.
బీజేపీకి ద్రవిడ రాజకీయాలు అర్థం కావు… కావని పదే పదే నిరూపితం అవుతూనే ఉంది… అందుకే తమిళనాడు, కేరళ ఎంతకూ కొరుకుడు పడటం లేదు…
జయలలిత మరణించాక… శశికళ కాళ్లుకీళ్లు విరిచేస్తే ఇక అన్నాడీఎంకె ఖాళీ అయిపోతుందనీ, ఆ గ్యాపులోకి జొరబడవచ్చునని భ్రమించింది బీజేపీ… కానీ అది భ్రమేనని త్వరగానే తేలిపోయింది… అప్పట్లో పొత్తు తెంచుకున్న అదే పళనిస్వామి అన్నాడీఎంకే మళ్లీ ఇప్పుడు కావల్సి వచ్చింది, అందుకే తాజాగా ఆ పార్టీని కావలించుకుంది…
Ads
వచ్చే ఎన్నికల్లో పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ఫోకస్ చేస్తూ… కొన్ని చిన్నాచితకా పార్టీలను కూడా కలుపుకుని, ఎన్డీయే బ్యానర్ కింద పోటీచేస్తారు ఇక… అన్నాడీఎంకే షరతులను అక్షరాలా పాటించింది బీజేపీ… వేరే దిక్కులేదు… పళనిస్వామి షరతు ప్రకారమే అన్నామలైని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దింపేసింది…
సరే, ఆ కూటమి కథాకమామిషు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నదనే అంశాన్ని పక్కన పెడితే… అన్నామలై ప్లేసులోకి వచ్చే నైనార్ నాగేంద్రన్ గురించి చెప్పుకోవాలి ఓసారి… తనను కూడా బహుశా పళనిస్వామే ప్రతిపాదించాడేమో… ఎందుకంటే, ఇద్దరూ ఒకే పార్టీ… జయలలిత మరణించాక సదరు నాగేంద్రన్ ఆ పార్టీని వదిలేసి 2017లో బీజేపీలో చేరాడు…
2020 నుంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు… రెండుసార్లు లోకసభకు బీజేపీ నుంచి పోటీచేశాడు గానీ ఓడిపోయాడు… ప్రస్తుతం ఎమ్మెల్యే… జయలలిత మంత్రివర్గంలో ఒకప్పుడు మంత్రి ఈయన… రవాణా, విద్యుత్తు, పరిశ్రమల శాఖలు… రెండు అంశాలు చెప్పుకుందాం…
1) మహా నోటిదురుసు… వైరముత్తు అనే సినిమా గీత, కథారచయిత ఉన్నాడు కదా… 2018లో ఆండాళ్ మీద ఏవో పిచ్చి కూతలకు దిగాడు… తమిళనాట ఇలాంటి కేరక్టర్లు చాలామంది ఉన్నారు కదా… నిన్న పొన్ముడి కూతల గురించీ చెప్పుకున్నాం కదా…
ఐతే సదరు వైరముత్తును చంపి, ఆ నాలుకను కోసి తెచ్చిస్తే 10 కోట్ల బహుమతి అంటూ ఈ నాగేంద్రన్ ప్రకటించాడు… బాగా వివాదాస్పదమైంది కూడా… అప్పట్లో పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు…
2) శుద్ధపూసేమీ కాదు… మంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించిన అక్రమాస్తులు అనే ఆరోపణతో విజిలెన్స్ విభాగం 12 చోట్ల దాడులు నిర్వహించింది… లెక్కకు రాని నగదు, బంగారం, భూముల్ని బోలెడు గుర్తించి చార్జిషీటు దాఖలు చేసింది ఆయన భార్య, నలుగురు బంధువులపై కూడా… బీజేపీకి భలే దొరుకుతారు ఇలాంటోళ్లు…!!
Share this Article