.
Rochish Mon …..
ఛీ ఛీ ఇదేం పాత్రికేయం?- సాక్షిలో…
——————
‘ఒక తల్లి ఆమె కూతురు’ శీర్షికతో ఇవాళ సాక్షి ఎడిట్ పేజ్‌లో కరణ్ థాపర్ వ్యాసం చదివాక ‘ఛీ ఛీ … ఇదేం పాత్రికేయం?’ అనిపిస్తోంది. ఇదీ పాత్రికేయమేనా? తెలుగులో పాత్రికేయం ఇంత అధమంగా ఉంటుందా?
కరణ్ థాపర్ రాసిన ఈ వ్యాసం పాత్రికేయం పరిధిలోనిదేనా?
ఈ వ్యాసంతో కరణ్ థాపర్, సాక్షి పత్రికా పాఠకులకు ఇస్తున్న సందేశం ఏమిటి? ఇలాంటి చవకబారు వ్యాసాల్ని ఎడిట్ పేజ్‌లో ప్రచురించే ఒక అపాయకరమైన పత్రికా సాక్షి?
‘జరుగుతున్న రాజకీయ, సామాజిక, జాతీయ, అంతర్జాతీయ పరిణామాల గురించి నిపుణల విశ్లేషణలతో పాఠకులకు సరైన అవగాహన కలిగించేవి పత్రికల ఎడిట్ పేజ్ వ్యాసాలు’ అన్న మౌలిక జ్ఞానం, స్పృహ కూడా సాక్షికి ఎందుకు లేకుండా పోయాయి?
‘ఒక తల్లి ఆమె కూతురు’ శీర్షికతో సాక్షిలో వచ్చిన పాత్రికేయానికే అవమానకరమైన వ్యాసాన్ని పరికిద్దాం-
Ads
1
“అరుంధతీ రాయ్ తన పేరులోని ‘ఫస్ట్ నేమ్’ వదులుకున్నారని మీకు తెలుసా? 18 ఏళ్లప్పుడు ‘‘నా మొదటి పేరు సుజానాను వదిలేసుకున్నాను. అప్పట్నుంచీ క్రమంగా, ఉద్దేశపూర్వకంగా, వేరెవరి మాదిరిగానో రూపాంతరం చెందుతూ వచ్చాను’’ అని తన తాజా పుస్తకంలో వెల్లడించారు”
అని అనితరసాధ్యమైన మేధతో కరణ్ థాపర్ తన ఉచ్చస్థాయి రాజకీయ, సామాజిక స్పృహను, విజ్ఞతను వాంతి చేసుకున్నారు!
— హతవిధీ… ఎవరు అరుంధతీ రాయ్? అరుంధతీ రాయ్ రాణీ రుద్రమ దేవా? ఝాన్సీ లక్ష్మీ బాయా? ఆ అరుధతీ రాయ్ తన పేరులోని ‘ఫస్ట్ నేమ్’ వదులుకుంటే ఎంత? వదులుకోపోతే ఎంత? ఆ చెత్తను మనం ఎందుకు తెలుసుకోవాలి? ఆమె దేశం, సమాజం, సాటి మనిషి కోసం సొంత ఆస్తిని వదులుకుందా? తన జీవితాన్ని త్యాగం చేసిందా? అసలు కరణ్ థాపర్ బుద్ధి, సిగ్గు ఉండే ఈ మాట రాశాడా? బుద్ధి, సిగ్గు ఉండే సాక్షి ఈ మాటల్ని తెలుగులోకి తెచ్చిందా?
2
“మదర్ మేరీ కమ్స్ టు మి’లో ఆమె ఇలాంటి ఇంకా అనేక చిరు జ్ఞాపకాలను పంచుకున్నారు”
— ఈ మాటలు ఒక పుస్తక సమీక్షకుడు పుస్తక సమీక్షలో చెప్పాల్సిన మాటలు. ఒక దిన పత్రిక ఎడిట్ పేజ్ వ్యాసంలో ఈ మాటలు విదూషకత్వం, అధమత్వం.
3
“మత్తుమందు లేకుండా గర్భస్రావం చేయించుకున్న సంగతి మన దృష్టిని ఆకర్షించే మరో దృష్టాంతం. అప్పటికి ఆమెకు ఇరవై రెండేళ్ళు”
—— అత్యంత వికారం ఈ మాటలు. ఆ అరుంధతీ రాయ్ ఇరవైరెండేళ్ల ప్రాయంలో ఒక వివాహితగా గర్భస్రావం చేయించుకుందా? పెళ్లి కాకుండా ఒక జారిణిగా గర్భస్రావం చేయించుకుందా? ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయుండీ కరణ్ థాపర్ ఈ స్పష్టత ఎందుకు ఇవ్వలేదు? సాక్షి సంపాదకవర్గమైనా ఈ విషయంపై తన పాత్రికేయ ప్రతిభను వాడి పాఠకులకు స్పష్టతను ఇచ్చి ఉండాల్సింది.
అరుంధతీ రాయ్ మత్తుమందు లేకుండా గర్భస్రావం చేయించుకున్న సంగతి మన దృష్టిని ఆకర్షించే మరో దృష్టాంతం అవుతుందా? ఎవరో ఎందువల్లో ఎట్లాగో గర్భస్రావం చేయించుకోవడం మన వంటి పాఠకుల దృష్టిని ఆకర్షిస్తుందా? ఆకర్షించాలా? ఛీ ఛీ… కరణ్ థాపర్ రాసిన ఈ నీచత్వాన్ని అనువదించి ప్రచురించడం కన్నా వికృతమైన బూతు బొమ్మల్ని నెట్ నుంచి తీసుకుని ప్రచురించుకోవడం సాక్షికి లాభసాటిగా ఉంటుందేమో?
4
‘‘అది భయంకరం. కానీ, అలా జరిగిపోయిందంతే’’ అని రాశారు. అదే రోజు రాత్రి ఆమె మరుసటి రోజు షూటింగ్‌లో పాల్గొనేందుకు హోశంగాబాద్ నుంచి పంచ్‌మఢీ వెళ్ళే రైలు ఎక్కేశారు” అని నివేదించారు కరణ్ థాపర్.
—– ఈ మాటల్ని బట్టి కరణ్ థాపర్ అరుంధతికి పర్సనల్ అసిస్టెంటుగా పనిచేసేవాడు అని మనం అనుకోవచ్చా? అరుంధతీ రాయ్ ఎప్పుడు ఏం చేస్తే మనకెందుకు… అరుంధతీ ప్రయాణ వివరాలు రాజకీయ, సామాజిక విషయాలా? కరణ్ థాపర్ ఏ లబ్ది కోసమో రాసింది మన తెలుగు పాఠకులకెందుకు? సాక్షి సంపాదకుడా! సంపాదక వర్గమా! తెలుగు పాఠకుల డబ్బుతో పొట్టపోసుకుంటున్నందుకైనా ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాలి.
5
“తల్లి మేరీ రాయ్‌తో ఆమెకు పడేది కాదు. ఈ పుస్తకం పాక్షికంగా ఆ సంగతులనూ, అరుంధతి జీవితంలోని వివిధ దశల్లోని ఆత్మా నుగత వివరాలనూ వెల్లడిస్తుంది. అవి తరచూ కలతకు గురి చేస్తాయి. అరుంధతి తన తల్లిని ‘శ్రీమతి రాయ్’ అనే సంబోధిస్తూ వచ్చారు. పుస్తకం వెనుక వైపు అట్టలో ఆమెను ‘బందిపోటు’ అని పేర్కొన్నారు. కానీ, ఈ పుస్తకం చదువుతూంటే ఆమె నాకు రాక్షసిగానే తోచారు”
— ఈ అరుంధతీ రాయ్ జీవిత విశేషాలు ఎడిట్ పేజ్ పాత్రికేయం అవుతాయా? సమాధానం కరణ్ థాపర్ చెప్పాలా? సాక్షి సంపాదకుడు చెబుతాడా?
6
“అరుంధతికి ఆరేళ్లున్నప్పుడు మొదటిసారి విమాన ప్రయాణంలో ‘‘అమ్మా! పిన్ని నీలాగా కాకుండా అంత సన్నగా ఉంటుంది ఎందుకని?’’ అని ప్రశ్నించడం ద్వారా తల్లికి చిర్రెత్తుకొచ్చేటట్లు చేసింది. ఆ ప్రశ్నకు ఆవిడ ఎంతగా కోప్పడిందంటే, అరుంధతి దానికి భయపడి విమానం కూలిపోవాలని కోరుకున్నారట. ‘‘విమానం కూలి మేమంతా చస్తే సరిపోతుంది అనిపించింది”
—- ఈ మాటలు పాత్రికేయం అన్నదాన్ని అధమత్వం చేస్తున్నాయి.
