Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… డీఎంకే తాజా పొలిటికల్ కుప్పిగంతుల వెనుక మద్యం ఉచ్చు..!!

March 15, 2025 by M S R

.

( పొట్లూరి పార్థసారథి )…… తమిళనాడు మద్యం కుంభకోణం! పార్ట్ -1 ద్రావిడ దేశం నాటకం!

ప్రాంతీయ పార్టీల అవసరం మన దేశానికి ఉందా?
అవినీతి, అక్రమార్జన లేనంత వరకూ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా పెద్దగా భేదం ఏమి ఉండదు!

Ads

అవినీతి, అక్రమార్జన అనేది ఇప్పుడు ప్రాంతీయ, జాతీయ పార్టీ అనే భేదం లేకుండా ఒక సాంప్రదాయం అయి కూర్చుంది. అంచేత అది ఏ పార్టీ అన్నది ప్రధానం కాదు. తన అవినీతి బయట పడినప్పుడల్లా ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ అనే తేడా లేకుండా దేశ సమగ్రతని దెబ్బ తీసే విధంగా రాజకీయం చేస్తున్నాయి.

ఖాంగ్రెస్ జాతీయ పార్టీనే కానీ దేశ రక్షణ విషయంలో లెక్కలేనన్ని, దిద్దలేని తప్పులు చేసింది. CPI, CPM లని కాంగ్రెస్ పెంచి పోషించిన సంగతి మనకి తెలుసు. సోవియట్ రష్యా, చైనా మానస పుత్రికలు CPI, CPM పార్టీలు. సోవియట్ యూనియన్ విచ్చిన్నం గురుంచి అడిగితే పెట్టుబడిదారి, సామ్రాజ్యవాద అమెరికా కుట్ర అంటాయి కానీ తమ సిద్ధాంతంలో లోపాలు ఉన్నాయని ఒప్పుకోవు! అదే పెట్టుబడిదారీ, సామ్రజ్య వాద దేశాలు చైనాలో పెట్టుబడి పెట్టడాన్ని తప్పుపట్టవు.

 

********
ENFORCEMENT DIRECTORATE Vs TASMAC!

TASMAC – తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంక్షిప్త రూపం TASMAC లేదా టాస్ మాక్.

తమిళనాడులో మద్యం పంపిణి మరియు నియంత్రణని చేసేది టాస్మాక్! తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థ టాస్మాక్!

ED చేసిన తనిఖీలలో మనీ లాండరింగ్ జరిగింది అని బయటపడ్డది!

పై పైన చేసిన తనిఖీలలో 1,000 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది అని ED చెప్తున్నది. ఇది నీటి పైన కనిపించే చిన్న మంచు ముక్క లాంటిది. అదే నీటి లోపలికి వెళ్లి చూస్తే పెద్ద మంచుకొండ కనిపిస్తుంది అని ED అధికారులు చెప్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే 10 వేల కోట్ల మనీ లాండరింగ్ బయటపడుతుంది అని ED చెప్తున్నది!

ఎలా జరిగింది?

మనకి ఇంతకుముందు ఇలాంటి కేసుల్లో జరిగినవి ఏమిటో తెలుసు కాబట్టి వాటికి భిన్నంగా ఏమి జరగలేదు!

1.టాస్మాక్ అధికారులు, రాజకీయ నాయకులు, డిస్టిలరీ యాజమాన్యాలు కలిసి అవినీతికి పాల్పడ్డారు.

2.మద్యం డిస్టిల్లరిలు అయిన SNJ, KALS, ACCORD, SAIFL, SHIVA కంపెనీలు మరియు మద్యం సీసాలు తయారు చేసే సంస్థలు అయిన దేవి బాటిల్స్, క్రీస్టల్ బాటిల్స్ సంస్థలు ఒక దానితో ఇంకొకటి కుమ్మక్కయి మనీ లాండరింగ్ కి పాల్పడ్డాయి.

3.మద్యం డిస్టల్లరీస్ మరియు మద్యం సీసాలు తయారుచేసే సంస్థలు తమకి వచ్చిన అర్థర్ల ని ఎక్కువగా చూపించి, వాటికి తగ్గ ఖర్చులని కూడా ఎక్కువ అయినట్లు రికార్డులు తారుమారు చేశాయి. తనిఖీలలో తయారు అయిన మద్యం మరియు సీసాలు తక్కువగా ఉన్నాయి. ఇది మరింత లోతుగా పరిశీలిస్తేనే కానీ మోసం బయటపడదు.

4.లెక్కల్లో చూపని ఆదాయాన్ని టాస్మాక్ అధికారుల జేబుల్లోకి వెళ్లిపోయాయి. మద్యం అమ్మే రిటైల్ షాపులలో సీసా MRP మీద 10 రూపాయలు ఎక్కువగా అమ్మి ఆ డబ్బులు టాస్మాక్ ద్వారా రాజకీయ నాయకులకి వెళ్లాయి.

5.టాస్మాక్ మద్యం రవాణా కోసం టెండర్లు పిలిస్తే వచ్చిన అప్లికేషన్స్ కొద్దిగానే ఉంటే ఫైనలైజ్ చేసింది ఒకే ఒక్క టెండర్ ని. ఆ టెండర్ వేసిన అతను టెండర్ ముగింపు తేదీ లోగా కట్టాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో టాస్మాక్ కి ఇవ్వాలి కానీ DD ఇవ్వకపోయినా టెండర్ అతనికే ఇచ్చారు!

6.మద్యం రవాణా టెండర్ ఇచ్చాక సదరు వ్యక్తి సెక్యూరిటీ డిపాజిట్ DD ఇచ్చాడు టాస్మాక్ కి కానీ DD ఇచ్చిన వ్యక్తి తాలూకు KYC ( Know Your Customer) వివరాలు వేరువేరుగా ఉన్నాయి. అంటే టెండర్ ఎవరికైతే దక్కిందో అతను కట్టలేదు డిపాజిట్. కాబట్టి మద్యం రవాణా టెండర్ ఎవరికో బినామీకీ ఇచ్చారు.

7.బార్ లైసెన్స్ లు జారీ చేయడానికి భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలు దొరికాయి. మద్యం రవాణా టెండర్ ఇచ్చినందుకు కూడా భారీ మొత్తంలో ముడుపులు ఇచ్చినట్లు టాస్మాక్ ఆఫీసులోనే ఆధారాలు దొరికాయి!

8.SNJ డిస్టిలరీ మార్కెటింగ్ ఖర్చుల నిమిత్తం అంటూ 20 కోట్లు DMK పార్లమెంట్ సభ్యుడికి చెందిన సంస్థకి చెల్లింపులు చేసినట్లు ఆధారాలు దొరికాయి. మొదట రికార్డులలో 20 కోట్లు చెల్లించినట్లు వ్రాసి తరువాత దానిని కొట్టివేసినట్లు ఆధారాలు దొరికాయి.

9.బార్ లైసెన్స్ లు ఇవ్వడానికి నిబంధనలు పక్కన పెట్టి లంచాలు తీసుకొని ఇచ్చినట్లు ఆధారాలు దొరికాయి.

10. బార్ లైసెన్స్ ఇచ్చిన వారికి GST/ PAN నంబర్స్ లేవు. కనీసం KYC వివరాలు కూడా లేవు కానీ బార్ పెట్టుకోవడానికి లైసెన్స్ ఇచ్చేసారు!

11.డిస్టిలరీలకి భారీగా అర్థర్లు ఇచ్చినందుకు టాస్మాక్ అధికారులకి భారీగానే ముడుపులు ఇచ్చినట్లు ఆధారాలు దొరికాయి.

12. టాస్మాక్ యేటా 100 కోట్లు అదనంగా చెల్లిస్తూ వస్తున్నది మద్యం రవాణా సంస్థకి! చెల్లింపులు రవాణా సంస్థకే అదనంగా చేసినా అవి తిరిగి టాస్మాక్ అధికారులకే వెళ్లాయి!

So! తమిళనాడులో మద్యం రిటైల్ షాపులు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మద్యం షాపుకి పేరు ఉండదు కేవలం tasmac వైన్స్ అనే ఉంటుంది. వాటిలో పనిచేయడానికి ఉద్యోగులని tasmac నియమిస్తుంది. ఉద్యోగుల బదిలీ, ప్రమోషన్స్ పేరుతో లంచాలు ముడతాయి tasmac కి, అందులో కొంత రాజకీయ నాయకులకి వెళతాయి.

*******
తమిళ భాషని అడ్డుపెట్టుకొని ఆడుతున్న నాటకం కేవలం ED మద్యం కుంభకోణం విచారణని ప్రజల దృష్టి నుండి పక్కదోవ పట్టించడానికే!

కేజ్రీవాల్ కి పట్టిన గతే స్థాలిన్ కి పడుతుంది!

ద్రావిడ ఉద్యమకారుల చెర నుండి తమిళ ప్రజలకి విముక్తి కలగడానికి రంగం సిద్ధం అయింది.

ED ప్రాధమిక విచారణ కోసం మొత్తం 24 ప్రదేశాలలో తనిఖీలు చేసింది! బోగస్ కంపెనీల వివరాలు బయటపడ్డాయి! పూర్తిగా విచారణ జరిగాక సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి! ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణ చేసిన ED అధికారులకి అనుభవం వచ్చింది కాబట్టి TASMAC కుంభకోణం చేధించడం పెద్ద విషయం కాదు ఎందుకంటే మరీ నిర్లక్ష్యంగా TASMAC ప్రధాన కార్యాలయంలోనే డాక్యుమెంట్, డిజిటల్ సాక్ష్యాలు దొరికాయి!

ఏదన్నా రాజకీయ బేరసారాలు జరిగితే తప్ప ఈ సమస్యనుండి DMK బయటపడలేదు!

అఫ్కోర్స్! అన్నామలై ఉన్నాడు అక్కడ! DMK, AIDMK నుండి బీజేపీలోకి ఎవరికి ఆహ్వానం పలికినా నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు గతంలోనే! కాబట్టి బీజేపీ అధిష్టానం DMK విషయంలో తాత్సారం చేయదు అనే అనుకుందాం!

పాత సామాను బయటికి పంపించాలి అని రాజా సింగ్ గారు అన్న మాటకి విలువ ఉంది! అలాంటి పాత సామాన్లు తమిళనాడు బీజేపీలో లేవు! థాంక్స్ అన్నామలై గారికి!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions