ఫాఫం, అదసలే టీవీ ఇండస్ట్రీ… అందులోనూ బూతు అంటే పిచ్చిపిచ్చిగా పడిచచ్చే ఈటీవీ… రేటింగ్స్ కావాలి… అవి ఉంటేనే యాడ్స్… అంటే డబ్బులు… ఇంకా ఫాఫం… ఈటీవీ అసలే మూడో ప్లేసులో కొట్టుకుంటోంది… దాని బలమే గతంలో నాన్-ఫిక్షన్… సీరియళ్లు ఎవడూ చూడడు… దాన్ని నిలబెట్టేదే ఈటీవీ న్యూస్ బులెటిన్… ప్రపంచంలో బహుశా ఈటీవీ ఒక్కటే కావచ్చు న్యూస్‌తో నిలబడిన వినోద చానెల్… ఆ నాన్-ఫిక్షన్ కూడా ఎలా దెబ్బతినిపోయిందో మనం గతంలో చెప్పుకున్నాం…
ఎడాపెడా సినిమా ప్రమోషన్లతో, డబ్బు కక్కుర్తితో, ఆ ప్రోగ్రాముల అసలు కేరక్టర్‌ను దెబ్బతీసుకున్న వైనం చెప్పుకున్నాం… చివరకు ఓ పద్ధతిగా కనిపించే సుమతో కూడా పిచ్చి, వెగటు డైలాగులు పలికిస్తున్నారు… అదీ తాజా ట్రాజెడీ… అలాంటి డైలాగుల్ని ఆమె పలుకుతుంటే హాశ్చర్యమే కాదు, ఎలాంటి సుమ ఎంతకు దిగజారింది అనే సానుభూతి కలుగుతోంది…
నిజానికి సుమ అంటే ఇండస్ట్రీలో అందరికీ గౌరవం… స్పాంటేనిటీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్, మంచి మాటల ఫ్లో… ఎదురుగా లక్షల మంది ఏదో హీరో అభిమానులు కేకలు వేస్తున్నా సరే హోస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయగలదు… ఎక్కడా శృతితప్పదు… వెగటుతనాన్ని సమీపంలోకి కూడా రానివ్వదు… మరి అలాంటి సుమ కూడా ఇలా అయ్యిందేమిటి..?
Ads
తాజా క్యాష్ షోకు రాఘవేంద్రరావు అనే పాత దర్శకుడు ఒకాయన వచ్చాడు… గతంలో బొడ్డు-పండు ఫార్ములాతో చాలా హిట్లు కొట్టాడని అంటారు… ఎనభై ఏళ్ల వయస్సులో కూడా ఇంకా తెలుగు సినిమా తాలూకు బురదను, అశ్లీలాన్నే పట్టుకుని ఏడుస్తున్నాడనే విమర్శలున్నాయి… సరే, తన లైఫ్, తన లైక్ అనుకుందాం… అలాంటి దిక్కుమాలిన, సారీ, దిగ్దర్శకుడు అనాలేమో… సుమ నిర్వహించే ఓ కిట్టీ పార్టీ టీవీ ప్రోగ్రామ్‌కు రావడం విశేషమే… ఎందుకు రారు..? అసలే సుమ… ఆమె పిలిస్తే కీరవాణి, రాఘవేంద్రరావు సహా ఎవరైనా వస్తారు… ఆమె రేంజ్ అది…
సరే, వచ్చాడు… అంతకుముందే ఏదో ప్రోగ్రామ్‌లో ఫుల్లుగా మైండ్ వాచిపోయి ఉన్నట్టుంది… సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ రాఘవేంద్రరావు అదిలించినా, బెదిరించినా… బయటికి వెళ్లగొట్టిస్తాను అని చెబుతున్నా సరే… రెచ్చిపోయి కేకలు వేశారు… పిచ్చిపిచ్చిగా ఉందా అని సీరియస్ అయిపోయాడు ఈ వృద్ధ దర్శకుడు, ఈ ధవళకేశ దర్శకుడు… వేరే పెద్ద హీరో అయితే ఈ మాటలు అనేవాడా..? ఫ్యాన్స్ ఊరుకునేవారా..? దాన్నలా పక్కన పెడితే… క్యాష్‌కు వచ్చాడు, ఏవో పిచ్చిమాటలతో కాసేపు కాలం గడిపాడు…
ఎప్పటిలాగే కంటెస్టెంట్లుగా ఇంకో సినిమా ప్రమోషన్… వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా వస్తోందట… దానికి ప్రమోషన్… క్యాష్ కేరక్టరే సినిమాల ప్రమోషన్ కదా ఇప్పుడు… దానికి దర్శకత్వ పర్యవేక్షణ ఈ ఘనదర్శకుడట… అందుకని ప్రమోషన్ కార్యక్రమాలకు వస్తున్నాడు… ఆ షోలో అనసూయకు సుమ ఓ సరదా టాస్క్… ఏదో ప్రశ్న వేసి, కళ్లు మూసుకుని నాకు ఐస్‌క్రీమ్ తినిపించు, జవాబు అక్కర్లేదు అంటుంది… అనసూయ ఎక్కడెక్కడో పూసేస్తుంది… అప్పుడు అంటుంది సుమ… ‘‘నోట్లో తప్ప నాకు అన్నిచోట్లా పెట్టావ్’’…. పాపం శమించుగాక…
నిజానికి సందర్భం, సుమ తత్వం బట్టి ఆ మాటల్లో తప్పులేదు, అసభ్యత లేదు… కానీ ఈటీవీ పెంచిపోషిస్తున్న భాష ఒకటి ఉంది కదా… మింగుడు, గువ్వ ఎట్సెట్రా… ఇంకా లోతుల్లోకి వెళ్లను, సారీ… అందుకని సుమ నోటివెంట వచ్చిన ఆ వాక్యం పరమ అసభ్యంగా ధ్వనించింది… యద్భావం తద్భవతి అని కొందరు తిట్టుకున్నా సరే… సుమ ఇలాంటి డైలాగుల్ని అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది… అసలే రాజీవ్ కనకాలతో సరైన సంబంధాలు లేవు… ఈమధ్య ఏవేవో మాట్లాడేస్తోంది… అంత అవసరమా సుమా..? (ఈవారం బార్క్ రేటింగుల్లో ఈ క్యాష్ ప్రోగ్రామ్‌కు కేవలం 2.92 రేటింగ్స్ వచ్చాయి… సుమకు అర్థమవుతోందా..?)
మస్తు సంపాదించుకున్నవ్… ఎన్ని ఇళ్లు ఉన్నాయో, ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో నీకే తెలియదు… తెలుగు ప్రజల్లో ఒక్కరికీ ఆ విషయంలో నీమీద ఈర్ష్య లేదు… కొడుకును హీరో చేయాలని అనుకుంటున్నవ్… ఈ తొక్కలో ఆడియో ఫంక్షన్లు, ప్రిరిలీజులు, టీవీ ప్రోగ్రాములతో ఇంకా ఎన్నాళ్లు నోరునొప్పిపెట్టేలా కష్టపడాలి అనుకుని ఏదో సినిమాకు పైసలు పెట్టావ్… దేవుడు బ్రహ్మాండమైన పాపులారిటీ, ఆస్తి, కీర్తి ఇచ్చాడు… టీవీ రేటింగుల కోసం ఈ బేఇజ్జత్ మాటలు, ఏపీ పొలిటిషియన్ల భాష నీకు దేనికమ్మా..?!
Share this Article