Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!

October 10, 2025 by M S R

.

ముందుగా ‘ముచ్చట’ ఆమధ్య పబ్లిష్ చేసిన ఓ విమర్శ చదవండి… ఒకప్పుడు కాస్త మంచి నటుడే అనిపించుకున్న రవితేజ వయస్సు పెరిగేకొద్దీ అశ్లీలాన్ని ఆశ్రయించిన తీరు మీద… మరీ ప్రత్యేకించి రాబోయే తన సినిమా మాస్ జాతరలోని ఓలె ఓలె పాటలోని బూతుల మీద బోలెడు విమర్శలు వస్తున్నాయి కదా… చదవండి…



జామచెట్టుకు కాస్తాయ్ జామకాయలు… అనే ఉత్కృష్టమైన సాహిత్యానికి దీటైన, దాటేసే మరింత మహోత్కృష్ట సాహిత్యం ఇక రాదనే భ్రమల్ని పటాపంచలు చేసింది ఈ పాట…

Ads

పాట పేరు ఓలె ఓలె… తెలుగు పాటే… కానీ వీథి పంపు బజారు భాష… ఆ పదాలు అలా అలా దొర్లిపోతూ… వెగటు పుట్టిస్తూ… దుర్గంధాల్ని వెదజల్లుతూ…. మన తెలుగు సినిమా పాటల మహా పంకిల ప్రస్థానానికి ఓ సంకేతంలా… కుర్చీ మరోసారి మడతపెట్టేసింది…

నిజానికి ఈ సినిమా నిర్మాత నాగవంశీ టేస్టు మీదో… రవితేజ, శ్రీలీల టేస్టు మీదో ఎవరికీ పెద్ద భ్రమలేమీ లేవు… వాళ్లు ఏ పాటకైనా, ఏ సీనుకైనా రెడీ… అత్యుత్తమ కళాభిరుచిపరులు… కానీ ఈమధ్య కొంతకాలంగా మంచి పేరు తెచ్చుకుంటున్న భీమ్స్ సిసిరోలియో ఈ పాట పాడాడు, స్వరకల్పన చేశాడు అంటేనే హాహాశ్చర్యం…

ఒకవైపు శ్యామ్ కాసర్ల ఊరిపాటకు జాతీయ గుర్తింపు వచ్చిందని ఆనందించేలోపే… ఇదుగో ఈ ఉత్తరాఖండ్ క్లౌడ్‌బరస్ట్ బురద వంటిదేదో వచ్చి తాకింది బలంగా…

ఈ పాటలో ఓచోట రాస్తాడు రచయిత… (ఫాఫం, రచయితదేముందిలే… నిర్మాత టేస్టును బట్టే కదా పాటలు పుట్టేది, అనగా రాయబడేది) బుద్ది లేదు, జ్ఞానం లేదు, సిగ్గు లేదు, శరం లేదు, మంచి లేదు, మర్యాద లేదు… నిజం… ఏవీ లేవు ఈ పాటలో… పాటకు బాధ్యుల్లో…

అంగి లేదు, లుంగి లేదు, లాగు లేదు, పంచె లేదు, తాడు లేదు, బొంగురమూ లేదు… అక్షరాలా నిజం… ఈ పాటకు అవేవీ లేవు, బరిబాతల ఉంది… (పైగా శ్రీకాకుళం పేరు చెప్పి ఆ ప్రాంతాన్ని కించపరచడం తప్ప…) సిలకా, మొలకా, గిలకా, పలకా అనే అద్భుత భావగర్భిత, అదేదో మర్మగర్భిత పదాలతో మొదలవుతుంది పాట…

నీయమ్మ, యక్క, చెల్లి, తల్లి అంటూ…. గుంటా, నీ అయ్యకాడ తింటా, నీ అమ్మకాడ తింటా, నీ ఒళ్లోకొచ్చి పంటా అంటూ… నీయమ్మని, నీయక్కని, నీతల్లిని, నీచెల్లిని పట్టుకునీ… అని కాస్త పాజ్ ఇస్తాడు, ప్రేక్షకులు, శ్రోతలు ఏదైనా అనుకునేందుకు, ఊహించుకునేందుకు చాన్స్ ఇచ్చి… తరువాత సదరు నాట్యగత్తె కమ్ హీరోయిన్ తో కూడా ‘పట్టుకుని..?’ అని అడిగించి… వినేవాళ్లను, చూసేవాళ్లను ఓసారి మూసీలో ముంచి… అప్పుడు చెబుతాడు ‘కాళ్లు మొక్కిపోతా’ అని… అందరి చెవుల్లోనూ రఫ్లీషియా పూలన్నమాట…

