ఐనా మన అమాయకత్వం గానీ… రామోజీరావు ఎందుకు మారతాడు..? మల్లెమాల ఎందుకు మారతాడు..? అసలే ఎంత బూతైనా సరే, జనం జబర్దస్త్ చూస్తున్నారు, అదే ఈటీవీని నిలబెడుతోంది… అంతే, అన్నీ అలాగే ఉంటే సరి… ఈటీవీ ప్లస్ ఎవడూ చూడటం లేదుగా… రెచ్చిపోదాం బ్రదర్ అని ఓ కామెడీ అనబడే మరో జబర్దస్త్ మార్క్ షో ప్రసారం చేస్తున్నారు కదా… జబర్దస్త్ కమెడియన్లు ప్లస్ కొత్తవాళ్లతో కలిపి పిచ్చి ప్రయోాగాలు చేసి ప్రేక్షకుల్ని చావదొబ్బేస్తున్నారు… ఆ జబర్దస్త్లో రోజాలాగే… పిచ్చి, తిక్క, బూతు జోకులకు ది గ్రేట్ సుమ మొగడు రాజీవ్ జడ్జి స్థానంలో కూర్చుని పకపకా నవ్వుతూ ఉంటాడు…
కొత్త కొత్త కమెడియన్లు వచ్చీరాని నటనతో, ఆ దిక్కుమాలిన క్రియేటివ్ టీం ఆమోదించిన స్కిట్లను యథాతథంగా ప్రసారం చేస్తూ ఉంటారు… అవున్లెండి, ఎక్సట్రా జబర్దస్తే అలా భ్రష్టుపట్టిపోయింది, ఇక ఈ షో నాణ్యత మీద విశ్లేషణలు ఏమిటి అంటారా..? తప్పదు కొన్నిసార్లు… ప్రస్తుతం యూట్యూబులో సందడి చేస్తున్న ఓ ప్రోమో చూస్తే ‘రెచ్చిపోదాం బ్రదర్’ అని కాదు, చచ్చిపోదాం బ్రదర్ అనిపించేలా ఉంది… దానికీ రాజీవ్ కనకాల పడీ పడీ నవ్వుతుంటాడు… సరే, ఆ నవ్వడానికే కదా, నాలుగు పైసలు ఇస్తున్నారు, వేరే పనేమీ లేదు, మరోవైపు సుమ సంపాదనలో రెచ్చిపోతోంది… మరి తను మాత్రం నాలుగు డబ్బులు సంపాదించకోతే ఎలా..?
Ads
విషయం ఏమిటంటే..? ఓ లేడీ కమెడియన్… ఎదురుగా మరో జెంట్ కమెడియన్… అదేదో ఉప్పెన సినిమాకు స్పూఫ్ అన్నమాట… మన ఖర్మ… సదరు లేడీ కనిపించగానే ఒకడు గొబ్బెమ్మ అంటాడు, అదేమిట్రా అంటే… ముద్దుగా ఉంటే బేబమ్మ కదా, ఈమె దరిద్రంగా ఉంది కాబట్టి గొబ్బెమ్మ అనాలట… సంక్రాంతి వేళ ఇంటి ముందు వాకిట్లో కొలువు దీరే గొబ్బెమ్మ వాడికి అంత చీపుగా, దరిద్రంగా కనిపించిందన్నమాట… కనీసం ఓ ప్రోమో కట్ చేసి, యూట్యూబులో పెట్టేవేళ ఏమీ ఆలోచించదా ఆ దిక్కుమాలిన క్రియేటివ్ టీం..? ఇంతకీ ఎవడ్రా అది..?
ఎవరైనా ఆడపిల్లలు ముద్దుగా కనిపిస్తే సంక్రాంతి గొబ్బెమ్మలా ఉన్నావమ్మా అని ఆశీర్వదిస్తుంటారు పెద్దలు… అలాంటిది వీడెవడికో దరిద్రంగా కనిపించిందట… పైగా ఓ పడవ సెట్ లో కూర్చుని, తలా తోకా లేని డైలాగులు… ఎందుకొస్తారో ఫీల్డుకు..? దానికి రాజీవ్ కనకాల పకపకా నవ్వులు..? అచ్చం, జబర్దస్త్ షోలో ప్రతి దరిద్రపు స్కిట్కూ నవ్వుతూ, నడుమ పిచ్చి పిచ్చి పంచులు వేస్తూ బదనాం అయిపోతున్న రోజా ఆదర్శమా..? కనకాల రాజీవుడూ… నువ్వు సుమ స్థాయికి ఎలాగూ ఎదగలేవు… ఆమె షోలలో అశ్లీలం ఉండదు, అసభ్యత ఉండదు, ఓ పద్ధతికి ఆమె కట్టుబడి ఉంటుంది… కానీ నువ్వేమిటి ఇలా..? చచ్చిపోదాం బ్రదర్…!!
Share this Article