నాడు పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాక… మన్మోహన్సింగ్ను ఆర్థికమంత్రిగా పెట్టుకున్నాడు… స్వేచ్ఛనిచ్చాడు… రాజకీయాలతో సంబంధం లేని ఓ రిటైర్డ్ బ్యూరోక్రాట్‌ను ఏకంగా ఆర్థికమంత్రిని చేయడం ఏమిటనేది ఎవరికీ అర్థం కాలేదు, విస్తుపోయారు… విమర్శించారు… కానీ రిజల్ట్ చూశాం కదా… బంగారం అమ్ముకునే దశ నుంచి మళ్లీ వేగంగా పుంజుకున్నాం… అఫ్ కోర్స్, టూమచ్ లిబరలైజేషన్ కొన్ని దుష్ఫలితాలనూ ఇచ్చింది… ఆర్థిక మంత్రి అనగానే వైరాగ్యం వచ్చేది ప్రస్తుత మంత్రి నిర్మలా సీతారామన్ పనితీరు చూస్తే… ప్రత్యేకించి ఈ విపత్తు వేళ లక్షల కోట్ల ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ ఓ ప్రహసనంగా, పరిహాసంగా మారిపోయింది… ఇప్పుడు ఇదెందుకు చెప్పుకోవడం అంటే… రాజకీయాల్లోకి బాగా చదువుకున్నతరం రావాలి… ఇప్పటి బేకార్ బ్యాచ్ క్రమేపీ వెళ్లిపోవాలి… ఫైళ్లు కూడా చదవలేని నాయకగణం తప్పుకోవాలి… పార్టీల అధినేతలు కనీసం కీలకమైన శాఖల్లోనైనా బాగా చదువుకున్నవారిని, సంబంధిత సబ్జెక్టు తెలిసిన వాళ్లను పెట్టుకోవడం బెటర్… స్టాలిన్ పీవీ బాటలో చేసిన పని అదే… తన ఆర్థిక మంత్రి విశేషాలు తెలుసా..? ఆయన పేరు పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్.… ఎవరాయన..?
1936లో మద్రాస్ ప్రెసిడెన్సీకి పీటీ రాజన్ అనే ముఖ్యమంత్రి ఉండేవాడు… జస్టిస్ పార్టీకి చివరి అధ్యక్షుడు ఆయన… అదుగో, ఆయన కొడుకు పీటీఆర్ పళనివేల్ రాజన్… ఆయన తమిళనాడు స్పీకర్‌గా, మంత్రిగా కూడా చేశాడు… ఆయన కొడుకు పేరు పీటీఆర్ త్యాగరాజన్… ఇప్పుడు మనం చెప్పుకునే కథానాయకుడు, ఇప్పుడు తమిళనాడు ఆర్థికమంత్రిగా ప్రమాణం చేసింది ఈయనే… అబ్బే, ఇక్కడా కుటుంబ వారసత్వమేనా అని తేలికగా తీసిపడేయకండి… త్యాగరాజన్ Lawrence School, Lovedale లో స్కూలింగ్… తరువాత తిరుచిరాపల్లి (తిరుచ్చి) రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఇప్పుడు ఎన్ఐటీ)లో కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు… తరువాత అమెరికా… State University Of New York, Buffalo లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడు… అక్కడే పీహెచ్డీ కూడా… MIT Sloan School Of Management లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశాడు… ప్రధాన సబ్జెక్టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్…
Ads
అమెరికన్ యువతి మార్గరెట్‌ను పెళ్లి చేసుకున్నాడు… ఆమె కూడా ఇంజనీరే… Lehman Brothers Holdings లో… తరువాత Standard Chartered Bank లో మంచి పొజిషన్లలో పనిచేశాడు… 2006-07లో తండ్రి మరణించాడు… వాళ్లది మధురై సెంట్రల్ నియోజకవర్గం… తమిళనాడు తరహా రాజకీయాల్లోకి రావడంకన్నా మంచి టాప్ కంపెనీల్లో కొనసాగడమే మేలనీ, ప్రస్తుత రాజకీయాలు మరీ మురికి కంపు కొడుతున్నాయనీ స్నేహితులు చెప్పారు… కానీ తను అన్నీ విడిచిపెట్టి వచ్చేశాడు… వచ్చే ముందు భార్యను అడిగాడు, ఆమె సంతోషంగా వచ్చేసింది… ఆమెకు చీరకట్టు, భాష సహా దక్షిణ తమిళనాడు కల్చర్ మొత్తం నేర్పించింది ఆయన తల్లి… మదురై సెంటిమెంట్ కదా, ఆమెకు మీనాక్షి అని పేరు పెట్టారు… అచ్చంగా ఓ భారతీయ గృహిణి అయిపోయింది… త్యాగరాజన్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనేది… 2016లో కూడా తను ఎమ్మెల్యే అయ్యాడు… ఇప్పుడు తనను ఆర్థికమంత్రిగా ఎంచుకోవడం స్టాలిన్ తెలివైన నిర్ణయం… త్యాగరాజన్ వంటి విద్యాధికులు రాజకీయాల్లోకి రావాలి… సంపాదన ఎట్సెట్రా విషయాలు వదిలేయండి… స్థూలంగా రాజకీయాల తీరు, పాలసీ వ్యవహారాలు మారుతాయి…! నొటోరియస్ ఐఏఎస్ అధికారుల సొంత పైత్యాలు కూడా తగ్గుతాయి… కనీసం అలా ఆశిద్దాం…!!
Share this Article