సైట్లను, యూట్యూబ్‌ను ఫాలో అయ్యే తెలుగు వాళ్లకు ఇది పరిచయమే… ఓ అనామక ముసలాయన ఏదో సందర్భంలో ‘‘కుర్చీ మడతపెట్టి దెం– మెడలు ఇరుగుతయ్…’’ పాఠకులకు అర్థమైంది కదా… రాసుకోవడానికి, అనుకోవడానికే ఇబ్బందికరమైన పదం, వ్యక్తీకరణ… కానీ చాలా పాపులరైపోయింది… మరి ఇప్పటి ట్రెండ్ అలా పాడైంది…
మింగితే, గువ్వ వంటి పదాల్ని సోషల్ మీడియా బాగా పాపులర్ చేసింది… హైపర్ ఆది వంటి కమెడియన్లు ఇంకా ప్రాచుర్యంలోకి తెచ్చారు… అదొక పైత్యపు పిశాచ భాష… సరే, అది నయం, కనీసం వేరే అక్షరాలతో కవర్ చేస్తున్నారు… కానీ ఈ కుర్చీ మడతపెట్టే భాష స్ట్రెయిట్ బూతే కదా… మరి అలాంటి పదాల్ని లీడ్‌గా తీసుకుని తమన్ అనే అత్యుత్తమ సంస్కార సంగీత దర్శకుడు ఓ పాట చేశాడు…
Hyping up your new year!! Here's the promo of #KurchiMadathapetti#TrivikramSrinivas @MusicThaman @sreeleela14 @Meenakshiioffl #RamajogayyaSastry @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine @adityamusic #GunturKaaramOnJan12th pic.twitter.com/tP9HPN8TvA
— Mahesh Babu (@urstrulyMahesh) December 29, 2023
Ads
దీన్ని షేర్ చేస్తున్నందుకు సారీ… ఒకసారి నేపథ్యంలోకి వెళ్దాం… ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్, రాంచరణ్ ఫుల్ పాపులర్… తృటిలో ఆస్కారూ తప్పింది… సలార్‌తో ప్రభాస్ నేషనల్ స్టార్… పుష్పతో బన్నీ కూడా బాగా పాపులర్… ఎటొచ్చీ మన మహేశ్ బాబుకు ఆ రేంజ్ సినిమా ఒకటి కావాలి… సరే, త్రివిక్రమ్ పదునైన దర్శకుడే… ఇదే మహేశ్ బాబుకు అతడు, ఖలేజా ఇచ్చినవాడే… ఖలేజా బాగానే ఉంటుంది గానీ ఎందుకో కమర్షియల్ సక్సెస్ కాలేదు, కానీ అతడు ఆల్‌టైమ్ హిట్…
ఈ స్థితిలో ఫ్యాన్స్ ఆశలు, మహేశ్ ఆశలు కూడా రాబోయే గుంటూరు కారం సినిమా మీద కాన్సంట్రేట్ అయి ఉన్నయ్… ఎవరెవరో ఈ సినిమాటీం నుంచి వెళ్తున్నారుట, ఇంకెవరో వస్తున్నారుట అని ఏవేవో వార్తలు… వాటినలా వదిలేస్తే రెండు పాటలు రిలీజ్ చేశారు… ఒకటి పర్లేదు, రెండోది ఫ్యాన్స్‌కే నచ్చలేదు… సోషల్ మీడియా వేదికగా ఫుల్లు తిట్టిపోశారు… ఓ మై బేబీ ట్యూన్‌తోపాటు సాహిత్యం మీద కూడా భారీ ట్రోలింగ్ సాగింది… ఆ దెబ్బకు ఏవేవో విఫల సమర్థనలు చేసుకున్న సదరు సరస్వతీ పుత్ర రామజోగయ్య చివరకు తన ట్వీట్ ఖాతానే డియాక్టివేట్ చేసుకున్నాడు…
ఇప్పుడు మూడో పాట ప్రోమో రిలీజ్ చేశారు… అది స్టార్ట్ కావడమే ‘కుర్చీ మడతపెట్టి..’ అని…! శ్రీలీల, మహేశ్, గ్రూప్ డాన్సర్లు స్టెప్పులేస్తున్నారు… శ్రీలీలతో మహేశ్ ‘కుర్చీ మడతపెట్టి…’ అంటున్నాడంటే… ఆమె మెడలు ఇరుగుతయ్ అని చెబుతున్నట్టా..? లేక మరో -డ్యాష్- పదాన్ని చెప్పబోయి ఆగిపోతున్నట్టా..? అసలు మహేశ్ బాబు పాటల నుంచి ఇలా ఎక్స్‌పెక్ట్ చేయగలమా..? ఏమో… రామజోగయ్య, తమన్ మహేశ్‌ను ఏదేదో చేసేస్తారేమో…
సరే, తమన్ అంటేనే కాపీల మాస్టర్… ఐనా పర్లేదు, కానీ ఇదేమిటి..? ఈ దౌర్భాగ్యం దేనికి..? సరే, తమన్‌కు సిగ్గు లేదు, కానీ త్రివిక్రమ్‌కు ఏమైంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.,.ఈ వెగటుతనం ఏమిటి గురూ…? మహేశ్ బాబు సినిమాల్లో, పాటల్లో, డైలాగుల్లో బూతులు, అశ్లీలం ఉండవు… సంసారపక్షంగా, సంస్కారపక్షంగా ఉంటయ్… మరి ఇదేమిటిలా..? ఏకంగా తన సంసార, సభ్య పోకడల్ని మరీ ‘కుర్చీ మడతపెట్టి…’ అంటూ ఏదో చేస్తున్నట్టున్నారు సంగీత దర్శకుడు, పాటల రచయిత, దర్శక ఘనుడు… హేమిటో ఇది…
అవునూ, మహేశ్ బాబైనా ఎందుకు యాక్సెప్ట్ చేశాడు..?! తన సోషల్ మీడియా వేదికలుగా ప్రమోట్ చేస్తున్నారు ఈ ప్రోమోను… సరే, ఫాఫం శ్రీలీల..!! ఈ పాట గురించిన చర్చ వచ్చినప్పుడు ఓ మిత్రుడు ‘‘పాట రాసినోడిని కుర్చీ మడతపెట్టి…’’ అని ఆపేశాడు…!! అన్నట్టు ఓ మై బేబీ రాసిన ఆ సరస్వతీపుత్రుడి కలం నుంచేనా ఈ అద్భుత, అమోఘ, అనితర సాధ్యమైన సాహిత్యం వెలువడింది…!! @urstrulymahesh, @namratashirodkar @directortrivikramofficial, @musicthaman,
Share this Article