నో… నాటెటాల్… ఏపీ రాజకీయ నాయకులే కాదు… దేశమంతా వాళ్లనే ఆదర్శంగా తీసుకుంటోంది… బూతులు ధారాళంగా ప్రవహిస్తున్నాయి… పాతాళానికి దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారు… ఉదాహరణ కావాలా..? సుప్రియా శ్రీనాథే అని ఓ మహిళ… కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ హెడ్డు… కానీ హెడ్డు సరిగ్గా పనిచేయదు… కంగనా రనౌత్ మీద పిచ్చి కూతలు కూసింది…
కంగనా నటించిన ఏదో సినిమాలోని ఓ ఫోటోను పెట్టింది… కంగనా హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ అనే నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నది కదా… అదే పదాన్ని కంగనా మీద వెకిలి వ్యాఖ్యలకు వాడుకుని… ప్రస్తుతం మండీలో ఏం రేట్ పలుకుతున్నదో ఎవరైనా చెబుతారా అని వ్యాఖ్య రాసి, కంగనా ఫోటోను జతచేసింది… చాలా అభ్యంతరకరమైన, అశ్లీలమైన పోస్ట్…
దానికి కంగనా పేరిట ఆమె టీం కూడా బాగానే రిప్లయ్ ఇచ్చింది… ‘‘నా ఇరవై ఏళ్ల సినిమా కెరీర్‌లో బోలెడు పాత్రలు పోషించాను, అన్నిరకాల పాత్రలు… క్వీన్‌లో అమాయకమైన అమ్మాయి పాత్ర నుంచి ధాకడ్‌లో ఓ సమ్మోహన గూఢచారి దాకా… మణికర్ణికలో ఓ పోరాటయోధ పాత్ర నుంచి చంద్రముఖిలోని ఓ దెయ్యం పాత్ర దాకా… రజ్జోలో ఓ వేశ్య పాత్ర నుంచి తలైవిలో ఓ విప్లవనాయకి పాత్ర దాకా… అన్నీ చేశాను…
Ads
Dear Supriya ji
In the last 20 years of my career as an artist I have played all kinds of women. From a naive girl in Queen to a seductive spy in Dhaakad, from a goddess in Manikarnika to a demon in Chandramukhi, from a prostitute in Rajjo to a revolutionary leader in Thalaivii.… pic.twitter.com/GJbhJTQAzW— Kangana Ranaut (@KanganaTeam) March 25, 2024
కాస్త డిగ్నిటీ మెయింటెయిన్ చేద్దాం… అంటూ ఓ హంబుల్ రిప్లయ్ ఇచ్చింది… బీజేపీ ఐటీ హెడ్ మాలవీయ రంగంలోకి ప్రవేశించి సుప్రియా శ్రీనాథే మీద విరుచుకుపడ్డాడు… ‘‘ఇంతటి అసహ్యకరమైన పోస్టు పెట్టిన ఆమె రాజీనామా చేయాలి లేదా కాంగ్రెస్ హైకమాండ్ సస్పెండ్ చేయాలి…’’ అని తను ఓ పోస్టు పెట్టాడు… పలువురు బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ చేసిన ‘శక్తి వ్యతిరేక’ వ్యాఖ్యలను మరోసారి ట్విట్టర్‌లోకి లాగి, ఇలా దిగజారిపోతున్నాం మనం అంటూ చురకలకు దిగారు…
ఈ రచ్చతో సుప్రియ సర్దుకుంది… అందరు రాజకీయ నాయకుల్లాగే స్వరం మార్చింది… అమాయకపు ఫేస్ పెట్టింది… అబ్బే, అవి నా వ్యాఖ్యలు కావు, నా పోస్టే కాదు, నాగురించి అందరికీ తెలుసు కదా… ఎవరో నాపేరిట ఓ పేరడీ ఖాతా క్రియేట్ చేసి ఏదో పోస్టు పెట్టారు… దాన్ని యథాతథంగా నా ఇన్‌స్టా, ఎక్స్ ఖాతాల్లోకి పెట్టేందుకు ప్రయత్నించారు… అంటూ ఏదో కథలు చెప్పడానికి ప్రయత్నించింది…
వెంటనే ఆ పోస్టు డిలిట్ అయిపోయింది… కానీ అప్పటికే స్క్రీన్ షాట్లు తీసుకుని పెట్టుకున్న బీజేపీ ఐటీ సెల్ తమ దాడిని కొనసాగిస్తూనే ఉంది… జాతీయ మహిళ కమిషన్ కూడా జోక్యం చేసుకుని, ఇలాంటి దుర్బాషలను అరికట్టాల్సిన అవసరం ఉందనీ, చర్యలు అవసరమనీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తోంది… ఈమధ్య రాజకీయాల్ని మరీ ఇలా ఛండాలం చేస్తున్నారు…! మరీ రాజకీయాల్లో ఉన్న మహిళల పట్ల సోషల్ మీడియాలో అశ్లీల దాడి మరీ నీచంగా కనిపిస్తోంది..!!
Share this Article