సిగ్గూశరం లేని అనంత శ్రీరామ్ రాసిన ఆ వెకిలి, లేకి, వెగటు, బూతు, దరిద్రపు పాటకు ఎన్ని వ్యూస్ వచ్చాయో అని యూట్యూబ్ చూస్తే 34 లక్షల దాకా దాటిపోయింది… హబ్బో… మనవాళ్ల టేస్టుకు తిరుగులేదు, ఇదే కదా మన సినిమా మూర్ఖులకు అసలు బలం అనుకున్నాను… సర్లే, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆది నుంచీ ఇదే టైపు కదా… ఆమధ్య సిరివెన్నెల అనే మరో ఘన చరితార్థ దరిద్రుడు ‘‘ఓ పూజా హెగ్డే, నీ కాళ్లు మొక్కుతా, నీ కాళ్లు చూస్తే నాకు మస్తు కిక్కొస్తుంది, నీ కాళ్ల మీద పురుగునై బతుకుతా’’ అన్నట్టుగా ఓ పాట రాశాడు కదా, ఫాఫం, అనంత శ్రీరామ్‌ది ఏముందిలే… కుర్రకుంక, ఇప్పుడిప్పుడే బూతులు నేర్చుకుంటున్నాడు, ఎప్పుడో వేటూరి అంతటి బూతూరి అనుకున్నాం కదా… పోనీలే, పాపం, తెలిసీ తెలియని అజ్ఞానంలో పడి నాకేట్టి, సెట్టినాగ వంటి పైత్యాన్ని ప్రదర్శించాడు, దిగిపో దిగిపో అని నాగరాజును ఎటువైపో దారి చూపిస్తున్నాడులే అనుకున్నాం కదా… ఓసారి తన ఫేస్‌బుక్ పేజీకి వెళ్లి చూశాను… అబ్బో, నా పాటకేంటి, సూపర్, బంపర్, జంపర్, మస్తు వ్యూస్ అని రాసుకున్నాడు కదా… ఆఫ్టరాల్ ఓ పాత జానపద వాక్యాన్ని వాడుకున్నాను, ఆ అజ్ఞాత రచయితకు నా పాదాభివందనాలు అంటూ అసలు వివాదాన్ని డైవర్ట్ చేసే ‘లేకి తెలివి’ చూపించాడు కదా… ఓసారి జనం ఏమంటున్నారో చూద్దాం అని పరిశీలిస్తే…
వందల మంది బూతులు తిడుతున్నారు… మామూలుగా కదా, తమలోని ఆగ్రహాన్ని స్పష్టంగానే వ్యక్తీకరిస్తున్నారు… కిక్కుమనడం లేదు అనంతుడు… బహుశా ఈ కుక్కలు అవే మొరిగీ మొరిగీ ఊరుకుంటాయిలే అనే ఓ మూర్ఖపు అంచనా కావచ్చు… ఏమో, సిరివెన్నెల, వేటూరికన్నా నేనేం తక్కువ అనే బలుపు వంటి పొగరు కూడా కావచ్చు… ఇక్కడ అనంత శ్రీరామ్ అనే మూర్ఖుడు చేసిన తప్పు ఏమిటంటే… పూర్తిగా వివాదాన్ని తన మీదకు డైవర్ట్ చేసుకోవడం…. మొదట్లో ఏమనుకున్నారు అందరూ..? థమన్ అనే బుద్ధిహీనుడు తనకు అలవాటైన రీతిలో ఓ భక్తిపాటను కాపీ కొట్టాడు, సిగ్గులేదు, శరం లేదు అని తిట్టుకున్నారు… కానీ థమన్ అంతే కదా.., ఆ నిర్మాత, దర్శకులు అసలు శరరహితులు అని భావించారు… దిగు దిగు దిగు నాగా, దివ్యాసుందర నాగా అనే ఆ పాపులర్ పాటను సొమ్ము చేసుకోవాలనుకున్నాడు, తన బతుకంతా అదే కదా అనుకున్నారు… ఆ దుమారం ఏదో థమన్ మీదే సాగితే అయిపోయేది… ఈ అనంతుడికి తీట ఎక్కువున్నట్టుంది…
Ads
ఫేస్‌బుక్‌లో రెండు పోస్టులతో వివాదాన్ని తన వైపుకి డైవర్ట్ చేసుకున్నాడు… ఇన్నాళ్లు కాస్త పరువూప్రతిష్ట కలిగిన ఫ్యామిలీ కదా అనే సానుభూతి ఉండేది తనపై అందరికీ… ఇప్పుడంతా మట్టికొట్టుకుపోయింది… ఈ అనంతుడూ ఆ బూతు ప్రసిద్ధుడే, పైగా ప్రేక్షకుల పట్ల అగౌరవం, తేలికభావం, అమర్యాద కలిగినవాడే అని అందరికీ అర్థమైపోయింది… చివరకు ఆ 34 లక్షల వ్యూస్ ఉన్న వీడియో మీద కామెంట్లలో కూడా బోలెడు మంది నోటికొచ్చినట్టు తిడుతున్నారు… ఆ సిగ్గూశరం లేని బతుకెందుకూ అంటారా..? భలేవారే, ఎంత ఎక్కువ మంది తిడితే అంత పాపులారిటీ వస్తుందట ఈమధ్య… థమన్ అనే కాపీ క్యాట్ అదృష్టవంతుడు… అన్ని దొంగ ట్యూన్లూ క్లిక్కవుతున్నయ్, కిక్కిస్తున్నయ్, కాసులొస్తున్నయ్… ఇదీ అంతే… మరి అసలు తప్పు ఎవరిది..? 34 లక్షల వ్యూస్ కారకులది…! ఖచ్చితంగా…!! చివరగా… ఓ మిత్రుడు అన్నాడు… మంగ్లీకి సంబంధం లేకున్నా సరే తిట్టిపోశారు కదా, మరి ఈ పాటలో వెగటు స్టెప్పులు వేసిన రీతూవర్మను కదా నిందించాల్సింది అని…. తప్పు… ఆమెకన్నా జబర్దస్త్ ఫహామీ వంద రెట్లు నయం కదా అనిపించింది…! జాలేసింది…!!
Share this Article