.
చేవలేక చావు భాష… ఇదీ నమస్తే తెలంగాణ పత్రిక ఈరోజు పెట్టిన హెడింగ్… కేసీయార్ మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన పరుష వ్యాఖ్యల మీద రెండు ఫుల్ పేజీల్లో విరుచుకుపడింది అది… ఈ ప్రతిఘటనను, ఈ ఖండనను సమర్థించవచ్చు…
ఎస్, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఖచ్చితంగా సంస్కారరాహిత్యం… మీకు మీరే స్ట్రేచర్ ఉందని అనుకుంటే, స్ట్రేచర్ ఉందని విర్రవీగితే ఇప్పటికే స్ట్రెచర్ మీదికి పంపించిన్రు… ఇట్లే చేస్తే మార్చురీకి పోతరు, అది కూడా గుర్తుంచుకోవాలె…. ఇవీ తన వ్యాఖ్యలు…
Ads
వర్తమాన రాజకీయాల్లో సంస్కారం, హుందా విమర్శలు, పరస్పర గౌరవాలు, పరిణత వ్యవహార ధోరణి ఎండమావుల్లాంటివి… రండ, కుక్కల కొడుకులు, లత్కోర్, పీకనీకి పోతున్నరా, మేడిగడ్డా-బొందలగడ్డా వంటి పదాల్ని కూడా కేసీయార్ వాడిండు గతంలో… ఓసారి ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది… రామజన్మభూమి మీద ఇలాగే మాట్లాడిండు… అసలు తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి క్షుద్ర భాషను స్టార్ట్ చేసిందే తను…
అయితే తన భాష బాగాలేదని దానికి ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే భాషను ఆశ్రయిస్తే సమర్థించాలా..? అవసరం లేదు… కేసీయార్‌కు ఆ భాషలో చెబితేనే అర్థమైతది అనేది కూడా పిచ్చి సమర్థన అవుతుంది… రేవంత్ రెడ్డి గతంలో మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మీద కూడా ఇలాగే నోరుపారేసుకున్నాడు…
అంతేనా..? వేప చెట్టుకు కట్టేసి లాగులల్ల తొండలు వేసి, ఎర్రగ కాల్చి పిర్రల మీద వాతలు పెడతం, నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు, నడిబజార్ల ఉరితీయాల్నా, ఒక్కొక్కడిని పండబెట్టి పేగులు తీసి మెడలో వేసుకుని, 100 మీటర్ల లోతుల పాతిపెడతం, లఫూట్లు… (ఈ పదాల్ని ఇలాగే రాస్తున్నందుకు సభ్యపాఠకులు క్షమించాలి…) వంటి వాక్యాలెన్నో…
ఇప్పుడు కేసీయార్‌ను మార్చురీకి పోతవు అనడం కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్య… తమ పత్రిక, తమ టీవీల్లో బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి భాషను ఎక్స్‌పోజ్ చేస్తున్నది… సహజమే, అవసరమే… కానీ వర్తమాన రాజకీయాల్లో ఎవరూ తక్కువ కాదు కాబట్టి ఇతర మెయిన్ స్ట్రీమ్ దాన్ని పట్టించుకోవడం మానేసింది… సొసైటీకి కూడా ఈ అంశంలో ఇమ్యూనిటీ వచ్చేసినట్టుంది…
ఈ భాష, ఈ ధోరణుల మీద డిబేట్ అవసరమే… ఒకవేళ బీఆర్ఎస్ గనుక సీఎం భాష మీద కోర్టుకు ఎక్కితే, అక్కడ వాదనలు, విచారణలు జరిగినా ఆసక్తికరమే… ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాప్ పడాలి… ఎన్నికల సమయంలో భాష, కంటెంటు మీద హేట్ స్పీచులైతే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంటున్నది… మరి మామూలు సందర్భాల్లో..?
ఇక్కడే మరోమాట… ఎలాగూ నాయకులు ఘోరంగా తిట్టుకుంటున్నారు… అయితే అలాంటి మాటల్నే జనంతో మరింత నీచంగా పలికించి, తిట్టించి, వాటినే పబ్లిక్ డొమయిన్‌లోకి తీసుకొచ్చి… అదే జర్నలిజం అంటే ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే… రేవతి అండ్ టీమ్ మీద పోలీసుల కేసును ఈ కోణంలోనే చూడాలి..!!
Share this Article