నటన మీద డౌటనుమానం ఉన్నట్టు కదా… ఈ లాజిక్ ఎందుకు మిస్సయ్యావు చెప్పు… అందుకే ఆ జబర్దస్తే దిక్కయింది నీకు..!! అవునూ అన్సీ… నీకు గప్పాలు అనే తెలుగు పదం తెలుసా..?! సార్, సార్, రాజమౌళి గారూ… త్రివిక్రమ్ గారు, బోయపాటి గారు, కమ్ముల శేఖర్ గారు డిన్నర్‌కు వస్తామన్నారు… ఇంకేమీ లేవు సార్ విశేషాలు… ఉంటాను…
Share this Article