మనం కొన్ని కథనాలు రాసినప్పుడు బూతులు, ఇతర అభ్యంతరకర పదాలు రాయాల్సి వస్తే… మధ్యలో డ్యాష్ పెట్టి వదిలేస్తుంటాం… పాఠకులే అర్థం చేసుకోవాలి… కానీ కొన్నిసార్లు ఇష్యూను సరిగ్గా వివరించాలంటే ఆ పదాల్ని యథాతథంగా రాయకతప్పదేమో… రానాలు, వెంకటేశులే పచ్చి బూతుల అడల్ట్ సినిమాలు తీస్తుంటే… అంతటి రామోజీరావే తన టీవీ రేటింగ్స్‌కు జబర్దస్త్ వంటి బూతుషోను ఆశ్రయిస్తుంటే… విష్వక్సేన్ వంటి హీరోలు ఓ రీతిలేని బతుకును ఆవిష్కరించుకుంటుంటే… ఆఫ్టరాల్ మనమెంత..?
ఆ అవసరం కోసం ఒకటీరెండు బూతుపదాల్ని యథాతథంగా రాయకతప్పింది కాదు… నాగరికులైన సభ్యసామాజికులు క్షమింతురుగాక..! విషయంలోకి వెళ్తే… విష్వక్సేన్ అనబడే ఓ నటుడు సారీ, హీరో అట… ఉన్నాడు కదా… నోరిప్పితే బూతు… తెలంగాణ భాషలో చెప్పాలంటే… రీతి లేని మనిషి… అంటే ఓ పద్దతీపాడూ, మర్యాద, కల్చర్ తెలియనివాడు అని అర్థం… గతంలో పలు ఉదాహరణలు చూశాం, టీవీ9 స్టూడియోలో దేవితో వివాదం కూడా తెలుసు కదా… అదేనండీ, ఓ ప్రాంక్ వీడియో ప్రచారం చేయించుకుని ఘోరంగా అభాసుపాలయ్యాడు కదా… ఎస్, తనే…
మరో తాజా ఉదాహరణ ఏమిటంటే..? మాస్ ధమాకా అవార్డ్స్ పేరుతో జీతెలుగు చానెల్ రాబోయే ఉగాది కోసం ఓ స్పెషల్ షో ప్లాన్ చేసింది… ఎప్పటిలాగే భీకరమైన అరుపులతో శ్రీముఖి యాంకరింగు… ఇప్పుడు ఏ చానెల్‌లో చూసినా ఆమే యాంకరింగు కదా… మాస్ ధమాకా అవార్డ్స్ అని పేరు పెట్టారు… ఇదే విష్వక్సేనుడు దర్శకత్వం వహించి, హీరోగా కూడా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకు ప్రమోషన్ అన్నమాట… జీతెలుగు ఏం ఖర్మ..? మన తెలుగు చానెళ్లు సినిమా ప్రమోషన్లు అనగానే, ఏ గడ్డి అయినా తింటాయి తెలుసు కదా..
Ads
సరే, పండుగ షో అంటే నాలుగు పాటలు, ఆడ-మగ బ్యాచుల పోటీలు, కిట్టీ పార్టీలు, పిచ్చి గెంతులు, వెకిలి జోకులు… అంతేకదా…
ఈ షో ప్రోమో ప్రకారం చూస్తే… మొదట ఇంటింటి రామాయణం ప్రమోషన్ టీం వచ్చింది… లేడీ కమెడియన్ రోహిణి కాస్త ఓవరాక్షన్ చేసింది… షో చివరలో ఈ విష్వక్సేనుడు ఎంటరయ్యాడు… ఓ దశలో శ్రీముఖి ఏదో అడిగింది… విష్వక్ ‘వాని ఇంట్ల నా ఇంజన్ పడదెంగుతా’ అని ఓ నీచమైన బూతు వాక్యాన్ని ఉచ్చరించాడు… ఇక్కడ విశేషమేమిటంటే…
శ్రీముఖి ఇలాంటి ఫ్యామిలీ షోలకు యాంకరింగు చేయడంలో ప్రసిద్ధురాలు కదా… ఆ బూతును ఎంజాయ్ చేస్తూ అరుస్తోంది.., ఫాఫం, రోహిణి ఫ్యామిలీ టైప్ కమెడియన్‌గా మారిపోతోంది కదా… ‘‘వినిపియ్యలేదు, మల్ల చెప్పు’’ అంటోంది… అబ్బే, ఇంత మంది లేడీస్ ముందు.. అని ఏదో పెద్ద సందేహిస్తున్నట్టుగా అడిగాడు విష్వక్… తను అనాల్సిన బూతు అనేసి, పైగా పైకి కవరింగు… ఇమ్మూ అనే ఇంకో కేరక్టర్ ఈమధ్య పాపులర్ అవుతోంది తెలుసు కదా… ‘ఆడవాళ్లే ఎక్కువగా కోరుకుంటున్నారు, అర్థం కాలేదు మీకు’ అని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా తన వెగటు మాటలు…
తరువాత విష్వక్సేన్ పడదెంగా అంటే అర్థం చింపేయడం అంటూ ఏదో చెప్పబోయాడు… అది నోరేనా..? పడదెంగుతా అనే పదాన్ని కాస్తా హిందీలోని పాడ్ దేంగా అనే పదంగా మార్చేశాడు అప్పటికప్పుడు… పాడ్ దేంగా అంటే చింపేస్తా అనే అర్థం… శ్రీముఖి నోటిని ఏ బ్రాండ్ ఫినాయిల్‌తో కడగాలో గానీ ‘అది చింపేస్తారట’ అంటోంది రోహిణితో… ఆమె ‘మీరూ మీరూ చింపుకొండి’ అని సైలెంట్ అయిపోయింది… ఏక్‌సేఏక్… థూవీబచె… ఇది ఉగాదిరోజున ప్రసారం చేస్తారట… వీటిని పంచాంగశ్రవణంలాగా మనం విని పునీతులం అయిపోవాలట… అసలు విష్వక్సేన్ తప్పేముందిలే… తన నోరే బూతులకు ప్రసిద్ది… ఓ రీతి లేని మనిషి… జీతెలుగు వాడికి ఏం పుట్టింది..? ఇదా ఆ మేనేజ్‌మెంట్ ప్రసారం చేయబోయే ఫ్యామిలీ షో..? సిగ్గూశరం యాంకర్లకు లేవు, కమెడియన్లకు లేవు… హీరోలకు లేవు… ఛానెల్ వాళ్లకు లేవు… ఏం బతుకులురా..? అందరూ రానానాయుళ్లు అయిపోతున్నారు కదరా…
Share this Article