ఆమధ్య ఏదో స్కిట్లో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే పేరు వినగానే ప్లేబాయ్ టైపు కమెడియన్ సుడిగాలి సుధీర్ అంటాడు… ‘‘ఏంటీ, నాకు తెలియకుండానే ఓ కంపెనీ పెట్టారా..?’’ అని..! ఇక్కడ కంపెనీ అంటే తెలుసు కదా… అర్థమైంది కదా…. నిజంగా అచ్చు కంపెనీ టైపులాగే మారిపోయింది ఈటీవీవాడు ప్రసారం చేసే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో… ప్యూర్ బూతు షో… అసలు జబర్దస్త్ అంటేనే బూతు షో కదా… దానికి తాతలాగా తయారైంది ఇది… ఈటీవీ రామోజీరావు టేస్టు తెలుసు కదా… ఇలాంటివి భలే ఇష్టం… సో, ఆదివారం పూట మధ్యాహ్నం ఇంటింటికీ చేరవేస్తున్నాడు… సార్థకజన్ముడు తాతగారు… తాజాగా సదరు కంపెనీ ప్రోమో… అదేలెండి, డ్రామా కంపెనీ ప్రోమో చూస్తే… సుడిగాలి సుధీర్ చేసిన వ్యాఖ్య అక్షరాలా కరెక్టు అనిపిస్తుంది… నిజమే, సుధీర్‌కు తెలియకుండా ఈ కంపెనీ స్టార్టయింది…
వీళ్ల బతుకులు చెడ… సుధీర్‌ను పక్కన పెట్టేయడం కాదు… తనెవరో ఓ కంపెనీ ఓనర్ టైపు కేరక్టర్ ఉంటాడు… పరమ శుద్ధ వేస్ట్… ఇక ఈమధ్య ఈటీవీ వాడు బద్దలు కట్టి, నిలబెట్టాలని చూస్తున్న ఇమాన్, వర్ష జంట సరేసరి… ఆమెకు వొగలు తప్ప యాక్షన్ రాదు, ఇమ్మూకు టైమింగ్ తప్ప టైమ్ సెన్స్ తెలియదు… ఈటీవీ వాడికి సెన్స్ తెలియదు… వచ్చే ఆదివారం కోసం ఉద్దేశించిన ఓ ప్రోమోలో సుదర్శన్, కిరణ్ అనే జంట రెచ్చిపోయింది… అది డాన్స్ అట… ప్యూర్ బూతు పాట, బూతు చేష్టలు… ఫస్ట్ నైట్ కార్యక్రమంలా ఉంది… ఇదీ ది గ్రేట్ ఈటీవీలో ప్రసారం చేయబడే ఓ కామెడీ షో… సిగ్గూశరం పూర్తిగా వదిలేశారు… ఒరేయ్, ఒరేయ్, రాత్రి పన్నెండు గంటలకు ప్రసారం చేయాల్సిన ప్రోగ్రాములు కదరా ఇవి…
Ads
చూశారు కదా, ఆ భంగిమలు… ఇది కెమెస్ట్రీ అట… ఈ కంపెనీ ఓనర్ గాడు (ఇక్కడ గాడు అనే పదం ఉద్దేశపూర్వకంగానే వాడినట్టు గమనించగలరు…) తెగమెచ్చేసుకుంటాడు… వెంటనే ఇమాన్ అనే ఓవర్ యాక్షన్ కేరక్టర్ రెచ్చిపోయి వర్ష అనే కేరక్టర్‌ను పద పద పొదల చాటుకు పద అన్నట్టుగా లాక్కొస్తాడు… లిటరల్‌గా… అసలు కెమిస్ట్రీ ఏమిటో చూపిద్దాం అంటూ హత్తుకుపోయి, రెచ్చిపోతాడు… దొరికించే చాన్స్ హగ్గులు, ముద్దులు, నలిపేయడాలు… తెర వెనుక ఏమైనా చేసుకోనీ… తెర మీద కూడా ఈ వెకిలి, వెగటు ప్రదర్శనలు ఎందుకు తండ్రీ… జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, ఎక్సట్రా డోస్ గట్రా ధారాళంగా బూతును ప్రతి తెలుగు నట్టింటికీ ప్రసారం చేస్తున్న ది గ్రేట్ రామోజీరావు గారికి ఈ శ్రీదేవి కంపెనీతో కూడా టేస్టు తీరలేదట… ఈటీవీ ప్లస్ కోసం రాజీవ్ కనకాల అనబడే ఓ కేరక్టర్ హోస్టుగా రెచ్చిపోదాం బ్రదర్ అనే మరో కామెడీ షో స్టార్ట్ చేస్తున్నారు… అదీ జబర్దస్త్ కమెడియన్లతోనే…. అదీ ది గ్రేట్ బూతు కంపెనీ మల్లెమాల వాళ్లదే… ఇంకేముంది..? రెచ్చిపో బ్రదర్… తమరికి ఇప్పుడు ఏ సినిమా వేషాలూ లేవు కదా… మరో ఈటీవీ మార్క్ బూతు షోకు సారథ్యం వహించు… తెలుగు ప్రేక్షకులను బూతు ప్రవాహంలో ముంచెత్తు…….. అరెరె మరిచేపోయాం, ఈ శ్రీదేవి బూతు కంపెనీ… సారీ, డ్రామా కంపెనీకి తాజా రేటింగ్స్ తెలుసా..? 2.48… పరమ నికృష్టమైన రేటింగ్… అంటే జనం ఛీత్కరిస్తున్నారు, థూ అంటున్నారు అని లెక్క… ఇక మీ ఇష్టం…
Share this Article