మన సినెమా పాటల్లోనే బోలెడంత రేపిజం, బోలెడంత మంది అత్యాచారులు, లెక్కలేనన్ని అత్యాచారాలూ …
ఇదిగిదిగో!!!
.
.
ఓరోరి యోగి నన్ నలిపెయ్రో
ఓరోరి యోగి నన్ పిసికెయ్రో
ఓరోరి యోగి నన్ చిదిమెయ్రో
ఓరోరి యోగి నన్ కుదిపెయ్రో
మరేం చేస్తాడు వాడు డెబ్బయ్యేళ్ళ ముసల్దనీ చూడకుండా నలిపి చిదిమి కుదిమేసిండు
Ads
పూలదుకాణం దాటి
పాలడిపో మీదుగా
అట్టట్టా దిగివస్తే
అక్కడెఅక్కడె మా ఇల్లు..
వాడిదేం తప్పు జడలో పూలు దుకాణం అనీ
పాలడిపో అంటే స్థన్యం అనీ
దిగివస్తే ఇంకేదో ఉంటదనీ తెలుసుకోవడానికి తొమ్మిదేళ్ళ అమ్మాయే అని కూడా చూడకుండా ఆ ఇంటికోసం వాడు వెతుక్కున్నాడు.
కొబ్బరి పెడతావో,
అరిచి బొబ్బలు పెడతావో..
నీకు సాయంగుంటా
నీకు బోలెడు అది ఉంది,
నాకు బుట్టెడు ఇది ఉంది.
ఎత్తిపోతల పదునుంది,
ఉక్కపోతల పనిఉంది.
మత్తులో గమ్మత్తులో ముంచెత్తాలి
నేడే తేనెల్లో ఈదిఈది
చాటుల్లోమాటుల్లో ఆడే ఆటల్లోనా
మారాలి తేలితేలి
వాడ్నని ఏం లాభం బోలెడు అది వుందని నమ్మి బుట్టెడు ఇదికోసం ఎత్తిపోతల పదును ఉక్కపోతల పనుల కోసం
అమ్మలోకీ చెల్లిలోకీ చూసేసాడు
ఓ టెన్నీసు బంతుల పాపా
నీ బంతులకంతటి ఊపా?
అది అత్తిలి తోటల కాపా?
నీ గుత్తుల సోకుల తీపా?
నువ్వెత్తి చూపే ప్రైజు
కుర్రకారుకు గ్లూకోజు….
నైటు డ్యూటి నర్సు
కనిపెట్టినాది పల్సు
ప్యాంటూడదీయమంది
పొడిచింది పెద్ద సూది.
వాడిదేమి నేరము ..టెన్నిస్ బంతులేంటో తెలియదాయె గుత్తులేంటో ఎర్కలేకపాయె కాపేంటో పాంటిప్పి గుచ్చుడేందో నేర్చుకునేందుకు తొమ్మిది నెలల పాప అనికూడా సోయి రాకపాయె..
గడపనా నీతో గంటల కొద్దీ..
అయ్ బాబోయ్ ఆ తరువాతేమైపోద్దీ..
అయిదే నిమిషాలైనా అది సరిపోద్దీ..
ఆశదోస అప్పడం ఇది యేం బుద్ధి….
ఝుం ఝుం మాయో..
వాడ్నని ఏం ప్రయోజనం
గంటలకొద్దీ గడపడమేమిటో
అయిదే నిముషాలలో అయిపోవడమేమిటో
తెలుసుకోవాలని కూతురులోనే కోరికను చూసుకున్నాడు..
గూట్లో ఉంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా
నోట్లో పెడితే నానుతుంది మెత్తమెత్తగా
అమ్మనడిగితే ఊహూ అంది,
అల్లుడింటికే పోపో అంది
నోట్లో ఉంది కొబ్బరి చెక్క బెట్టుబెట్టుగా
రోకలిపడితే లొంగుతుంది బిట్టు బిట్టుగా
అత్తనడిగితే నవ్వేసింది..
మరదలింటికే పోపో అంది
ఎవర్నైనా ఏమని మాత్రం ఏం చేస్తాం.. రోకలి బిట్టుబిట్టుగా కొట్టడం,తొక్క తీయడం గింజ ఒలవడం ఒంపులన్నీ కసికసిగా చూడడం అంటే ఏమిటో , అత్తని ఏమి అడిగాడో మరదలి దగ్గరికి దేనికోసం పొమ్మందో… రహస్యం తెలుసుకోవాలని ఒత్తిడి చేస్తే ఎవరైనా ఏం చేస్తారు..
వావి వరుసలు మర్యాదలు భయాలు వదిలేయడం తప్ప
నీకు కాశ్మీరు ఆపిల్స్ లేవా?
అరే పాలకొల్లు బత్తాయిలు లేవా?
పాలముంతలు నీకు పరువంగా చేయిస్తి…..
పండుకోయగలవా?
దాని తొక్క తీయగలవా?
తొక్కలా బిరుసెక్కిన నా తిక్క తీర్చగలవా?
పక్కలో మగ దిక్కునై రసముక్కు తీర్చగలనే
అబ్బ నన్నేం చేస్తాడొ ఈ పిల్లోడు..
లంకె బిందెల్లో పాలే పోసి తోడేస్తాడు…
బిందె నిండిపోయిందంటూ
బరువు మొయ్యలేవంటూ
సాయం చేస్తే తప్పేమంటాడు?
సాయమేమి కాదు చెయ్యి కొంత జరిపి నడుముకు పైనే ఆడిస్తాడు….
పాలముంతలు కాశ్మీర్ ఆపిల్స్ అంటే ఏమిటో మగదిక్కు తీర్చడం పక్కలో తొక్కలేమిటో సందులో అర్ధరాత్రి గోకడమేమిటో తెలుసుకోవాలనే ఆత్రం ఎవరికి మాత్రం వుండదూ..
గట్టి ఒత్తిళ్ల కోసం గాలి కౌగిళ్లు తెచ్చా,
తొడిమ తెరిచే తొనల రుచికే ఓహోహో… అట్టంటే నా కోడి కూసేస్తది,
చిట్టింటి నీ గింజ మేసేస్తది……
సిగ్గు గుత్తి తెంచాడు,
టెంటు మీద బాంబేసాడు..
వాడు మాత్రం ఎంత నిస్సహాయుడు పాపం.. పచ్చిగా బూతు తప్ప ఇంకో అర్ధం లేని తెర మీద నుంచి అందమైన అమ్మాయిలు మెరుపు దేహాలతో తియ్యని సంగీతంతో కనుసైగలు చేస్తుంటే మన మధ్యే తిరుగుతూ మన అమ్మాయిల్ని కుప్పలు తెప్పలుగా చెరిచేసి చంపేయడం తప్ప ఏం చేయగలడు పాపం.
.
.
.
ఉరితీయడాలు ఎన్కవుంటర్లు తరవాత..
సినిమాల్లో, సంస్కృతీ సంహారంలో, భావజాలంలో, మెదళ్ళలో జబర్దస్త్ లలో జరుగుతున్న ఈ అత్యాచారాలను చంపండి..
వీటిని ఎదురుకాల్పుల పేర మట్టుపెట్టండి….
ముందుగా చంపాల్సినవి మనలోనే ఉన్నాయి సిగ్గుపడాల్సినవీ మనలోనే ఉన్నాయి…
మెలమెల్లగానైనా సరే చంపడం ఇప్పుడు మొదలుపెట్టండి…
ఇవ్వండి ముందుతరానికి హామీ !
(నాలుగేళ్ల నాటి పోస్ట్, ఇప్పటికీ ఆప్ట్… )
Share this Article