కొరియోగ్రఫీ జానీ మాస్టర్ అట… (ఆ జానీ మాస్టరేనా..? ఆ లైంగిక వేధింపుల కేసు బాపతేనా..?) నీ కుంకి ముక్కు రక్కీ రక్కీ కొరికేస్తానే… యాటంకి పోయినా పట్టువట్టి తడిమేస్తానే అంటుంటే ఆమె సిగ్గుతో బొంగరాలు తిరిగిపోతుంది మహా సంబురంతో… వాటిని స్టెప్పులు అనాలి కదా… వోకే వోకే…

ఆమె ఏం తక్కువ తిందా…? కట్టు లేని పిట్టను నేను… జీడిపప్పు జాడీని నేను… అంటూ తను కూడా నీ అయ్యని, నీ అబ్బని పట్టుకునీ అని రాగం తీస్తుంది… నా సిగల ముడుచుకుంటా అంటుంది… వాడి అయ్యని, వాడి అబ్బని తను సిగలో ముడుచుకోవడం ఏమిటో… వామ్మో… సినిమా పేరే అదట… మాస్ జాతర…, మనదే ఇదంతా ట్యాగ్ లైన్… ఓహో మాస్ అంటే ఇదా..!! ఫాఫం… తెలుగు సినిమా పాట..!! వానెక్క, ఏం టేస్టురా..!!



ఈ బూతులు అనే విమర్శలకు మొన్న సుమ చేసిన ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దర్శకుడు భాను భోగవరపు, హీరోయిన్ శ్రీలీల, హీరో రవితేజ జవాబులు చెప్పుకుంటూ… ఆ బూతుల్ని సమర్థించుకోబోయారు… సిగ్గు లేకుండా…!!

ఫాఫం, రవితేజను చూస్తే జాలేసింది నిజంగా… బూతులు ఉంటే తప్పేమిటి అన్నట్టు మాట్లాడాడు… ఇంగ్లిషులో కొన్ని అసభ్య పదాలను సాధారణంగానే వాడుతూనే ఉంటారు గానీ తెలుగులో అంటే తప్పొచ్చిందా అంటున్నాడు… హీరోయిన్ కూడా శ్రీలీల కూడా ఆ బూతులు ఆ సందర్భానికి ఆప్ట్ అంటోంది…

దర్శకుడి సమర్థన మరీ నేలబారు… ఊళ్లల్లో జాతరల్లో కథలు, బుర్రకథలు చెబుతుంటారు… ఫ్యామిలీలతో వెళ్లి మరీ ఎంజాయ్ చేస్తుంటారు, పదాల సౌండింగ్ బూతుల్లా ఉన్నా, అవి బూతులు కావు అట… బుర్రకథల్లో బూతులెక్కడ విన్నావు నాయనా..? తిక్క సమర్థన…

పోనీ, కొన్ని జాతరల్లో బూతు డాన్సులు, అర్ధనగ్న, కొన్నిచోట్ల నగ్న నృత్యాలూ చేస్తుంటారు, ఇంకా నయం, అవీ పెట్టి, సంప్రదాయం అనేట్టున్నావు చూడబోతే… నావరకు వస్తే బూతులు అంటారు, వేరే సినిమాల్లో ఉంటే బోల్డ్ అంటున్నారు అని మరో పిచ్చి సమర్థన…

ఫాఫం సుమ, సబ్జెక్టు వేరు, ఆమెనేమో తెలుగు పదాలను కూడా బూతులుగా మార్చేస్తున్నారని ఏదో తలాతోకా లేకుండా ఏదేదో చెప్పుెకొచ్చింది… పులిహోర, అక్షింతలు అని ప్రస్తావిస్తూ… కానీ ఈ పాటలో  బూతులు వేరమ్మా తల్లీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… నోబెల్ అవార్డుల జ్యూరీకి మనస్పూర్తి ప్రశంసలు… ఎందుకంటే..?
  • అంబానీలు, ఆదానీలు బోలెడు… అచ్చమైన భారత ‘రతన్’ టాటా ఒక్కడే..!
  • రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
  • రష్మికపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం..? నిజమేనా..? ఎవరితో లొల్లి..?!
  • అగ్ని శలభ న్యాయం… జర్నలిజం కొలువులూ అంతే… మాడిపోతారు..!!
  • నీయమ్మని, నీయక్కని, నీతల్లిని… ఈ డర్టీ సాంగ్‌కు సిగ్గూశరం లేని సమర్థన..!!
  • నా బిడ్డ పెళ్లిని ఆ బైకర్ల గ్రూప్ రఫ్‌గా అడ్డుకుంది… కానీ మంచే జరిగింది…
  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…
  • కాంతారా చాప్టర్-1 … ఇది వనరుల దోపిడీ కథ… ఓ డిఫరెంట్ రివ్యూ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions