టికెట్టు దొరక్కపోతే వెంటనే జంప్… ఎవడు టికెట్టిస్తే వాడే బాస్… డప్పు ట్యూన్ మారుతుంది అంతే… నాకు టికెట్టు ఇవ్వరా, నా కొడుక్కి ఇవ్వు, నా బిడ్డకు ఇవ్వు, లేదంటే ఇద్దరికీ ఇవ్వు… లేకపోతే ఆ పార్టీ వాడు పిలుస్తున్నాడు, కండువా చేంజ్ అంతే…
సిద్ధాంతాల్లేవ్, రాద్దాంతాల్లేవ్… ఒకటే సిద్ధాంతం, టికెట్ కావాలి, నిలబడాలి, ఎమ్మెల్యే అయిపోవాలి… కబ్జాలు, అక్రమ సంపాదన, సెటిల్మెంట్లు, మైనింగ్… వాట్ నాట్… ఏదంటే అది చేసుకోవచ్చు… అన్ని పార్టీల్లోనూ ఇదే తీరు… వోటర్లకు పంచే డబ్బు ఓ పెట్టుబడి, టికెట్ల కోసం ఖర్చు కూడా ఓ ఇన్వెస్ట్‌మెంట్… తరువాత డబ్బు అదే వచ్చిపడుతుంది… మరీ కేసీయార్ పాలన వచ్చాక ఎమ్మెల్యేలు నయా జమీందార్లు అయిపోయారు…
డీఎస్పీలు, ఆర్డీవోలు, కలెక్టర్ల దాకా వాళ్లు చెప్పినవాళ్లే ఉంటారు, లేకపోతే బదిలీ… మరీ కాదంటే లూప్ లైన్… వాళ్లేది చెబితే అదే, మారుమాట్లాడేవాళ్లు ఉండరు… ఆయనేమో పార్టీలు మారేవాళ్లను నమ్మకండి, వోటేయకండి అని సుద్దులు చెబుతున్నాడు సభల్లో… మరి పార్టీలు మారి వచ్చిన వాళ్లను ఏకంగా మంత్రుల్ని చేసిందెవరు..? ఇప్పటికీ ఎదుటి పార్టీ నుంచి జంపింగులు చేయిస్తున్నదెవరు..? హఠాత్తుగా అందరూ గుర్తొస్తున్నారు…
Ads
తెలంగాణ కోసం పోరాడిన బ్యాచ్ మళ్లీ కనిపిస్తోంది… అందరినీ ఆకట్టుకోవాలి… కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు, పనామా చౌరస్తాకు ఎన్టీయార్ పేరు మొదలుకొని ఎన్నెన్నో… ఇప్పుడు అందరూ కావాలి… వేయి మంది జర్నలిస్టుల ఉసురుపోసుకుని, ఇప్పుడేమో విందులు… ఈరోజుకూ కౌలు రైతులు పట్టరు… మేడిగడ్డ మీద కిక్కుమనరు… ఆశ్చర్యం ఏమిటంటే… అద్భుతం, విపక్షాల గుండెల్లో పేలబోయే మేనిఫెస్టో అని పదే పదే చెప్పారు కదా, ఎన్నికల ప్రచారంలో వాటి గురించి చెప్పుకోరు, సరికదా కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీల మీద విమర్శలు… భలే కంట్రడిక్షన్… ఫుల్ నెగెటివ్ అప్రోచ్…
విచిత్రంగా కాంగ్రెస్‌దీ అదే తోవ… తమ సిక్స్ గ్యారంటీల మీద మాట్లాడటం తప్ప బీఆర్ఎస్ ఫెయిల్యూర్ల మీద విమర్శల్లేవ్, చివరకు మేడిగడ్డ వంటి మేజర్ ఇష్యూస్ కూడా వదిలేసి, కేవలం మేమేం చేస్తాం, మేమేం ఇస్తాం, మేమేం తెస్తాం అనే పాజిటివ్ క్యాంపెయిన్ మాత్రమే… మరి బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలన మీద సమీక్ష వద్దా..? యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ వోటును పెంచే పనిలేదా..? బీజేపీకి ఈ చిక్కులేమీ లేవు, దానికి చెప్పుకోవడానికి సూపర్ మేనిఫెస్టో లేదు, కేసీయార్‌ను తిట్టిపోసేందుకు దోస్తానా అడ్డం… ఏదో అప్పుడప్పుడూ సగటు వోటరుకు పట్టని డబుల్ ఇంజన్ అనే పడికట్టు పదం తప్ప…
లెఫ్ట్ కూడా అంతే… అడిగినన్ని, అడిగిన సీట్లు ఇవ్వకపోతే లౌకిక శక్తులను కలుపుకుని ఒంటరిగా పోటీచేస్తారట… అదేం ఒంటరితనం..? కాంగ్రెస్‌ను కలిస్తేనే జంటతనమా…? తోకలుగా మారితేనే మనుగడా..? ఇండిపెండెంట్‌గా ఎదిగే సంకల్పమూ లేదు, ఆ దిశగా పయనమూ లేదు… వాడు గాకపోతే వీడు, వీడు గాకపోతే వాడు… ఎవడో ఒకడి తోక పట్టుకోవాలి, గోదావరి ఈదాలి… ఏమాటకామాట… ఏపీ రాజకీయాలతో పోలిస్తే చాలా బెటర్ తెలంగాణ పాలిటిక్స్… ఇంత వెగటు వాసనలు వీస్తున్నా సరే…!!
Share this Article