గు- పగుల దెం-తే రేప్పొద్దన ట్యాంక్ బండ్‌లో తేలతవ్ బే మా- లౌ- ఇదీ ది గ్రేట్ యాంకర్ సుమ కొడుకు రోషన్ నటించిన బబుల్ గమ్ సినిమాలో ఓ వెగటు డైలాగ్… సదరు హీరో గారి ఆరంగేట్రం ఈ సినిమా… ప్రొమోలోనే, అనగా టీజర్‌లోనే ఈ రేంజ్ వెగటుదనం ఉందంటే ఇక సినిమా ఎలా ఉండబోతోందో… అఫ్‌కోర్స్, టీజర్‌లో మరో రెండు మూడు డైలాగులు ఇలాగే ఉన్నట్టున్నయ్…
ఓ సుదీర్ఘమైన లిప్ లాక్… పిచ్చి పిచ్చి డైలాగులకు తోడు… మరి హీరో గారి లాంచింగ్ కదా, ఏమాత్రమైనా యాక్షన్ లేకపోతే ఎట్లా అనుకుని అవీ పెట్టేసినట్టున్నారు… సరే, వాకిలి చూసి ఇల్లాలి పనితీరు అంచనా వేయవచ్చు అన్నట్టుగా… ఈ సినిమా గలీజుతనం టీజర్‌తోనే పక్కాగా సమజై పోయింది… ఈమాత్రం సినిమాకు పేరు రాజమౌళి సజెస్ట్ చేశాడట, టీజరేమో నాని రిలీజ్ చేశాడట… ఫాఫం వాళ్లిద్దరూ…
సదరు దర్శకుడు గతంలో ఏం సినిమాలు ఊడబొడిచాడు అనేది పక్కన పెట్టండి… ఈ డైలాగులు గట్రా చూస్తే సినిమా నిర్మాతలు, దర్శకుడు ఎట్సెట్రా బూతుతోనే యూత్‌ను అట్రాక్ట్ చేయాలని ఫిక్సయిపోయినట్టున్నారు… ఒక మూర్ఖపు ఆలోచన… నేటి ప్రేక్షకుల టేస్టును పూర్తిగా అండర్ ఎస్టిమేట్ చేసినట్టున్నారు… ఇలా బూతులతో యూత్‌ను అట్రాక్ట్ చేయాలని సినిమాలు తీసి, నిండా మునిగిపోయిన కథలు బోలెడు… బూతు విచ్చలవిడి స్థాయిలో యువత చేతుల్లో స్మార్ట్ ఫోన్ రూపంలో ఉంది… ఈ చిన్నాచితకా బూతులు, లిప్‌లాకులు, ఇంటిమేట్ సీన్ల కోసం థియేటర్‌కు వచ్చి నిలువుదోపిడీ ఇచ్చేవాళ్లు కాదు నేటి యూత్…
Ads
సరే, ఇదీ కాసేపు పక్కన పెడితే… ఇక్కడ నిర్మాత, దర్శకుడు, హీరో టేస్ట్ కోణంలో చూడరు ప్రేక్షకులు… సుమ కోణంలో చూస్తారు… తను చాలాకాలం నుంచి యాంకర్‌గా, సినిమా ఫంక్షన్ల హోస్ట్‌గా ఉంది… చాలా సీనియర్… పెద్ద పెద్ద ప్రముఖులే ఆమె వ్యవహారశైలిని అభిమానిస్తారు… గలగలా మాట్లాడటం, స్పాంటేనిటీ మాత్రమే కాదు, చుట్టూ వెకిలితనం రాజ్యమేలే వాతావరణంలో కూడా ఆమె ‘పద్ధతిగా’ ఉంటుంది… ఆమెను టచ్ చేయడం కాదు, ఆమె కళ్లల్లోకి చూడటానికే ఇండస్ట్రీలో చాలామంది భయపడతారు… అలా నడుచుకుంటుంది ఆమె…
అఫ్‌కోర్స్, ఆమె టీవీ షోల పట్ల ప్రేక్షకులకు మొనాటనీ వచ్చేసింది, అన్నీ ఫ్లాప్… రేప్పొద్దున సినిమా ఫంక్షన్లయినా అంతే… ఏదో ఓ సినిమాను తను ప్రధాన పాత్రగా తీసింది… ఫట్‌మని పేలిపోయింది… కొడుక్కి ఏదో ప్రాబ్లమ్ ఉంటే కొన్నాళ్లు బెంగుళూరులో చికిత్స కూడా చేయించినట్టు చెబుతారు… ఇప్పుడిక తనను ఇండస్ట్రీలో లాంచ్ చేయడానికి నానా తిప్పలూ పడుతోంది… అలాంటి సుమ కొడుకు తొలి సినిమాయే ఇలాంటి బూతా అని ప్రేక్షకులు తిట్టుకునే ప్రమాదం టీజర్‌తోనే అర్థమవుతోంది…
సినిమాలో మరో ప్రధాన పాత్రను మానస చౌదరి పోషిస్తోంది… ఆమెకూ ఇదే తెరంగేట్రం ఉన్నట్టుంది… కొత్త కదా, దర్శకుడు ఎలా చెబితే అలా ‘ఫ్రీగా’ యాక్ట్ చేసింది… ఫాఫం ఆమె తిప్పలు ఆమెవి…
కొడుకు రోషన్ కెరీర్ విషయంలో సుమ ఆదిలోనే తప్పుటడుగులు వేయిస్తోంది… ఆమె భర్త రాజీవ్ కనకాల ప్రమేయం ఏమీ ఉండదు… తన మాటేమీ చెల్లదు… అంతా ఆమే… సో, కొడుకు సినిమా ఎలా ఉన్నా సరే సుమ కోణంలోనే చూస్తారు… తను ఆల్‌రెడీ ఫీల్డ్‌లో ఉన్నవాడైతే తన కెరీర్ తన ఇష్టం, సుమ కోణంలో చూడరు… మరి సుమ ఏం ఆలోచించినట్టు..? ఈ బూతుల టీజర్‌ను తను చూసిందా..? కుర్చీ మడతపెట్టి అనే ఇటీవల వైరల్ డైలాగుల్లాంటివి సినిమాలో చాలా పెట్టినట్టున్నారు… ఏం సుమా..? ఫాఫం సుమా అనుకోవాలా మేమంతా..?!
Share this Article