.
పాపం, శమించుగాక… ఇప్పుడు అందరికీ గుర్తొస్తున్నవి రెండు పేర్లు… 1) మనోహర్ పర్రీకర్ 2) యోగి ఆదిత్యనాథ్…
మనోహర్ పర్రీకర్ నిజంగానే నిజాయితీ, నిరాడంబరత, నిక్కచ్చితనం ఎట్సెట్రా లక్షణాలకు ఓ ఐకన్‌గా నిలిచాడు వర్తమాన రాజకీయాల్లో… మళ్లీ దొరకడు తను…
Ads
మనల్ని ఆదుకున్న ఎయిర్ డిఫెన్స్ ఎస్-400 విషయం కొనుగోళ్లకు సంబంధించిన చొరవ, సంప్రదింపులు తనే డీల్ చేశాడు… పట్టుబట్టాడు… అమెరికా ఆంక్షలంటూ బెదిరించినా సరే తూచ్ ఫోఫోవోయ్ అన్నాడు… అఫ్‌కోర్స్, తన సొంత నిర్ణయాలు కాదు, ప్రభుత్వంలోని చాలామంది ముఖ్యుల పాత్ర ఉంటుంది…
ఐనాసరే తెర మీద కనిపించింది పర్రీకర్ మాత్రమే… ఆహా, ఇప్పుడు తను ఉండి ఉంటే ఎంత బాగుండేది అని ఓ అభిప్రాయం నెటిజనంలో వినిపిస్తోంది బాగా…
ఎస్-400 మాత్రమే కాదు… చాలా యుద్ధ సంబంధ కొనుగోళ్లలో తనదైన ముద్ర వేశాడు తను… ఇక వేరే పేరు యోగి… ఎందుకంటే, తను పెద్ద కుర్చీలో గనుక ఉండి ఉంటే కథ వేరేగా ఉండేది, ఇప్పటికే పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చేది, పీవోకే మన వశమైపోయేది, ఇజ్రాయల్‌కు ఉన్న టెంపర్‌మెంట్‌లో పది శాతం కూడా మనకు లేకపాయె అని మరో అభిప్రాయం కూడా నెటిజనంలో ఉంది…
మనకు ఏం కావాలో మనం నిర్ణయించుకోలేమా..? అమెరికా ఏది చెప్పినా తలొగ్గాలా అనేది చాలామందిలో అసంతృప్తి… పైగా అమెరికాను, ట్రంపును అస్సలు నమ్మలేం… ఏవో దేశాలు, ఏవో కారణాలతో మన తుపాకీని దించేలా చేశాయి… ఎందుకు..? అది బయటికి రాదు, రానివ్వరు… అదంతే…
సరే, యుద్ధ విరమణకు (కాల్పుల విరమణకు) చాలా కారణాలున్నా సరే… తప్పనిసరై మనం అంగీకరించాల్సి వచ్చినా సరే… జాతీయవాదుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది… ఎందుకంటే..? చాన్స్ దొరికింది,.. వాడి స్టామినా ఏమిటో తేలిపోయింది… ఈ టెంపోలోనే పీవోకే స్వాధీనం చేసుకుంటే, మరో నాలుగు దెబ్బలు గట్టిగా తగిలిస్తే భలే ఉండేదనేది ఆ అభిప్రాయాల సారాంశం… తన్నాక గానీ పోరా అని వదిలేస్తే బాగుండేదట…
నిజానికి ఈ విరమణను వాస్తవవాదులు ఊహిస్తున్నదే… ఐతే వాడిని ఏమేం దెబ్బలు కొట్టామనేది బయటకు రావల్సి ఉంది… కానీ మోడీ నిరాశపరచాడనే అభిప్రాయం బీజేపీ వాదుల్లోనే బలంగా వినిపిస్తుండటం విశేషమే… నాడు నోట్ల రద్దు దగ్గర నుంచి, మేఘాల చాటు నుంచి విమానాలు సర్జికల్ స్ట్రయిక్స్‌కు వెళ్లడంతోపాటు ఇదుగో ఈ పహల్‌గామ్ దాకా తవ్వుతూ మరీ నిందిస్తున్నారు చాలామంది…
ఐతే ఇక్కడ మోడీ నిర్ణయమే ఫైనల్ కాదు… అది అంగీకరించాలి… ప్రపంచ రాజకీయాల్లో చాలా సమీకరణాలు ఉంటాయి… నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ దోభాల్, విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ దేశం గురించే ఆలోచించి, ఆచితూచి వ్యవహరించే కేరక్టర్లు… వాళ్లు మోడీని, దేశాన్ని తప్పుదోవ పట్టించారు అని ఎవరూ అనలేరు…
సో, మనం యుద్ధవిరమణకు ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది అనే విషయంలో నిష్పాక్షిక, లోతైన వివరణలు, విశ్లేషణలకు ఎదురుచూద్దాం… అన్నట్టు గతంలో ఇందిరాగాంధీ దాదాపు లక్ష మంది పాక్ సైనికులు బందీలుగా చిక్కినా పీవోకేను తీసేసుకోకుండా ఎందుకు వాళ్లను వదిలేసింది..? కారణాలు ఎవరికీ ఇప్పటికీ తెలియవు… తెర వెనుక చాలా లెక్కలుంటాయి… ప్రస్తుత మోడీ యుద్ధవిరమణ చర్య వెనుక కూడా అంతే… చరిత్రలో కొన్ని మిస్టరీలు… నేతాజీ మరణం, ఎల్‌బీశాస్త్రి మరణంలాగే…!!
Share this Article