Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎంతసేపూ ఆడ దేహాలు, మొహాలే… నెట్ సుధీర్‌లకు మగ మొహాలు పట్టవెందుకో..!!

January 21, 2023 by M S R

పింక్ శారీలో జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యను చూస్తే తట్టుకోలేం భయ్యా… నాభి అందాలతో అనసూయ అదుర్స్ స్వామీ… శ్రీముఖి క్లీవేజీతో మతిపోతోంది బాసూ… విష్ణుప్రియ ఎదపొంగులతో ఇక వేడి సెగలే… కొత్త లుక్కులో రష్మి పిచ్చెక్కిస్తోంది చూశారా… జాకెట్ మరిచి దడపుట్టిస్తున్న శ్రీలీల……. ఇలాంటి థంబ్ నెయిల్స్ కోకొల్లలు… యూట్యూబ్ చానెళ్లే కాదు, తెలుగులో మేం తోపులం అని చెప్పుకునే సైట్లు సైతం ఇదే బాట… ఇక సినిమా హీరోయిన్ల విషయంలోనైతే చెప్పనక్కర్లేని హెడింగులు, వర్ణనలు… అబ్బో, అరాచకం…

ఆది నుంచీ వాణిజ్య ప్రకటనలకు ఆడ తొడలు… సైట్లు, ట్యూబ్ వీడియోలకూ నాభి అందాలు… వంపులు, సొంపులు… ఆడ శరీరంలోని ప్రతి అంగానికీ వర్ణన… ఆడ దేహాంగం అదొక అమ్మకపు సరుకు… ఏవో సాధనసంపత్తి లేని చిన్నాచితకా సైట్లు, చానెళ్లు ఏవో వ్యూస్ కక్కుర్తికి పాల్పడ్డాయి సరే… మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించిన సైట్లు కూడా సొల్లు కార్చుకోవడమే… చివరకు టీవీ యాంకర్లు, హోస్టులు సైతం బొడ్డు, చంకలు, తొడలు, ఇతరత్రా స్ట్రక్చర్, ఫిగర్ కనిపించేలా ఫిట్టు పొట్టి అవుట్ ఫిట్లు…

శ్రీముఖి, అనసూయ తదితరుల డ్రెస్ సెన్సులు, నాన్ సెన్సుల గురించి మనం గతంలోనూ చెప్పుకున్నాం… నిజానికి అందమంటే ఆడదేహమేనా..? ఆ కలర్, ఆ ముక్కూమొహం బాగుంటే చాలా..? అసలు మేకప్పులు లేకపోతే చూడబుల్ ఫేసులేనా అవి..? అసలు వర్ష ఆడదేనా అని వెక్కిరిస్తూ బాడీ షేమింగ్ చేస్తారు టీవీ షోలలో… అదే సమయంలో తెల్లచీరలో వర్షను చూస్తే తట్టుకోలేరు అనే థంబ్ నెయిల్‌తో ఆమె ఫోజులు, ఫోటోలు… చివరకు ఆడవేషంలో ఉన్న శాంతిస్వరూప్‌ను కూడా వదలని సుధీర్‌లే వీళ్లందరూ…

Ads

మళ్లీ అదే ప్రశ్న… అందమంటే ఆడదేనా..? ఇన్ని వేల ఫోటోలు, అందాల ఆరబోతల నడుమ ఒక్కటంటే ఒక్క మగమొహం కనిపించదు… అబ్బే, మగ మొహాలేం చూస్తాం భయ్యా అంటారు… మగానికి కిర్రెక్కించేలా ఆడదాని బొడ్డు చూపినట్టు, ఆడాళ్లకు పిచ్చెక్కించేలా ఇదే టీవీ యాంకర్లు, నటుల సిక్స్ ప్యాకులు, బాడీ బిల్డింగులు చూపించొచ్చు కదా… చూపరు… చూపడానికి ఆ సిక్స్ ప్యాకు తప్ప ఇంకేముంది మగాడిలో… ఇదే ఈ కథనరచయితల మూకుమ్మడి అభిప్రాయం… పిటపిటలాడే బన్నీ కండలు చూశారా సిస్టర్ అని ఆడ కథనరచయితల సంఖ్య పెరగాల్సిందే…

టీవీ యాంకర్లపై ఎక్కువగా ఇలాంటి కథలు కనిపిస్తాయి గానీ ఎందుకో పెద్దగా టీవీ సీరియళ్ల హీరోయిన్ల జోలికి వెళ్లరు అదేమిటో… టీవీల్లో ఎక్కువగా కనిపించే మగ మొహాల్లో ఆడోళ్ల మోహాన్ని పెంచేవాళ్లు అందగాళ్లు లేరా..? ఉన్నారు… ఎటొచ్చీ మన మగ మదనకదన కథకులకు ఆ మొహాలు నచ్చవు… ఈసారి ఎప్పుడైనా కాస్త జాగ్రత్తగా గమనించండి… టీవీ యాంకర్లలో ప్రదీప్ ఒకింత బెటర్… కానీ మొన్న బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చిన టీవీ సీరియల్ నటుల్లో మానస్, రోహిత్… కార్తీకదీపం నిరుపమ్, మనసిచ్చిచూడు (శుభస్య శీఘ్రం) మహేశ్… వీళ్లందరినీ మించి త్రినయనిలో చందు గౌడ… వీళ్లందరూ టీవీ శోభన్ బాబులే… ప్చ్, ఒక్కడూ రాయడు… సారీ, ఒక్కతీ రాయదు… చందు హెయిర్ స్టయిల్ చూశావా సిస్టర్, పిచ్చెక్కుతోంది కదా అని థంబ్ నెయిల్ పెట్టేసి ఒక్క స్టోరీ కనిపించదు… మగ అందంపై నెట్ వివక్ష నశించాలి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
  • పార్లె జీ బిస్కట్స్… ఈసారి విషాద వార్తల్లోకి… అంతర్జాతీయ ఖ్యాతితో…
  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions