.
సిగ్గూశరం ఏమాత్రం లేకుండా పీకుడు భాష వాడుతున్నారు కదా… ఎహె, నేను ఆమె బిడ్డ గురించి కాదు మాట్లాడేది.., టాలీవుడ్‌లో చాలామంది క్రీచర్స్ గురించి… తాజాగా బన్నీ వాసు అట, ఎవరో… అసలు పేరేమిటో… అత్యున్నత సంస్కారంతో పెరిగిన ఆ కేరక్టర్ పూర్వరంగం ఏమిటో తెలియదు…
సినిమా హీరోయిన్ల సైజుల గురించి కూడా తాగిన కూతలు కూసిన వాళ్లనూ చూశాం కదా… వెధవలు, వాళ్ల సినిమాల్లాగే వాళ్ల మాటలు… అదేదో ఓ చెత్తా సినిమా తీశాడు బన్నీ వాసు అట… మిత్రమండలి… అది షార్ట్ ఫిలిమ్‌కు ఎక్కువ, ఫీచర్ ఫిలిమ్‌కు తక్కువ… అది తన నీచాభిరుచి… నెత్తిమాసిన టేస్ట్…
Ads
ఆ దరిద్రానికి మళ్లీ సమర్థన… బుక్ మై షో వాడు, సినిమా టికెట్ల మీద వ్యాపారం చేస్తూ వాడు రేటింగ్స్ ఇవ్వడం ఏమిటి అంటాడు… ఎవడు నా సినిమా మీద రేటింగ్స్ ఏమిచ్చినా, నా వెంట్రుక కూడా పీకలేడు అంటాడు… ఇంకా ఎక్స్‌ట్రీమ్ వెళ్లడానికి తన సంస్కారం అడ్డొస్తుందట… ఆహా, ఏం సంస్కారంరా నాయనా..? నీ వెంట్రుకల భాష సేమ్, నీ సినిమాల టేస్టులాగే దరిద్రంగా ఉంది…
బరాబర్… నీ సినిమా జనం మీదకు వదిలినప్పుడు… అంటే, సమాజం మీదకు వదిలినప్పుడు… నీ చెత్తా అసభ్య, గలీజు సినిమాల మీద సమీక్ష జర్నలిస్టులు, రివ్యూయర్లు ఏదైనా రాస్తారు..? నువ్వు ఎన్ని కోట్లు పెడితే ఎవడిక్కావాలి..? ఎవడు అడిగాడు నిన్ను ఆ పెంట సినిమా తీయాలని..!!
సరే, మారుతి అండ్ బ్యాచ్ దాని మీద కూడా దొంగనాకొడుకుల భాష అంటూ వెక్కిరిస్తూ ఏదో వీడియో పెట్టినట్టున్నారు… పనికిమాలిన బ్యాచ్ బండ్ల గణేష్ మధ్యలో ఎందుకు దూరాడో తెలియదు… తను ఏదో కూశాడు… అవసరమా..? ఇది మరో దిక్కుమాలిన కేరక్టర్… తనకు ఏ సంబంధమూ లేదు…
పోనీ, ఇదంతా కావాలని ఏదో నెగెటివ్ పబ్లిసిటీ కావాలని కోరుకుని ప్రయోగిస్తున్న ఎత్తుగడే అనుకుందాం… కానీ అంతిమంగా జరిగేది ఏమిటి..? ఆ నిర్మాత ఎవరో గానీ తన ఇజ్జత్ బర్బాద్ కావడం… ఆ సోయి కూడా లేనట్టుంది… ‘క్వార్టర్’ బుర్ర ఫాఫం…
వీళ్లంతా సమాజానికి నీతులు చెబుతారు, ప్రభుత్వాలు ఈ వెధవలకు సాగిలబడతాయి… ఈ బుర్రల పైత్య ధోరణులకు డప్పులు కొట్టే వెబ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు సరేసరి… ఏం దరిద్రాన్ని నింపుతున్నార్రా మీరంతా… మీ పీకుడు సంస్కారమూ తమరి బొంద..!!
ఈ తెలివిలో రెండుమూడు శాతం మీ సినిమాల నాణ్యత మీద, సారీ, సంస్కారం మీద కాన్సంట్రేట్ చేస్తే… మరో నలుగురు ప్రేక్షకులు ఎక్కువ వస్తారు కదా థియేటర్లకు…. ఇదుగో ఈ దిక్కుమాలిన వేషాలు, కేరక్టర్ల వల్లే జనం థియేటర్లకు రావడం మానేశారు… అదీ అసలు నిజం…!! అవునవును… అచ్చంగా ఫిలిమ్ జర్నలిస్టుల్లాగే దిగజారిపోతున్న సెలబ్రిటీలు… దొందూ దొందే..!!
Share this Article