Murali Buddha………. రామోజీ రావుకు చట్టాలు వర్తిస్తాయా ? మార్గదర్శి పై హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రధానికి లేఖ అని ఈనాడులో పెద్ద వార్త చూడగానే ఆసక్తిగా చదివాను … జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే అల్లా టప్పా వ్యక్తి కాదు చిట్ ఫండ్ , చట్టం వ్యాపారం గురించి బాగా తెలిసిన వారు అయి ఉంటారు, ఉండవల్లి లేవనెత్తిన ప్రశ్నలకు కచ్చితంగా ఈయన సమాధానం ఇచ్చే ఉంటారు అని చూశా …..
ఒక్క దానికి సమాధానం లేదు … సాధారణంగా మేనేజ్ మెంట్ కష్టాల్లో ఉన్నప్పుడు (ఏ పార్టీ మీడియా ఐనా అంతే) సంస్థ రిపోర్టర్ డ్యూటీలో భాగంగా, తమ బాస్‌కు అనుకూలంగా ప్రకటనలు ఇప్పిస్తారు… వీరే సమాచారం ఇచ్చి, వీరే ప్రకటన రాసి ఇస్తారు … ఇదేమి కొత్త కాదు, ఆశ్చర్యం కాదు, మొదటి సారి కాదు …. అంత పెద్ద ప్రకటనలో ఉండవల్లి లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు… మార్గదర్శిలో ఎంత మంది సిబ్బంది, ఎంత టర్న్ ఓవర్, ఎంత మంది చిట్టీలు వేశారు, ఎంత కాలం నుంచి వ్యాపారం వంటి మార్గదర్శి ceo చెప్పాల్సిన లెక్కలు హిందూ మహా సభ చెప్పింది కానీ … అసలు ప్రశ్నలకు సమాధానం లేదు ….
ఉండవల్లి అడిగినవి రెండే రెండు
Ads
1- అవిభక్త హిందూ కుటుంబ వ్యాపారంలో 22 రకాల బంధువుల నుంచి తప్ప ఇతరుల నుంచి డిపాజిట్లు వసూలు చేయరాదు.
2- చిట్ ఫండ్ వ్యాపారం చేసే వారు ఇతర వ్యాపారం చేయకూడదు.
నాకు అర్థం అయినంత వరకు ఉండవల్లి అడిగింది ఈ రెండే. ఈ రెండూ చట్టంలో ఉన్నాయి అని ఉండవల్లి చెబుతున్నారు. ‘‘తెలుగు వారు ఈ భూమిపై ఇంకా నివసిస్తున్నారు అంటే రామోజీ వల్లనే… ఆయన ధరించే దుస్తులు ఎంత తెల్లవో ఆయన హృదయం అంతే తెల్లనిది… ఆయన లోక కళ్యాణం కోసమే ఊపిరి తీసుకుంటున్నారు… మార్గదర్శి లేకపోతే తెలుగు ప్రజలు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడే వారు…
ఉద్యోగులను కన్న బిడ్డల్లా చూసుకుంటారు. ఆయన కన్నెర్ర చేశాడంటే’’……. ఇలాంటి నమ్మకాలు , వాదనలపై నాకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి నమ్మకాలు వారివి. ఉండవల్లి లేవనెత్తిన రెండు ప్రశ్నలే నాకు తెలుసుకోవాలి అనే ఆసక్తి … డిపాజిట్లు వసూలు చేయవచ్చా, ఇంకో వ్యాపారం చేయకూడదా ? చట్టం ఇలా చెప్పిందా ? తుచ్ఛమైన మానవులకు వర్తించే చట్టాలు రామోజీకి కూడా వర్తిస్తాయా ? అంటే ఇక చర్చే లేదు ….
Share this Article