7
“అరుంధతిని మేరీ తరచు ‘బిచ్’ అనే తిట్టేవారు. సోదరుడు క్రిస్టొఫర్‌ను ఇంకా దారుణమైన మాటలన్నారు. ‘‘తను కౌమారంలో ఉన్నప్పుడు, అమ్మ ఒకసారి అందికదా: ‘నువ్వు అసహ్యంగా ఉన్నావు, తెలివితక్కువ సన్నాసి, నేను నీ స్థానంలో ఉంటే ఈపాటికి ఆత్మహత్య చేసుకునేదాన్ని.
’’
మేరీ రాయ్‌లో మెచ్చుకోదగిన పార్శ్వం కూడా ఉంది. ఆమెది దృఢ సంకల్పం. ఆమె నెలకొల్పిన పల్లికూడంను చక్కని పాఠశాలగా పరిగణించేవారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను చెప్పడంతోబాటు మంచి నడవడికను అలవరచేవారు. వారి స్నానపానాలను, మరుగు దొడ్లను శుభ్రం చేయడాన్ని మేరీ స్వయంగా పర్యవేక్షించేవారు”
—- ఈ మాటలు ఏ స్థాయి పాఠకులకూ ఎంత మాత్రమూ పనికి వచ్చేవి కావు; అవసరమైనవి కావు. అరుధంతిని ఎవరో ఏ బూతు మాటో అంటే దాన్ని పత్రికలకు ఎక్కించడం, పాఠకులకు ఇవ్వడం అసభ్యకరం. సాక్షిలో ఈ అసభ్యత గర్హనీయం.
7
“ఓసారి బాలురు ఆడపిల్లల వక్షోజాలు, వేసుకునే బ్రాల గురించి అసభ్యంగా మాట్లాడడం ప్రారంభించినపుడు, మేరీ తన కప్ బోర్డు నుంచి ఒక బ్రాను బయటకు తెచ్చి ‘‘ఇదే బ్రా. దీన్ని ఆడవాళ్లందరూ వేసుకుంటారు. మీ అమ్మలు వేసుకుంటారు. తొందరలోనే మీ అక్కచెల్లెళ్ళు వేసుకోవచ్చు. ఇది మిమ్మల్ని అంతగా ఉత్తేజపరుస్తోందనుకుంటే, దీన్ని ఉంచుకోండి అన్నారట”
—– అరుంధతి అన్న ఎవరో మహిళ జీవితంలో జరిగిన అసభ్యకరమైన విషయాలు, వ్యక్తిగత విషయాలు సిగ్గులేకుండానూ, సభ్యత లేకుండానూ ఇలా ఒక పత్రికలో చెప్పడం ఆ పత్రిక అధమ స్థాయిని పట్టిస్తుంది. సాక్షి స్థాయి ఏమిటో ఇదిగో ఇక్కడ తెలిసిపోతోంది.
8
“ఆమె జైలులో గడిపిన ఒక రోజు గురించి కూడా ఈ పుస్తకం ప్రస్తావించింది. ‘‘జైలు గది తలుపు వెనుక వైపు మూసుకున్న శబ్దం, నాలోని ధైర్యాన్ని, విశ్వాసాన్ని నీరుగార్చేసింది. నేను మరో ప్రపంచంలోకి అడుగు పెడుతున్నానన్నది స్పష్టం. అక్కడున్నన్నాళ్ళూ ఏమి చోటుచేసుకోవడానికైనా అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. నిజానికి, ఆమె అంత దుర్బలంగా ఏమీ అయి పోలేదు. అక్కడ ఆమె కొందరిని స్నేహితులుగా చేసుకున్నారు. జైలు పక్షులను తనవైపు తిప్పుకొని ఉంటారని నా అనుమానం”
—- అరుంధతీరాయ్ ఎందుకు జైలు పాలైందో చెప్పలేదు కరణ్ థాపర్. కోర్ట్ ధిక్కార నేరంలో ఒక కోర్ట్ దోషి అని తేల్చాక అరుంధతీ రాయ్ ఒక నేరస్థురాలుగా జైలు శిక్షను అనుభవించింది. ఇది అరుంధతీ రాయ్ ఏమిటో స్పష్టం చేస్తోంది. అలాంటి అరుంధతీ రాయ్ పుస్తకం గురించీ, ఆమె వ్యక్తి గత జీవితం గురించి ఇలా వ్యాసం రాసేవాడు పాత్రికేయుడు, సీనియర్ పాత్రికేయుడూ అవుతాడా? ఇలాంటి వ్యాసాన్ని ప్రచురించే పత్రికా ఒక పత్రిక అవుతుందా?
సాక్షి అన్నది ఒక పత్రికేనా? సాక్షి పత్రిక పాత్రికేయానికి సంబంధించిందేనా?
అరుంధతీ రాయ్ గురించి దేశ మంతా తెలిసిందే! కరణ్ థాపర్ గురించీ దేశమంతా తెలిసిందే. దేశ ప్రభుత్వానికి, దేశ ప్రజలకు వ్యతిరేకంగా విదేశీ మతాల మాఫియాల ప్రయోజనార్థం పని చేస్తున్న శక్తులు వాళ్లు అని దేశ వ్యాప్తంగా విరివిగా చాల కాలంగా వినిపిస్తోంది.
అసలు ఒక సీనిఅర్ జర్నలిస్ట్ (?)గా కరణ్ థాపర్ ఈ వ్యాసం రాయడం పాత్రికేయ వృత్తికే అవమానం. ఈ వ్యాసాన్ని తెలుగులో ప్రచురించడం తెలుగు పాత్రికేయానికి కళంకం. సాక్షి ఇవాళ తెలుగు పాత్రికేయానికి ఒక కళంకాన్ని చేసింది.
ఆలోచిద్దాం ఇలాంటి కళంకాలు తెలుగు పాత్రికేయానికి అవసరమా? సాక్షి చేస్తున్న ఈ పాత్రికేయం తెలుగుకు అవసరమా? అసలు సాక్షి తెలుగుకు అవసరమా? ఇవాళ ఈ అసభ్యకర వ్యాసాన్ని ప్రచురించిన సాక్షి రానున్న రోజుల్లో అసభ్యతను దాటి ఏ స్థాయి అశ్లీల పాత్రికేయం చేస్తుందో అని భయం వేస్తోంది.
ఎవరివో బ్రా ల గురించీ అరుంధతీ రాయ్ గర్భస్రావం గురించీ రాసిన ఈ కరణ్ థాపర్ రేపు అరుంధతీ రాయ్ బ్రా, పెటీకోట్, పాంటీల గురించీ రాస్తేడేమోననీ, ఆ రాసిందాన్ని సభ్యత, విజ్ఞత, సిగ్గు లేకుండా సాక్షి శ్రద్ధగా అనువదించి తెలుగులో ప్రచురిస్తుందేమోనని భయం వేస్తోంది. ఔను… సాక్షి అంటేనే భయం వేస్తోంది!
ఈ వ్యాసాన్ని రాసిన కరణ్ థాపర్ అంటేనూ, ప్రచురించిన సాక్షి అంటేనూ రోత కలగడం లేదూ? ఏ పాఠకుడికైనా ఈ వ్యాసం వల్ల రోత మాత్రమే కలుగుతుంది.
అన్నమయ్య అన్నారు:
“ఛీ ఛీ నరుల దేఁటి జీవనము
కాచుక శ్రీహరి నీవే కరుణింతు గాక!”
ఈ కరణ్ థాపర్ – సాక్షి వ్యాసం చదివాక ‘ఛీ ఛీ ఇదేం పాత్రికేయం?’ అని రోత కలుగుతోంది. ఈ కరణ్ థాపర్ – సాక్షి సంయుక్త ‘రోత పాత్రికేయం’ నుంచి తెలుగు పాఠకుల్ని శ్రీహరి కానీ మరే దేవుడైనా కానీ వెనువెంటనే కాపాడాలి.
రోచిష్మాన్
9444012279
(ఇదే కాదు, కొన్నాళ్లుగా సాక్షి సంపాదక పేజీ జగన్ సిగ్గుపడే స్థాయిలో అలరారుతోంది... ఫాఫం జగన్...)
Share this Article