Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం సుమ… గంగ మరీ డర్టీ చంద్రముఖిగా మారిపోయింది…!!

November 1, 2024 by M S R

ఛిఛీ… ఈ తిరస్కార, వ్యతిరేక, ఏవగింపు పదాన్ని వాడటానికి ఏమాత్రం సందేహించడం లేదు… అంతటి సుమ చివరకు నాలుగు డబ్బుల కోసం ఎంత దిగజారిపోతోంది అనిపించింది…

పేరుకు పైకి శుద్ధపూస… ఎవడూ టచ్ చేయొద్దు, చేస్తే అక్కడే మొగుడికి వివరణ ఇచ్చుకునేంత సాధ్వీమణి… తీరా చూస్తే తాజా సుమ అడ్డా అనే అడ్డమైన షో చూస్తుంటే, అనవసరంగా ఈమెను మన తెలుగింటి ఆడపడుచుగా అనవసరంగా ఆదరించామా అనిపిస్తుంది… ఎవడు హర్టయినా సరే, అదే నిజం…

తెలుగులో ఫ్లూయెన్సీ మాత్రమే కాదు… కాస్త పద్ధతిగా ప్రిరిలీజులు, టీవీ షోలు చేసుకుంటూ సినిమా తారలకన్నా అధికంగా, కొన్ని తరాలకు సరిపడేలా సంపాదించేసిన సుమ ఒకప్పుడు గుడ్… కానీ ఇప్పుడు..? ఓ కొత్త దరిద్రం…

Ads

సుమ అడ్డా తాజా ప్రోమో చూస్తుంటే… టీవీ బూతులకు కొత్త దశల్ని చూపిస్తున్న హైపర్ ఆది నయం అనిపిస్తున్నాడు… వాడంటే మగాడు… మరి నీకేమైందమ్మా అనడుగుతారా..? డబ్బొస్తే ఏదైనా సరే అన్నట్టుంది ఆమె పోకడ…

కొడుకును అదేదో వల్గారిటీ ఎక్కువైన సినిమాలో ప్రమోట్ చేసింది కదా… తనే పలు షోలలో పాల్గొన్ని ప్రమోట్ చేసింది కదా… అయిపోయింది కదా… మరి సుమ అడ్డా పేరిట మళ్లీ ఈ అడ్డమైన షోలు ఏమిటమ్మా సుమాంటీ…? ఐదారుగురు సీఏలు కష్టపడితే తప్ప లెక్క తేలని ఆస్తులు అంటారు… మరి ఈ అడ్డమైన దిగజారుడు దేనికి సుమాంటీ…

తాజా ప్రోమోలో పొట్టేల్ సినిమా ప్రమోషన్… అసలు సుమ అడ్డా అంటే సినిమాల ప్రమోషన్… డబ్బులు తీసుకోవడం, ఏదో పిచ్చి టాస్కులు… అంతే, అదే ప్రమోషన్… మీ దుంపతెగ, ఎక్కడ తయారయ్యార్రా బాబూ…

అసలే రియాజ్ అనే పొట్టి కేరక్టర్… టైమింగ్ కాదు గానీ బుల్లి తెరపై చూస్తుంటే ఏదో ఎలపరం… దీనికితోడు వెగటు కామెడీ… తాజా ప్రోమోలో ఓచోట… చేయి కావాలి, కాలు కావాలి, వీడిది అని ఆపేస్తాడు… వెంటనే నోయల్ రెండు అయిపోయాయి, ఇంకేమీ అడగకురా నాయనా అంటుంటాడు… థూ, మీ టీవీ షో… పక్క నుంచి అనన్య నాగళ్ల నవ్వుతూ ఉంటుంది… ఏం అర్థమైందమ్మా నీకు… నువ్వూ సుమలాగే తయారయ్యావు..?

మొత్తం ప్రోమో చూస్తేనే అలా ఉందంటే..? ఇక షో ఎంత దరిద్రంగా ఉందో… సుమ తాజా పోకడల్లాగే… నీకేం తక్కువమ్మా..? మరీ ఇంత దిగజారి… మరీ జారి… ఎక్కడికో పాతాళానికి పోతున్నట్టున్నావు… అవునూ, రాజీవ్ కనకాల నువ్వూ కలిసే ఉంటున్నారా..? చాన్నాళ్లుగా విడివిడిగానే బతుకుతున్నారన్నారు… నిజమేనా..? ఆ ఫ్రస్ట్రేషనేనా ఇది..!!

చివరగా…. చివరికి శ్రీముఖి నీకన్నా నయం అనిపిస్తోంది సుమా… Seriously….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…
  • కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!
  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions