Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మిథున్ డిస్కోడాన్సర్‌తో పోలిక… బాలయ్య డిస్కోకింగ్‌కు శాపమైంది…

May 24, 2025 by M S R

.

Subramanyam Dogiparthi…. హిందీలో బ్లాక్ బస్టరయిన డిస్కో డాన్సర్ సినిమాకు రీమేక్ బాలకృష్ణ నటించిన డిస్కో కింగ్ సినిమా . 1974 లో బాల నటుడిగా అరంగేట్రం చేసిన బాలకృష్ణ 1980s కు సోలో హీరోగా నట యాత్ర సాగించారు .

1984 కు చిరంజీవి , బాలకృష్ణ హీరోలుగా సెటిల్ అయ్యారు . 1986 లో నాగార్జున , వెంకటేష్ తమ నట యాత్రను ప్రారంభించారు .

Ads

జూన్ 7 , 1984 న రిలీజయిన ఈ డిస్కో కింగ్ భారీ ఓపెనింగ్సుతో ఓపెన్ అయినా డిస్కో డాన్సర్ అంతగా సక్సెస్ కాలేదు . హిందీ సినిమాలు ఎక్కువగా చూడని నాలాంటి వారు కూడా డిస్కో డాన్సర్ చూసి ఉండటం డిస్కో కింగుకు కొంతమేర నష్టం చేసింది .

హిందీ సినిమాలో డిస్కో ప్రోగ్రాములు చాలా భారీగా తీసారు . పైగా ఉర్రూతలూగించే ట్యూన్స్ కంపోజిషన్ ఆ సినిమాను ఓ రేంజులో ఆడించింది . ఆ స్థాయిలో మన తెలుగు సినిమాలో డిస్కో డాన్సుల ప్రోగ్రాముల చిత్రీకరణ ఉండదు .

బాలకృష్ణ కష్టపడ్డా పక్కన హీరోయినుగా తులసి బదులు ఏ విజయశాంతి వంటి హీరోయిన్ని పెట్టి ఉంటే బాగుండేదేమో ! యన్టీఆర్ వారసుడు కావటం , హిందీ సినిమా బ్లాక్ బస్టర్ కావటం వలన ఏర్పడిన భారీ అంచనాలతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి . తెలుగులో రంగనాధ్ ధరించిన పాత్రను హిందీలో రాజేష్ ఖన్నా ధరించారు . ఆ పోలిక కూడా వచ్చింది . ఏ సత్యనారాయణ అయితే బాగుండేదేమో !

ఈ పోస్టుమార్టాన్ని పక్కన పెడితే  పాటలన్నీ సూపర్ హిట్టే . సంగీత దర్శకుడు చక్రవర్తి హిందీ ట్యూన్లనే వాడటం వలన , అప్పటికే ఆ ట్యూన్లు జనం హమ్మింగులో ఉండటం వలన పాటలన్నీ హిట్టయ్యాయి . ముఖ్యంగా హవ్వ హవ్వ పాట . సుధాకర్ మీద ఉంటుందీ పాట . కుర్ర ప్రేక్షకులు అక్కడక్కడా థియేటర్లలో డిస్కో వేసేసారు .

ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ చదరంగం పాట ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ . సినిమా ప్రారంభంలో , క్లైమాక్సులో వస్తుంది . రంగనాధ్ , బాలకృష్ణల మీద ఉంటుంది . చుక్కలాంటి చక్కనమ్మ , నువ్వే నువ్వే నాలో ఊగే ప్రాణం , అబ్బాడి అమ్మాడి , పట్టిందల్లా బంగారమే డ్యూయెట్లు కుర్రాళ్ళని ఊపేసాయి . అంతే కాదు , కుర్రాళ్ళలో గిటార్ మేనియా కూడా వచ్చేసింది .

కొడుకు కెరీర్ కోసం మరో యువకుడి కెరీర్ని నాశనం చేద్దామని ప్రయత్నించిన ఓ తండ్రిగా జగ్గయ్య , కొడుగ్గా సుధాకర్ , ఆ కొడుకు చేత అవమానించబడే పర్సనల్ మేనేజరుగా నూతన్ ప్రసాద్ చాలా బాగా నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో సుమిత్ర , అనుపమ , మిక్కిలినేని ప్రభృతులు నటించారు . బుల్లి మీనా , హిందీ డాన్సర్లు లీనాదాస్ , సీమలు నటించారు . జయమాలిని , జ్యోతిలక్ష్మి , సిల్క్ స్మితలను ఎందుకు ప్రిఫర్ చేయలేదో !!

పాటల్ని వేటూరి , రాజశ్రీ , డైలాగులను గణేష్ పాత్రో వ్రాసారు . తాతినేని ప్రసాద్ దర్శకుడు . డాన్సుల్ని ధనుష్ ప్రభృతులు కంపోజ్ చేసారు . ఎప్పటిలాగే బాలసుబ్రమణ్యం బ్రహ్మాండంగా పాడారు . బాలకృష్ణ , నందమూరి అభిమానులు చూసి ఉండకపోతే ఓసారి తప్పక చూడతగ్గ సినిమాయే .

మ్యూజిక్ , డిస్కో లవర్స్ ఇంతకుముందు చూసి ఉన్నా మళ్ళా చూడవచ్చు . డిస్కో లవర్స్ పనిలోపనిగా హిందీ సినిమా కూడా చూసేయవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు



కొన్ని సినిమాల జోలికి వెళ్లకూడదు… తెలుగులోకి అదే స్థాయి తర్జుమాలు కుదరవు… ఉదాహరణకు డాన్ డానే, ఎన్టీయార్ యుగంధర్ నచ్చదు జనానికి, అమితాబ్ అల్టిమేట్ మూవీ అది.., ఆ పాటలు అవీ సూపర్బ్…

అలాగే డిస్కో డాన్సర్ అప్పట్లో ఓ క్రేజ్… ఎంత అనుకరించినా మిథున్ చక్రవర్తి  స్టెప్పులతో పోలిక బాలకృష్ణ సినిమాకు మైనస్… పైగా తులసి మరో మైనస్… రంగనాథూ నప్పలేదు ఓ పాత్రకు… బప్పీలహరి ట్యూన్స్ సేమ్ కాపీ అండ్ కంపోజ్…

అదేసమయంలో నమక్ హలాల్ వచ్చింది… అమితాబ్ సినిమాల్లో బ్లాక్ బస్టర్ అది… దాన్ని ఏ సినిమాతోనూ పోల్చలేం…. తరువాత మన తెలుగువాళ్లే ఎవరో ఆ సినిమాను రీమేక్ చేస్తే అది డిజాస్టర్…

అందుకే, కొన్ని హిందీ సినిమాల్ని కూడా మన ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు, అలాంటి సినిమాల జోలికి వెళ్తే ఒరిజినల్స్‌తో పోల్చుకుంటారు జనం… ఫలితం ఢమాల్…… ముచ్చట



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారీ సిక్స్ కొట్టాడు… అభినందనలు రాలేదు… చిలుం వదిలింది…
  • హరిహరా..! సమస్య లేదంటున్నావా..? నీకు సమస్య కావద్దంటావా..?
  • అసూర్యంపశ్య…! ఎండ కన్నెరుగని సుతారం బతుకులు అనారోగ్యమే..!!
  • … ఇంతకీ కుందరదన అంటే తెలుగులో అర్థమేమిటి చిరంజీవీ…
  • మిథున్ డిస్కోడాన్సర్‌తో పోలిక… బాలయ్య డిస్కోకింగ్‌కు శాపమైంది…
  • బ్రహ్మోస్ అంటేనే బ్రహ్మాస్త్రం… అది మన యుద్ధసామర్థ్య ప్రకటన…
  • ఒక నరేంద్ర, ఒక ఈటల, ఒక విజయశాంతి… సేమ్, ఒక కవిత..?!
  • స్వరజ్ఞానం లేకపోతేనేం… వెంటాడే ట్యూన్లతో వెండితెరను ఊపేశాడు…
  • పక్కా కమర్షియల్ చట్రంలోనే ఓ ఫిలాసఫీ చెబుతాడు త్రివిక్రముడు…
  • …. ముఖ్య అతిథి సీఎం గారి పెళ్లాం అని తెలియకపోతే ఎలా మరి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions