.
Narendra Guptha...
గుడిమల్లం… తిరుపతి నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది ఈ ఊరు. ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా ఈ గుడి దర్శనం కలగదు అంటుంటారు. తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాలి అనుకున్నా కూడా వెళ్ళలేరు చాలామంది.
మేము మొదటిసారి వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్ దెబ్బేసింది. అయినా వదలలేదు. మ్యాప్ ను మాన్యువల్ గా పరిశీలించి వెళ్ళాం. మేం వెళ్ళేసరికి రాత్రి 7 దాటింది. గుడి బంద్ అయిపోయింది. గేట్ తాళాలు వేసి ఉన్నయ్.. చాలా బాధేసింది. సాయంకాలం 6 తర్వాత గుడి మూసేస్తారు. చిన్న గ్రామం.
Ads
మా అదృష్టానికి గుడి నిర్వాహకులు ఆరోజు గుడి ప్రాంగణంలో ఉన్నారట.. మేము గేట్ దగ్గర ఉన్నది చూసి, ఆ గ్రామస్తుడు ఒకాయన నిర్వాహనకులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి గేట్ తీసారు. మేము వెంటనే లోపలికి ఉరికి.. ఒక ప్రదక్షిణ చేసి గర్భాలయంలోకి వెళ్ళాం.
అసలు వర్ణించడానికి మాటలు సరిపోవు లోపలి నిర్మాణం. అంతా విచిత్రం. పాము పడగలాగా ఉన్న గర్భాలయ ప్రాకారం, విచిత్రమైన శివలింగ మూర్తి, ఆ స్థలంలో నిలబడితే ఒక డివైన్ వైబ్రేషన్…
ఎంత అనుకున్నా, ఎన్ని ప్లాన్లు చేసినా గుడిమల్లం దర్శనం అంత ఈజీగా కాదు అని అంటుంటారు అక్కడివారు. నాకు మొదటిసారి చిన్న అవాంతరం కలిగినా దర్శనం అయింది. రెండోసారి కుటుంబంతో సహా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మీరూ ట్రై చేయండి.. #గుడిమల్లం #భూమ్మీద మొదటి శివాలయం..
….
గుడిమల్లం శివాలయంలోని ప్రధాన రహస్యం, భారతదేశంలోనే అత్యంత పురాతనమైనదిగా చెప్పబడే శివలింగం, ఇది భూమిపై దొరికే సాధారణ లింగాల వంటిది కాదు, ఒక నల్లరాయితో చేసిన లింగం, ముందు భాగంలో శివుని నిలువెత్తు బొమ్మ చెక్కబడింది, దీనిని గ్రహాంతర మూలం కలిగి ఉండవచ్చునని కొందరు ఊహిస్తారు. ఈ ఆలయం పరశురామేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
గుడిమల్లం శివాలయ రహస్యాలు:
పురాతన లింగం: ఈ ఆలయంలోని లింగం 2600 సంవత్సరాల కంటే పాతది అని చెబుతారు.
విలక్షణమైన రాయి: ఈ లింగం నల్లరాయితో చేయబడింది, ఇది భూమిపై కనిపించే ఇతర శివలింగాలలో ఉండదు.
గ్రహాంతర మూలం?: కొంతమంది పరిశోధకులు, ఈ రాయికి గ్రహాంతర మూలాలు ఉండవచ్చని, బహుశా ఉల్క (meteorite) కావచ్చునని ఊహిస్తున్నారు.
దైవిక నైపుణ్యం: ఈ రాయిని మానవ చేతులు చెక్కలేదని, దైవిక శక్తులచే ఇది సృష్టించబడడమని ఆలయ ఇతిహాసాలు చెబుతాయి.
శివుని నిలువెత్తు బొమ్మ: లింగం ముందు భాగంలో శివుడి పూర్తి నిలువెత్తు చిత్రం చెక్కబడి ఉంది, ఇది లింగానికి విశిష్టతను జోడిస్తుంది.
దేశంలోనే తొలి శివాలయం: ఈ ఆలయం భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం అని, దాని పురాతనత్వానికి సాక్ష్యంగా నిలుస్తుంది అంటారు…
Share this Article