అనుకుంటున్నదే… ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వందల టన్నుల బురదను ఎత్తిపోసుకుంటున్నాయి తెలుసు కదా… బ్లేమ్ గేమ్ పీక్స్… బుడమేరు పాపం నీదే, కాదు నీదే అని తిట్టుకుంటున్నాయి… ఈ దశలో జగన్ మైక్ సాక్షి ఈ బురద చర్చలోకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యాక్టివ్ హైడల్ ప్లాంటును కూడా లాగింది…
ఈ ప్లాంటు మునిగిపోకుండా వరదను డైవర్ట్ చేయడం వల్ల ముంపు సమస్య పెరిగిందని నిన్నటి సాక్షి కథనం… రాధాకృష్ణ అంటేనే చంద్రబాబు కదా, సో దాన్ని కూడా చంద్రబాబు మెడకే చుట్టే ప్రయత్నం చేసింది… దీనికి ఈరోజు రాధాకృష్ణ ఏం బదులిస్తాడో చూద్దామనే ఆసక్తి కలిగింది అందరికీ… స్పందించాడు… రేపు సెలవు కదా, ఈరోజే కొత్త పలుకు రాసేశాడు… అప్పట్లో వైఎస్, మొన్న జగన్ దాన్ని మూసేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారనీ, సాక్షి మీడియా గనుక తన ఆరోపణల్ని రుజువు చేస్తే ఆ ప్లాంట్ జగన్ క్యాంపుకే రాసిస్తానని రాధాకృష్ణ సవాల్…
Ads
ఇవన్నీ జరిగేవి కావు, సవాళ్లు- ప్రతిసవాళ్లు రాసుకోవడానికే తప్ప, ఫీల్డులో ఏమీ జరగవని అందరికీ తెలుసు కానీ… తను రాసుకొచ్చిన వివరణలో కొన్ని అంశాలు కాస్త నవ్వు పుట్టించాయి… ‘‘1998లో ఈ ప్లాంటు ఏర్పాటు విషయం అసలు చంద్రబాబుకు తెలియనే తెలియదు… జెన్‌కో పాలసీ ప్రకారం ఇచ్చారు… నిజానికి ఇబ్రహీంపట్నం లోతట్టు ప్రాంతాలకు ఈ ప్లాంటు ఓ రక్షణ… వరదలు వస్తే మా ప్లాంటు కూడా మునుగుతుంది… ఇప్పుడు కూడా మునిగింది…’’ ఇవన్నీ తన వ్యాసంలో ఉన్నవే… (ప్లాంటు మునిగిన ఫోటో కోసం వెతికితే పత్రికలో కనిపించలేదు… రాధాకృష్ణ స్పందన ఇంకా ఘాటుగా ఉంటుందని అనుకుంటే, ఆ స్పైసీ పంచ్ కూడా కనిపించలేదు…)
మరి ప్లాంటు తనే మునిగిపోయినప్పుడు, లోతట్టు ప్రాంతాలకు అది రక్షణగా ఎలా నిలుస్తున్నదో మనం అడగకూడదు… ఫాఫం, చంద్రబాబుకే ఆ ప్లాంటు ఏర్పాటు గురించి తెలియదట… అవునూ, ఓ ప్రభుత్వ రంగ థర్మల్ ప్రాజెక్టు కోసం ఉద్దేశించిన నీటి కాలువపై ప్రైవేటు హైడల్ ప్లాంటు ఎందుకు, ఎవరు ఇచ్చారు సారూ..? కట్టుకోవాలనుకుంటే ఆ చిన్న హైడల్ ప్లాంటు కట్టుకునే సోయి, తెలివి జెన్‌కోకు లేవా అప్పట్లో ఫాఫం..?
సరే, ఇదంతా కాసేపు వదిలేస్తే.,. బుడమేరు పాపం మొత్తం చంద్రబాబుదే అని చెప్పడానికి జగన్ క్యాంపు నానా ప్రయత్నాలూ చేస్తోంది పాపం… వరద విషయం తెలిసీ అప్రమత్తం చేయకపోవడం, కరకట్టపైన చంద్రబాబు నివాసం మునిగిపోకుండా డైవర్ట్ చేయడమే ముంపుకి కారణం వంటివి రాస్తోంది… ఊదరగొడుతోంది… ఎహె, బుడమేరు ఆధునీకరణ పనుల్ని జగన్ రద్దు చేసిపారేయడం, జగన్ మనుషుల ఆక్రమణలే కారణమని టీడీపీ క్యాంపు ఎదురుదాడి… (ప్లాంటు ఎన్వోసీ రద్దుపై రాధాకృష్ణ కోర్టుకు వెళ్లడంతోనే బుడమేరు పనులు చేపట్టలేకపోయినట్టు సాక్షి రాసుకొచ్చింది… ఎన్టీయార్‌కు వెన్నుపోటు సమయంలో తనకు సహకరించినందున రాధాకృష్ణకు ఆ ప్లాంటు ఏర్పాటుకు సాక్షాత్తూ చంద్రబాబే సహకరించారని సాక్షి ఆరోపణ…)
ఏపీ రాజకీయాలు అనగానే… ఈనాడు ప్లస్ మార్గదర్శి అనివార్యంగా చర్చల్లోకి వస్తున్నట్టుగానే… ఆంధ్రజ్యోతి ప్లస్ హైడల్ ప్లాంటు వచ్చేయడం అసాధారణంగా అనిపించడం లేదిప్పుడు… ఇప్పుడొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం కదా… వెంటనే మార్గదర్శికి ఎలా అండగా నిలబడ్డాడో, ఆ హైడల్ ప్లాంటుకూ అలాగే అండగాా నిలబడతాడు, నేచురల్… పాపం, తనకు తెలియకుండా ప్లాంటు ఏర్పాటైనా సరే..!!
Share this Article