అసలు వర్మ తప్పేముంది..? అది ఎప్పుడో కుళ్లిపోయి దుర్గంధం వ్యాప్తిచేస్తున్న బుర్ర… మొత్తం తెలుగు సమాజానికి ఆ స్పష్టత ఉంది… కానీ తనకు పెద్ద పీట వేసి, పిలిచి, దండలేసి, కీలక ప్రసంగానికి ఆహ్వానించిన సదరు నాగార్జున యూనివర్శిటీ పెద్దలను అనాలి… ఐనా వాళ్లనూ అనాల్సిన పని లేదేమో… తమ బుర్రలు వర్మకన్నా దిగువ స్థాయిలోనేననీ, వాటికీ క్షయ వ్యాధి సోకినట్టేననీ వాళ్లే నిరూపించుకున్నారు…
నిజానికి వర్మను ఎవరూ ఛీత్కరించి ఉమ్మేయనక్కర్లేదు… నాగార్జున యూనివర్శిటీ పెద్దలు ఏ శిక్షకు అర్హులో వాళ్లే చెప్పాలి ఇక… లేకపోతే ఏమిటి..? ఓ ప్రఖ్యాత యూనివర్శిటీ, అదీ అకడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమం… తాగి మైక్ పట్టుకున్నట్టున్నాడు… ఆ బుర్రలోని వికారమంతా బయటికి తన్నుకొచ్చింది… అసలు విద్యార్థి లోకానికి ఈ తలతిక్క ప్రసంగాలు ఇప్పించడం ద్వారా సదరు యూనివర్శిటీ ఏం సందేశం ఇవ్వదలిచింది..?
అసలు ఒక అకడమిక్ ఎగ్జిబిషన్‌ను వర్మ ప్రారంభించడం ఏమిటి..? తన అర్హత ఏమిటి..? పూర్వ విద్యార్థా..? అదే నిజమైతే చాలామంది ఉన్నారు కదా… ఈ యూనివర్శిటీలో గానీ, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో గానీ చదువుకుని కాస్త మంచి హోదాల్లో ఉన్న ‘నాగరికులే’ లేరా..? అసలు తన చదువే సరిగ్గా ఏడ్వలేదు వర్మ… తన ఇంజనీరింగ్ డిగ్రీని కూడా 39 ఏళ్ల తరువాత తీసుకున్నాడు, సారీ, పువ్వుల్లో పెట్టి వర్శిటీ అధికారులే అప్పగించారు… కనీసం వర్మ దరఖాస్తు చేసి ఉండడు, తనకు ఆ ఆసక్తి కూడా లేదు…
Ads
ఇక్కడ ఒక్కచోట కాస్త సంయమనం పాటించబడింది ఏమిటంటే… వర్శిటీ ఇంకా అపరిమిత స్వేచ్ఛను తీసుకుని, అర్జెంటుగా వర్మకు డాక్టరేట్ ప్రకటించకపోవడం..! లేకపోతే దాని విలువనూ డ్రైనేజీ కాలువలో కలిపేసేవాళ్లు… లేకపోతే ఏమిటి..? అక్కడ సందర్భం ఏమిటి..? తన కూతలు ఏమిటి..? తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అని పిలుపునిస్తున్నాడు… (ఏమాటకామాట ఆంధ్రజ్యోతి మాత్రమే దీన్ని హైలైట్ చేసింది… అభిప్రాయం చెప్పాల్సిన పనేమీలేదు, ఇది చదివితే చాలు వర్శిటీ ఏ స్థాయికి దిగజారిపోయిందో పాఠకులకు సులభంగానే అర్థమవుతుంది… వేరే పత్రికల పాళీలు ఎప్పుడో విరిగిపోయాయి తెలుసు కదా…)
ఏదైనా వైరస్ వచ్చి, తను తప్ప మిగతా మగజాతి అంతా అంతరించిపోవాలట, తనొక్కడే మిగిలిపోతే మొత్తం స్త్రీజాతికి దిక్కవుతాడట… ఆమధ్య ఏదో వీడియోలో ఆషురెడ్డి కాలివేళ్లను కామార్తితో వర్మ చీకుతున్న సీన్ మళ్లీ గుర్తొచ్చింది… స్వర్గానికి వెళ్తే రంభ, ఊర్వశి ఉండకపోవచ్చు కాబట్టి ఇక్కడే ఎంజాయ్ చేయాలట, నచ్చిన విధంగా బతకాలట… కష్టపడి చదవాల్సిన పనిలేదట, హార్డ్ వర్క్ చేయకూడదట, ఉపాధ్యాయులను పట్టించుకోవద్దట… ఈ నిర్వాకం ఇలా తగలడితే సదరు వర్శిటీ వీసీ రాజశేఖర్ ‘‘వర్మ ప్రొఫెసర్, ఫిలాసఫర్ కంటే ఎక్కువ, పీహెచ్‌డీ, ఆస్కార్ కంటే ఎక్కువ అర్హతలున్నాయి’’ అని గొప్ప సర్టిఫికెట్ ఇచ్చాడు… ఆ వర్శిటీకి ఇలాంటి వీసీని పెట్టిన జగన్ జన్మ కూడా ధన్యం… ధన్యం…!!
.
ఈ సారు గారు రెండు రోజుల ముందు వైసీపీ ఆవిర్భావ దినం కూడా చేశాడంట… Wow
Share this Article