ప్రజ్వల్ రేవణ్న అనే ధూర్తుడి ఫోటో కూడా చూపించడానికి మనసొప్పడం లేదు… బలుపు అనే పదం సరిగ్గా వర్తిస్తుంది… ఈ మాటలు చదువుతుంటే చాలా హార్ష్ అనిపించినా సరే, అనడానికి సందేహించనక్కర్లేదు… అధికారం, డబ్బు, ఆ కుటుంబనేపథ్యం ద్వారా కొందరిని ఆవరించే బలుపుకి ప్రజ్వల్ ఓ బలమైన ఉదాహరణ…
అనేక వీడియోలు… లైంగిక ఆరోపణలు… ఎందరో బాధితులు… దాదాపు 3 వేల వీడియోలు బయటకొచ్చాయి… చివరకు సోదరి వరుస లేడీస్‌ను కూడా వదల్లేదట ఈ కామాంధుడు… లైంగికంగా వేధిస్తూ వీడియోలు తీసేవాడట… ఎవరు ఈయన అంటారా..? ది గ్రేట్ మాజీ ప్రధాని, 90 ఏళ్ల వయస్సులో కూడా ఇంకా రాజకీయాలు వదలని దేవెగౌడ ఉన్నాడు కదా… తనకు రేవణ్న అనే పెద్ద కొడుకు… పెద్ద ముదురే… తనూ రాజకీయాల్లోనే వెలగబెడుతున్నాడు… అదుగో ఆయన కొడుకు ప్రజ్వల్… ‘‘పెద్ద ఆటగాడే’’… మాజీ సీఎం కుమారస్వామి అన్నకొడుకు… అఫ్‌కోర్స్, కుటుంబసభ్యులందరూ ఏదో ఒక పదవిలో ఉంటారు తెలుసు కదా… ప్యూర్ కుటుంబపార్టీ జేడీఎస్…
నిజానికి ప్రస్తుతం రచ్చ రేపుతున్న ప్రజ్వల్ డర్టీ వీడియోస్‌కు సంబంధించి తన తండ్రి దిక్కుమాలినతనాన్ని తిట్టాలి ఓసారి… ‘అబ్బే, అవన్నీ పాత వీడియోలు, కావాలని పోలింగ్‌కు ముందు కాంగ్రెస్ రిలీజ్ చేసింది, రచ్చ చేస్తోంది’ అని సమర్థిస్తున్నాడు… నిజంగానే సిగ్గులేనితనం… కనీసం ప్రజ్వల్ అవన్నీ మార్ఫ్‌డ్ వీడియోలు అంటున్నాడు గానీ తండ్రి మాత్రం జస్ట్ పాతవి అంటున్నాడు తప్ప అవి ఫేక్ అనడం లేదు…
Ads
అంటే, పాతవైతేనేం..? అప్పుడు కామాంధుడే తప్ప ఇప్పుడు సంసారి అని చెబుతున్నట్టా..? ఇదెక్కడి ఫూలిష్‌నెస్..? పైగా కాంగ్రెస్ కేసు పెడుతుందని తెలియకముందే విదేశాలకు వెళ్లే ప్లాన్ ఉంది, ఇదేమీ పారిపోవడం కాదు అంటున్నాడు… ఎస్, రాజకీయాల్లో జేడీఎస్ వంటి పార్టీని తొక్కడానికి ఇలాంటి అవకాశం వస్తే కాంగ్రెస్ ఎందుకు వదులుకుంటుంది..? పైగా తన ప్రత్యర్థి బీజేపీతో జతకట్టిన పార్టీ కదా… ఏకంగా ఓ సిట్ వేసింది…
ఈ దెబ్బకు బీజేపీ సిగ్గుతో తలదించుకుంది… జేడీఎస్ వంటి కుటుంబ, స్వార్థ, అవినీతి, కంపు పార్టీతో జతకట్టినందుకు ఆల్రెడీ విమర్శలు ఉండగా, ఇప్పుడు వెలుగుచూసిన ప్రజ్వల్ లీలలు బీజేపీని పూర్తిగా ఆత్మరక్షణలో పడేశాయి… పైగా ఈ ప్లేబాయ్ కోసం ఏకంగా మోడీ హసన్ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశాడు… (ఈ సీటు దేవెగౌడది, మనవడి కోసం త్యాగం చేశాడు)… ఇప్పుడు బీజేపీకి ఎటూ మాటరావడం లేదు… కర్నాటకలో మరోవిడత పోలింగ్ ఉంది… అదీ దాని భయం…
మరోవైపు కుమారస్వామి మాత్రం కాస్త రీజనబుల్‌గా ‘ఈ విషయంలో ఎవరు అనేది చూడదు మా పార్టీ, కఠినంగానే ఉంటాం’ అని స్పందించాడు… రేపో మాపో ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని మీడియా వార్తలు వస్తున్నాయి… ఏదో తూతూమంత్రం… ఎన్నికలైపోగానే అంతా గప్‌చుప్… కానీ నింద మోసేది బీజేపీ… కళంకం దానికే… అవినీతిపరుల్ని గుట్టుచప్పుడు గాకుండా దేశం దాటిస్తుందని, సహకరిస్తుందని ఆల్రెడీ పేరుందిగా… ఇప్పుడు ప్రజ్వల్ విదేశాలకు పారిపోవడానికి కూడా బీజేపీయే కారణమనే విమర్శలకు సరైన జవాబులు లేవు దాని దగ్గర..!!
Share this Article