హిందువులపై… హిందూ సంస్కృతిపై… హిందూ మతంపై… దాడులు ఈరోజు కొత్తేమీ కాదు… హిందూ జాతినే సమూలంగా నిర్మూలించన్నంత కసిగా జరిగిన దాడులు కూడా ఉన్నయ్… జరుగుతూనే ఉంటయ్… అది కాదు, జగన్ ప్రభుత్వం వచ్చాక ఏపీలో అకస్మాత్తుగా హిందూ వ్యతిరేక శక్తులు బలం పుంజుకోవడం అనేది హిందూ మతాభిమానులకు కలవరం కలిగిస్తున్న పరిణామం… ఆల్రెడీ హిందూ పరిరక్షణ సంఘాలు రాష్ట్రంలో జోరుగా మతమార్పిళ్లు సాగుతున్నాయనీ, క్రిస్టియానిటీ చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోందని ఆరోపిస్తున్నాయి… అదుగో అక్కడ అలా జరిగిందట, ఇదుగో ఇక్కడ ఇలా జరిగిందట… వంటి ప్రచారాన్ని నమ్మాల్సిన పనిలేదు… కానీ..?
అంతర్వేది రథదహనం నుంచి ఇదుగో ఇప్పుడు విజయనగరం కోదండరాముడి విగ్రహధ్వంసం దాకా బోలెడు సంఘటనలు జరిగాయి… విజయనగరం జిల్లా, రామతీర్థంలో బోడికొండపై ఉన్న గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఇదుగో ఇలా తలను తొలగించి, కోనేట్లో పడేశారు… ఆ ఆలయ పూజారి చేతుల్లో ఉన్నది అదే… ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది…
Ads
జగన్ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయటానికి యాంటీ-జగన్ శక్తులు ఇవన్నీ చేస్తున్నాయనేది వైసీపీ పార్టీ శ్రేణుల అభిప్రాయం… నిజమే కావచ్చు… అలాంటి కుట్రలు జరగవని చెప్పలేం… ఉద్దేశపూర్వకంగా డిస్టర్బ్ చేయడానికి… పోనీ, బీజేపీకి-జగన్‌కూ నడుమ అగాధాన్ని పెంచడానికి ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం చేయిస్తున్నారు అని కాసేపు నమ్ముదాం…
ఎవరు..? తెలుగుదేశం వాళ్లేనా..? మరి ఎందుకు జగన్ ఉపేక్షిస్తున్నట్టు..? చంద్రబాబు చుట్టూ ఉండే ఆర్థిక స్థంభాల దగ్గర్నుంచి, ఏదో మారుమూల వార్డు కార్యకర్త దాకా బోలెడు కేసులతో తెలుగుదేశం కేడర్ తాటతీస్తున్న జగన్ ఈ పరిణామాలనెందుకు వదిలేస్తున్నాడు..? ఒక్క కేసులోనైనా ‘‘జరిగింది ఇదీ’’ అని ఒక్క నిందితుడినీ పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టలేదేం..? ఇది పోలీసుల అసహాయతా..? లేక… జరిగితే జరిగిందిలే, హిందూ దేవుళ్లే కదా అనే ఓ నిర్లక్ష్యపూరిత ధోరణా..? నిజమే.., హిందూ సంఘాలు అన్నట్టుగా వేరే మతానికి చిన్న అపచారం జరిగితే జగన్ ప్రభుత్వం ఇలాగే కిమన్నాస్తిగా ఉండిపోయేదా..?
రాముడి విగ్రహాన్ని పునఃప్రతిష్టిస్తాం, రథం కాలిపోతే కొత్తది చేయిస్తాం… ఇవి కాదు… అవి భక్తులు చేసుకోగలరు… నిందితులు ఎవరు..? ఎందుకు చేస్తున్నారు..? అది కదా బయటపడాల్సింది… పోనీ, జగన్ మీద కుట్రలు జరుగుతున్నా సరే, తానేమీ చేయలేని దుస్థితిలో ఉండిపోయాడా..? అది తనకు మరీ డేంజర్ కదా… ఎహె, ఇలాంటివి జరిగితే జరగనీలే, మేం ఎవడికీ జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు 151 సీట్లు ఇచ్చారు, ఈ యాంటీ-జగన్ శక్తులు ఎన్ని చేసినా మా ఈక కదలదు…. అన్న ధోరణే గనుక నిజమైతే… సమాజం చాలామందిని చూసింది…!! అంతెందుకు..? తెలంగాణలో అంతటి శక్తిమంతుడు కేసీయార్ ఎలా తల్లడిల్లిపోతున్నాడో చూడటం లేదా మనం..?!
జగన్ ఇవి చేయిస్తున్నాడని ఎవరూ అనడం లేదు… అలా ఎవరైనా ఆరోపిస్తే అది మూర్ఖత్వం.,.. కానీ జగన్ ఏం చేస్తున్నాడు..? ఈ ప్రశ్నకు జవాబు మాత్రం తను చెప్పుకోవాల్సిందే… అక్కడ అయోధ్యలో భవ్యమందిరాన్ని నిర్మించుకుంటూ, ఇక్కడా విరాళాలు పోగుచేస్తున్నవేళ… ఓ రాముడి తల నరకబడితే, సగటు హిందూ మతాభిమాని కడుపు రగిలిపోవడంలో ఆశ్చర్యం లేదు… అది క్రమేపీ జగన్‌పై కోపంగా పరిణమిస్తే అసహజమూ కాదు… సోము వీర్రాజు ప్లేసులో బండి సంజయ్ గనుక ఉండి ఉంటే, బీజేపీ స్పందన ఇంత చచ్చుబడినట్టుగా మాత్రం ఉండేది కాదు…
Share this Article