చివరకు గూగుల్ కూడా తన సజెస్టెడ్ వార్తల్లో ఇలాంటివి ఎందుకు పెడుతున్నదో అర్థం కాదు… అలా గూగూల్ వార్తల్లో కనిపించిన ఆంధ్రజ్యోతి వార్త ఒకటి షాకింగుగా అనిపించింది… ‘ఆశయం కోసం ఒకేరోజు 900 మందితో శృంగారం’ ఆ వార్తకు శీర్షిక… హవ్, కైసా, ఎలా… సాధ్యమేనా..? అసలు ఆమె ఆశయం ఏమిటి..? ఏమిటబ్బా అంతటి ఉదాత్త సంకల్పం అనుకుని, తీరా వార్త ఓపెన్ చేస్తే… మరింత షాక్… అందులో ఏమీ లేదు… 900 మందితో ఒకేరోజు సంభోగం జరపాలనేదే తన ఆశయమట… అసలు దాన్ని ఆశయం అంటారా..? రాసిన మిత్రుడు ఏదో కిక్కులో ఉండి ఉంటాడు… కానీ కాస్త వెనకాముందు చూసుకోవాల్సిన పెద్ద తలకాయలు ఉండాలి కదా… భలేవారే, ఆంధ్రజ్యోతిలో అలాంటివేమీ ఉండవు, కుమ్మేయడమే అంటారా..? ఏమో, అలాగే అనిపిస్తోంది…
మిడ్నైట్ మసాలా అంటూ గతంలో టీవీల్లో అర్ధరాత్రి కిర్రెక్కించే సినిమా పాటలు వేసేవాళ్లు… శృంగార మ్యాగజైన్లు కూడా వచ్చేవి అప్పట్లో… జనం బలహీనతను వాడుకోవడం అది..! సరే, జీవితంలో సంభోగమూ ఓ భాగమే.., దానికోసం తహతహ, దానిపై ఆసక్తీ సహజమే… కానీ ఓ పరిమితి, ఓ లక్ష్మణరేఖ ఉంటాయి… అవిప్పుడు చెరిగిపోతున్నయ్… ప్రత్యేకించి మీడియా… ఓ కూపంలో పడి దొర్లుతోంది… ప్రత్యేకించి వెబ్సైట్లు ఫోటోగ్యాలరీ పేరిట సినిమా తారల హాట్ ఫోటోల్ని పరిచేసి… నడుమందాలు, ఎదబరువులు, నాభినాడి అనే పదాలతో రెచ్చిపోతున్నయ్… చిన్నాచితకా సైట్ల కక్కుర్తికి కనీసం ఓ కడుపు నింపుకునే కారణమేదో సమర్థనకు దొరుకుతుంది… కానీ అంబానీకి ఏం తక్కువ..? న్యూస్18 కూడా అదే టైపు… మరో రెండుమూడు ప్రముఖ సైట్లూ అంతే… ఇలాంటి వార్తల కోసమే తహతహ, తపన…
Ads
కారణం సింపుల్… యూత్‌ను తమ సైటుపైకి తీసుకురావాలి, చాలాసేపు అక్కడే ఉంచేయాలి, అలాంటి మరో నాలుగు వార్తల్ని చదివించాలి, అందుకే రకరకాల కిక్కింగ్ థంబ్ నెయిల్స్… ఫోటోలు… చివరకు వెబ్ పత్రికలు కూడా సినిమా పేజీలు అనగానే హాట్ హాట్ ఫోటోలు ఫుల్ లెంత్ పరిచేయాల్సిందే రోజూ… కొంతలోకొంత నయం… తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోని ప్రధాన పత్రికల సైట్లు సంయమనాన్ని పాటిస్తున్నయ్… ఫేమస్ ఇంగ్లిష్ న్యూస్ సైట్లు కూడా ఈ డర్టీ ట్రెండ్ జోలికి పోవడం లేదు… కానీ ఎటొచ్చీ ఆంధ్రజ్యోతికే ఈ రోగం ఎలా పట్టుకుందో తెలియదు… దాని వెబ్ సైటులో ప్రత్యేకం అని ఓ కేటగిరీ ఉంది… అందులో అన్నీ ఇలాంటి వార్తలే… అక్రమసంబంధాలు, సంభోగయవ్వారాలు ఎట్సెట్రా… ఇలా ఉంటుంది దాని ‘ప్రత్యేక కేటగిరీ వార్తల’ జాబితా…
మళ్లీ ఆ 900 మందితో సంభోగం వార్త దగ్గరకొద్దాం… కుతి మతి తప్పిస్తే, రాత ఎలా గతి తప్పుతుందో చెప్పడానికి ఓ ఉదాహరణ… అసలే సంభోగం, శృంగారం అంటే ఏమిటి..? రెండుమూడు సెకన్ల యవ్వారమా అది..? ఒక్కసారి ఊహించండి ఆ సీన్స్… వరుసగా నిలబడిన 900 మంది… జస్ట్, అలా ఓసారి అంగప్రవేశం, వెంటనే నిష్క్రమణ… ఆ వెంటనే లైన్లో రెడీగా నిలబడి ఉన్న మరొకడు… ఆ తరువాత ఇంకొకడు… అదేనా సంభోగం అంటే..? వరుసగా 900 మంది క్యూలో నిలబడి, ఆమె ఘనమైన ఆశయసాధనకు సహకరించిన తీరు నభూతోనభవిష్యతి అన్నమాట… ఆమెది పోలెండ్, పేరు పోలెండ్ లిసా స్పార్క్స్… సన్నీ లియోన్ తరహాలో ఫేమస్ సంభోగతార… గతంలో కూడా 2002లో 646 మంది, 2009లో 759 మందితో ట్రయల్స్ వేసిందట… 900 మంది తన ఆశయమట… ఇప్పుడది నెరవేరిందట… హబ్బ… ఏం వార్త రాశావు గురూ…!!
Share this Article